ACB Rides | ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం
ACB Rides | ఏసీబీ సోదాల్లో ప్రభుత్వ అధికారులు పట్టుబడి కటకటాల పాలవుతున్నా వారి తీరులో మార్పు రావడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ సోదాలు వెలుగుచూశాయి. మల్టీజోన్ 2 ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి నివాసంలో మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
- ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో సోదాలు
- భారీగా నోట్ల కట్టలు, ఆభరణాలు స్వాధీనం
ACB Rides | త్రినేత్ర.న్యూస్: ఏసీబీ సోదాల్లో ప్రభుత్వ అధికారులు పట్టుబడి కటకటాల పాలవుతున్నా వారి తీరులో మార్పు రావడం లేదు. తాజాగా హైదరాబాద్‌లో మరోసారి ఏసీబీ సోదాలు వెలుగుచూశాయి. మల్టీజోన్ 2 ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి నివాసంలో మంగళవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కూడబెట్టారన్న ఆరోపణల కేసులో ఛత్రినాకలోని నరహరి నివాసం, కార్యాలయం, బంధువుల ఇళ్లతో పాటు 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు కొనసాగుతున్నాయి.
నరహరి ఇంట్లో పడక గదిలో బెడ్ కింద 1.10 కోట్ల రూపాయలను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో నగదు, బంగారు ఆభరణాలు, రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నారు. నరహరి, అతని సోదరుడి ఇళ్లల్లో భారీగా ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌లో ఖరీదైన ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్లు, రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉన్నట్టు తనిఖీల్లో తేలింది. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు సోదాలు ఈ చేపట్టాయి.
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..



