త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IndiGo Flight | ఇండిగో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం.. శంషాబాద్‌లో సేఫ్‌ ల్యాండ్‌

IndiGo Flight | దేశంలో త‌ర‌చూ విమాన ప్ర‌మాదాలు చోటుచేసుకుంటున్నాయి. బుధ‌వారం ఉద‌యం మ‌హారాష్ట్ర‌లోని బారామ‌తిలో (Baramati) ఓ ప్రైవేటు విమానం కుప్ప‌కూలింది (Plane Crash). తాజాగా ఇండిగో విమానానికి (IndiGo Flight) తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది.

G

Hyderabad | Published On Jan 29, 2026, 11.18 am IST

IndiGo Flight | ఇండిగో విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం.. శంషాబాద్‌లో సేఫ్‌ ల్యాండ్‌
Advertisement

త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలో త‌ర‌చూ విమాన ప్ర‌మాదాలు చోటుచేసుకుంటున్నాయి. బుధ‌వారం ఉద‌యం మ‌హారాష్ట్ర‌లోని బారామ‌తిలో (Baramati) ఓ ప్రైవేటు విమానం కుప్ప‌కూలింది (Plane Crash). దీంతో అందులో ప్ర‌యాణిస్తున్న మ‌హారాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి అజిత్ ప‌వార్ (Ajit Pawar) స‌హా న‌లుగురు దుర్మ‌ర‌ణం చెదారు. తాజాగా మ‌రో విమానానికి తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది.

గువారం ఉద‌యం గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం (IndiGo Flight).. శంషాబాద్ ఎయిర్ ‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతున్నది. ఈ క్ర‌మంలో విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. అయితే పైలట్ అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఒక్క‌సారిగా జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌తో అంతా భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు. అయితే ఎలాంటి ప్ర‌మాదం జ‌రుగ‌క‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో నుంచి ప్రయాణికులు దిగిన తర్వాత ఏటీసీ అధికారులు త‌నిఖీ చేస్తున్నారు.

మ‌రోవైపు లాటిన్ అమెరికా దేశం కొలంబియా (Colombia)లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. టేకాఫ్ అయిన కొద్ది నిముషాల్లోనే నోర్టే డి శాంటాండర్ ప్రావిన్సులో సాటేనా ఎయిర్‌లైన్ బీచ్‌క్రాఫ్ట్ 1900D వాణిజ్య విమానం కూలిపోయింది. దీంతో ఓ చ‌ట్ట‌స‌భ్యునితోపాటు 14 మంది మృతిచెందారు. వారిలో ఇద్ద‌రు విమాన సిబ్బంది ఉన్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement