త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rapido Driver | ర్యాపిడో డ్రైవ‌ర్ స‌మ‌య‌స్ఫూర్తి.. డ్ర‌గ్స్ నెట్‌వ‌ర్క్ గుట్టుర‌ట్టు..

Rapido Driver | సాధార‌ణంగా ర్యాపిడోలో తినుబండారాల‌నో, చిన్నచిన్న వ‌స్తువుల‌తో పంపిస్తుంటారు. అలాగే ఓ వ్య‌క్తి పార్సిల్ బుక్ చేశాడు. దానిని చూసిన ర్యాపిడో డ్రైవ‌ర్‌కు (Rapido Driver) అనుమానం వ‌చ్చింది.

G

Hyderabad | Published On Jun 4, 2026, 2.21 pm IST

Rapido Driver | ర్యాపిడో డ్రైవ‌ర్ స‌మ‌య‌స్ఫూర్తి.. డ్ర‌గ్స్ నెట్‌వ‌ర్క్ గుట్టుర‌ట్టు..
Advertisement

Rapido Driver | త్రినేత్ర‌.న్యూస్‌: సాధార‌ణంగా ర్యాపిడోలో తినుబండారాల‌నో, చిన్నచిన్న వ‌స్తువుల‌తో పంపిస్తుంటారు. అలాగే ఓ వ్య‌క్తి పార్సిల్ బుక్ చేశాడు. దానిని చూసిన ర్యాపిడో డ్రైవ‌ర్‌కు (Rapido Driver) అనుమానం వ‌చ్చింది. డెలివ‌రీ అడ్ర‌స్‌కు కాకుండా నేరుగా పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లాడు. దీంతో ఓ డ్ర‌గ్స్ (Drugs)నెట్‌వ‌ర్క్ గుట్టు ర‌ట్ట‌యింది. దీంతో అత‌ని స‌మ‌య‌స్ఫూర్తికి మెచ్చిన సైబ‌రాబాద్‌ పోలీసులు అధినందించారు. అంతేకాకుండా న‌గ‌దు బ‌హుమ‌తి కూడా ఇచ్చారు.

సత్తు ఆదర్శ్ అనే వ్యక్తి ర్యాపిడోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. మే 31న ఓ వ్యక్తి మేడ్చల్ నుంచి గండిమైసమ్మకు ర్యాపిడో ద్వారా ఓ పార్సిల్ బుక్ చేశారు. ఆ డెలివ‌రీ ఆదర్శ్‌కు కేటాయించ‌డంతో అడ్ర‌స్ వెళ్లి పార్సిల్‌ను పిక‌ప్ చేసుకున్నారు. అయితే దానిపై అనుమానం వ‌చ్చింది. అందరిలా డెలివరీ చేస్తే సరిపోతుంద‌ని అనుకోకుండా.. పార్సిల్ గురించి దుండిగల్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు దానిని తనిఖీ చేయడంతో అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. ఆ పార్సిల్‌ను బుక్ చేసిన రూపేశ్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అత‌డిని బీహార్‌కు చెందిన వ్య‌క్తిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తుచేస్తున్నారు.

స‌మ‌య‌స్ఫూర్తితో వ్య‌వ‌హ‌రించి పోలీసులకు సహకరించిన ర్యాపిడో రైడర్ ఆదర్శ్‌ను కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి అభినందించారు. ఆదర్శ్‌ను శాలువతో ప్రత్యేకంగా సన్మానించి, నగదు బహుమతి అంద‌జేశారు.

12 కోట్ల విలువైన డ్ర‌గ్స్ సీజ్‌..

మ‌రోవైపు తెంగాణ ఈగ‌ల్ పోలీసులు భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. దాదాపు నెల రోజుల పాటు నిఘా పెట్టి.. ఇంట‌ర్నేష‌న‌ల్ డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ ముఠాను ఈగ‌ల్ ఫోర్స్‌ అదుపులోకి తీసుకుంది. కీల‌క నిందితుడితో పాటు 10 మంది డ్ర‌గ్ స్మ‌గ్ల‌ర్ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.12కోట్ల విలువైన హైడ్రోఫోనిక్‌ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ప్రధానంగా థాయిలాండ్‌ నుంచి హైదరాబాద్‌కు గంజాయి సరఫరా చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.

Advertisement
Advertisement