త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Allu Sirish | పండుగ ముగిసినా.. మైకుల మోత‌ ఆగ‌లేదు.. పోలీసుల‌కు అల్లు శిరీశ్ ఫిర్యాదు

Allu Sirish | పండుగ ముగిసినా.. అర్ధ‌రాత్రి వేళ మైకుల‌ మోత‌లు (Loud Music) ఆగ‌లేదంటూ ప్ర‌ముఖ న‌టుడు అల్లు శిరీశ్ (Allu Sirish) పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. హైద‌రాబాద్‌లోని షేక్‌పేట‌ (Shaikpet) లో ఉన్న‌ అపర్ణ వన్ సొసైటీ సమీపంలోని వినోభానగర్ హనుమాన్ ఆలయం నుంచి లౌడ్ మ్యూజిక్ వస్తున్న‌దని పేర్కొన్నారు.

G

Hyderabad | Published On Sep 28, 2026, 9.05 am IST

Allu Sirish | పండుగ ముగిసినా.. మైకుల మోత‌ ఆగ‌లేదు.. పోలీసుల‌కు అల్లు శిరీశ్ ఫిర్యాదు
Advertisement

Allu Sirish | త్రినేత్ర న్యూస్‌: పండుగ ముగిసినా.. అర్ధ‌రాత్రి వేళ మైకుల‌ మోత‌లు (Loud Music) ఆగ‌లేదంటూ ప్ర‌ముఖ న‌టుడు అల్లు శిరీశ్ (Allu Sirish) పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. హైద‌రాబాద్‌లోని షేక్‌పేట‌ (Shaikpet) లో ఉన్న‌ అపర్ణ వన్ సొసైటీ సమీపంలోని వినోభానగర్ హనుమాన్ ఆలయం నుంచి లౌడ్ మ్యూజిక్ వస్తున్న‌దని పేర్కొన్నారు. రోజువారీగా రాత్రి 2 గంటల నుంచి 3 గంటల వరకు మితిమీరిన శబ్ధంతో మైకులు మోగిస్తున్నారని చెప్పారు. గతంలో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో తాను ఫిర్యాదు చేశానని ప్రస్తావించారు.

అయితే, వినాయక నిమజ్జనం (Ganesh Nimmajanam) వరకు సర్థుకుపోవాలని తనకు పోలీసులు సూచించారని తెలిపారు. అయితే సెప్టెంబర్ 25వ తేదీతో గణేశ్ నిమజ్జనం పూర్తి అయినా ఇంకా ఆలయంలో మైకుల శబ్ధం తగ్గలేద‌ని ఎక్స్ వేదిక‌గా ఆందోళన వ్యక్తం చేశారు. నిద్రలేక స్థానిక వయోవృద్ధులు, చిన్న పిల్లలు, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. గతంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసుల నుంచి సరైన స్పందన లేదని వెల్ల‌డించారు. ఇప్పటికైనా ఈ విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోవాల‌ని, త‌గిన‌ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

Advertisement
Advertisement