త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chinese manja | ధూల్‌పేట్‌లో య‌థేచ్ఛ‌గా చైనా మాంజా అమ్మ‌కాలు

Chinese manja | పాత‌బ‌స్తీ ధూల్‌పేట్‌లో చైనా మాంజా అమ్మ‌కాలు య‌థేచ్చ‌గా కొన‌సాగుతున్నాయి. గాలిప‌టాల ఎగుర‌వేత‌కు ప్రాణాంత‌క‌మైన‌ చైనా మాంజాను వినియోగించొద్ద‌ని పోలీసులు, అట‌వీ శాఖ అధికారులు హెచ్చ‌రిస్తున్న‌ప్ప‌టికీ కొంద‌రు మాత్రం పెడ‌చెవిన పెడుతున్నారు.

S

Hyderabad | Published On Jan 6, 2026, 5.37 pm IST

Chinese manja | ధూల్‌పేట్‌లో య‌థేచ్ఛ‌గా చైనా మాంజా అమ్మ‌కాలు
Advertisement

Chinese manja | త్రినేత్ర‌.న్యూస్ : పాత‌బ‌స్తీ ధూల్‌పేట్‌లో చైనా మాంజా అమ్మ‌కాలు య‌థేచ్చ‌గా కొన‌సాగుతున్నాయి. గాలిప‌టాల ఎగుర‌వేత‌కు ప్రాణాంత‌క‌మైన‌ చైనా మాంజాను వినియోగించొద్ద‌ని పోలీసులు, అట‌వీ శాఖ అధికారులు హెచ్చ‌రిస్తున్న‌ప్ప‌టికీ కొంద‌రు మాత్రం పెడ‌చెవిన పెడుతున్నారు.

ధూల్‌పేట్‌లోని బ‌ల‌రాం గ‌ల్లిలో ఓ గాలి ప‌టాల దుకాణ‌దారుడు చైనా మాంజాను విక్ర‌యిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. ఇక ఆ వీడియోలో చైనా మాంజాకు ఉన్న ప‌వ‌రేంటో చూపిస్తున్నాడు. గాలి ప‌టాల ఎగుర‌వేత‌కు ఉప‌యోగించి మ‌మూలు దారాల‌ను చైనా మాంజా తెంపే విధానాన్ని ఆ వీడియోలో చూపించారు. అంత‌టి ప్రాణాంత‌క‌మైన చైనా మాంజాను విక్ర‌యిస్తూ న‌గ‌ర ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెలగాట‌మాడుతున్నార‌ని యానిమ‌ల్ వారియ‌ర్స్ క‌న్జ‌ర్వేష‌న్ సొసైటీ ఫౌండ‌ర్ ప్ర‌దీప్ నాయ‌ర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈ దుకాణ‌దారుడు స్కై వారియ‌ర్ మాంజాను విక్ర‌యిస్తున్నాడ‌ని, ఇది చాలా ఆందోళ‌న క‌లిగించే విష‌య‌మ‌ని నాయ‌ర్ పేర్కొన్నారు. ఇత‌నొక్క‌డే చైనా మాంజా విక్ర‌యించ‌డం లేద‌ని, ధూల్‌పేట్‌లో చాలా మంది విక్రయిస్తున్నార‌ని తెలిపారు. చైనా మాంజా అమ్మ‌కాల‌పై న‌గ‌ర పోలీసులు సీరియ‌స్‌గా స్పందించాల‌ని కోరారు. నిషేధం విధించిన చైనా మాంజాను విక్ర‌యిస్తున్న వారిని అరెస్టు చేసి క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement