Nikhitha Godishala Murder | అమెరికాలో తెలుగమ్మాయి నిఖిత హత్య కేసు : ఇండియాకు పారిపోయి వచ్చి ఆగ్రాలో దొరికిన ప్రియుడు
అమెరికాలో హత్యకు గురైన హైదరాబాద్ యువతి నిఖిత కేసులో బిగ్ ట్విస్ట్. ఇండియాకు పారిపోయి వచ్చిన ఆమె ప్రియుడిని ఆగ్రాలో పోలీసులు పట్టుకున్నారు.
- అమెరికాలోని మేరీల్యాండ్‌లో 2025 డిసెంబర్ 31న దారుణ హత్యకు గురైన హైదరాబాద్ యువతి నిఖిత గోదిశాల
- హత్య అనంతరం భారత్‌కు పారిపోయి వచ్చిన నిఖిత మాజీ రూమ్‌మేట్ అర్జున్ శర్మను ఆగ్రాలో అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు
- హైదరాబాద్ లాలాపేట పీఎస్‌లో నమోదైన చీటింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఆగ్రాలో నిందితుడిని పట్టుకున్న పోలీసులు
- ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరు
- భారత్-అమెరికా ఒప్పందం కింద అమెరికాకు అప్పగించేందుకు ప్రారంభమైన ప్రక్రియ
Nikhitha Godishala Murder | త్రినేత్ర.న్యూస్ : అమెరికాలో దారుణ హత్యకు గురైన హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల యువతి నిఖిత గోదిశాల కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. నిఖితను దారుణంగా కడతేర్చి, పోలీసుల కళ్లుగప్పి ఇండియాకు పారిపోయి వచ్చిన ఆమె ప్రియుడు, మాజీ రూమ్‌మేట్ అర్జున్ శర్మను ఎట్టకేలకు తెలంగాణ పోలీసులు ఆగ్రాలో అరెస్ట్ చేశారు.
హైదరాబాద్‌కు చెందిన నిఖిత అమెరికాలోని ఎల్లికాట్ సిటీలో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్‌గా (Data and Strategy Analyst) పనిచేసేది. 2025 డిసెంబర్ 31 రాత్రి సుమారు 7 గంటల సమయంలో మేరీల్యాండ్‌లోని కొలంబియాలో ఉన్న అర్జున్ శర్మ (27) అపార్ట్‌మెంట్‌లో ఆమె దారుణ హత్యకు గురైంది. కత్తితో పలుమార్లు దాడి చేసి ఆమెను కిరాతకంగా చంపేశాడు. అనంతరం నిందితుడు అమెరికా నుంచి ఇండియాకు పరారయ్యాడు. అక్కడ కేసు దర్యాప్తు చేసిన హోవార్డ్ కౌంటీ పోలీసులు అర్జున్ శర్మపై ఫస్ట్, సెకండ్ డిగ్రీ మర్డర్ అభియోగాలతో అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.
నిఖిత హత్య వెనుక ఆర్థిక వివాదాలే ప్రధాన కారణమని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 2025 ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో అర్జున్ తన ఉద్యోగం కోల్పోయాడు. ఆ సమయంలో నిఖితతో పాటు ఆమె కుటుంబ సభ్యుల దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇచ్చే విషయంలో తలెత్తిన వివాదాలే హత్యకు దారితీశాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అర్జున్‌కు అమెరికాలోని మరికొందరితోనూ ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు సమాచారం ఉందని వారు తెలిపారు.
డబ్బులు తీసుకుని మోసం చేశాడంటూ నిఖిత తండ్రి ఆనంద్ గోదిశాల ఈ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లోని లాలాపేట పోలీస్ స్టేషన్‌లో అర్జున్‌పై చీటింగ్ (Cheating) కేసు పెట్టారు. ఈ కేసు దర్యాప్తులో లభించిన కీలక ఆధారాలతో నిందితుడు ఆగ్రాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు, ఓ స్పెషల్ టీమ్‌ను పంపించి ఆగస్టు 24న ఓ ఫ్లాట్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై అప్పటికే అమెరికాలో నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) పెండింగ్‌లో ఉండటంతో కేంద్ర దర్యాప్తు సంస్థలకు తెలంగాణ పోలీసులు సమాచారం అందించారు. అనంతరం కేంద్ర ఏజెన్సీలు అర్జున్‌ను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచి, ఆగస్టు 25న కస్టడీలోకి తీసుకున్నాయి. భారత్-అమెరికా నేరస్తుల అప్పగింత ఒప్పందం (Extradition treaty) ప్రకారం.. అమెరికా అధికారుల అభ్యర్థన మేరకు అతడిని యూఎస్‌కు అప్పగించే ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. ఈ అరెస్టుతో నిఖిత హత్య కేసులో తమకు న్యాయం జరుగుతుందని ఆమె కుటుంబం ఆశాభావం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
- ●Sensex | రూ.1 లక్ష పెట్టుబడికి రూ.44 లక్షల లాభం.. ఎఫ్ అండ్ వో క్లోజింగ్ ఆక్షన్ సెషన్ మాయ..
- ●Dasoju Sravan | తెలంగాణ సాంకేతిక విద్యను లాగేసుకుంటున్నారా? ఆనంద్ మహీంద్రాను నిలదీసిన దాసోజు శ్రవణ్
- ●Raksha Bhandhan | రక్షా బంధన్‌ను సెలబ్రేట్ చేసుకున్న స్టార్స్ - అక్కతో మహేష్ - తమ్ముడికి రాఖీ కట్టిన కంగనా రనౌత్
- ●Stock Markets | రెండు రోజుల నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..
- ●Annamalai | అలాంటి సినిమాలు పిల్లలు చూస్తే ఏంటి పరిస్థితి..? టాక్సిక్‌పై అన్నామలై ఫైర్
- ●Telugu Student Ties Rakhi to Modi | ప్రధాని మోదీకి ఢిల్లీలో రాఖీ కట్టిన తెలుగు విద్యార్థిని

Sensex | రూ.1 లక్ష పెట్టుబడికి రూ.44 లక్షల లాభం.. ఎఫ్ అండ్ వో క్లోజింగ్ ఆక్షన్ సెషన్ మాయ..

Dasoju Sravan | తెలంగాణ సాంకేతిక విద్యను లాగేసుకుంటున్నారా? ఆనంద్ మహీంద్రాను నిలదీసిన దాసోజు శ్రవణ్

Raksha Bhandhan | రక్షా బంధన్‌ను సెలబ్రేట్ చేసుకున్న స్టార్స్ - అక్కతో మహేష్ - తమ్ముడికి రాఖీ కట్టిన కంగనా రనౌత్

Stock Markets | రెండు రోజుల నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..



