Air Gun Pellet | బాలుడి కంటిలో ఎయిర్ గన్ పెల్లెట్.. విజయవంతంగా తొలగించిన వైద్యులు
Air Gun Pellet | ఓ మూడేండ్ల బాలుడి కంటిలో ఎయిర్ గన్ పెల్లెట్ ప్రత్యక్షమైంది. దీంతో బాధిత బాలుడు తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. బాలుడి కంటిలో ఉన్న పెల్లెట్‌ను హైదరాబాద్ నగరంలోని శంకర కంటి ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు.
Air Gun Pellet | హైదరాబాద్ : ఓ మూడేండ్ల బాలుడి కంటిలో ఎయిర్ గన్ పెల్లెట్ ప్రత్యక్షమైంది. దీంతో బాధిత బాలుడు తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. బాలుడి కంటిలో ఉన్న పెల్లెట్‌ను హైదరాబాద్ నగరంలోని శంకర కంటి ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా తొలగించారు.
కొద్ది రోజుల క్రితం బాధిత బాలుడు తన సోదరులతో కలిసి ఇంట్లో ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఎయిర్ గన్ పెల్లెట్ ప్రమాదవశాత్తు బాలుడి ముక్కులో నుంచి కంటి వద్దకు చేరింది. దీంతో కంటిచూపు మందగించడంతో పాటు తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. చేసేదేమీ లేక తల్లిదండ్రులు అతన్ని శంకర కంటి ఆస్పత్రికి తరలించారు.
బాధితుడిని వైద్యులు పరిశీలించారు. యాంటీరియర్ ఆర్బిటోటమీ సర్జరీ నిర్వహించి పెల్లెట్‌ను విజయవంతంగా తొలగించారు. ఈ మెటాలిక్ పెల్లెట్ 7 నుంచి 8 మి.మీ. వ్యాసార్థంలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శంకర ఐ హాస్పిటల్ క్యాటరాక్ట్ సర్జన్ డాక్టర్ శిరీష్ పొల్కంపల్లి ఆధ్వర్యంలో శస్త్ర చికిత్స నిర్వహించారు.
చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీరామ్ సీమకుర్తి మాట్లాడుతూ.. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో కంటి సమస్యలు వచ్చినా కూడా నివారించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





