త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

H-FAST Rides | ఫాస్ట్‌ఫుడ్ గోదాంలో క‌ల్తీ క‌ల‌కలం.. 110 కిలోల ఫ్రైడ్ చికెన్ సీజ్‌

H-FAST Rides | నిత్యం ప‌ర్యాట‌కుల‌తో ర‌ద్దీగా ఉండే చార్మినార్‌ ప్రాంతంలో క‌ల్తీ క‌ల‌కలం సృష్టించింది. ఓ ఫాస్ట్‌ఫుడ్ గోదాంపై హెచ్-ఫాస్ట్ (H-FAST) టీమ్ శుక్ర‌వారం దాడులు చేసింది. అధికారులు గోదాంలో 90 లీటర్ల కల్తీ నూనె, 110 కిలోల ఫ్రైడ్ చికెన్‌ స్వాధీనం చేసుకున్నారు.

S

Hyderabad | Published On Jun 19, 2026, 1.42 pm IST

H-FAST Rides | ఫాస్ట్‌ఫుడ్ గోదాంలో క‌ల్తీ క‌ల‌కలం.. 110 కిలోల ఫ్రైడ్ చికెన్ సీజ్‌
Advertisement
  • 6 టిన్నుల క‌ల్తీ వంట‌నూనె స్వాధీనం.. ఇద్ద‌రిపై కేసు న‌మోదు

H-FAST Rides | త్రినేత్ర‌.న్యూస్‌: నిత్యం ప‌ర్యాట‌కుల‌తో ర‌ద్దీగా ఉండే చార్మినార్‌ ప్రాంతంలో క‌ల్తీ క‌ల‌కలం సృష్టించింది. ఓ ఫాస్ట్‌ఫుడ్ గోదాంపై హెచ్-ఫాస్ట్ (H-FAST) టీమ్ శుక్ర‌వారం దాడులు చేసింది. అధికారులు గోదాంలో 90 లీటర్ల కల్తీ నూనె, 110 కిలోల ఫ్రైడ్ చికెన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఆహారంలో నిషేధిత పదార్థాలు, రంగుల‌ వినియోగం.. అపరిశుభ్ర వాతావరణంలో ఆహారం తయారీ, నిల్వ చేస్తున్నట్లు గుర్తించారు. స‌ద‌రు గోదాంకు లైసెన్స్ కూడా లేక‌పోవ‌డంతో ఇద్దరిపై కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి. హెచ్-ఫాస్ట్ (హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్) బృందం, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (FSO)తో కలిసి చార్మినార్‌లోని హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న ఒక ఫాస్ట్ ఫుడ్ గోదాముపై ఆకస్మిక దాడి నిర్వహించింది. చార్మినార్‌లోని పంచ్ మొహల్లా, న్యూ లాడ్ బజార్‌లో ఉన్న ‘మెసర్స్ అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ అండ్ గోడౌన్’ ప్రాంగణాన్ని తనిఖీ చేసింది. ఈ తనిఖీలో అత్యంత అపరిశుభ్రమైన, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆహార పదార్థాలను తయారు చేయడం, నిల్వ చేయడం గుర్తించారు. నిషేధిత కృత్రిమ ఆహార రంగులను ఉపయోగించడం, పాడైపోయిన, ప్రమాదకరమైన వంట నూనెను పదే పదే ఉపయోగించడం, నీటి విశ్లేషణ ధృవీకరణ (Water Analysis Certification), నాణ్యత నియంత్రణ చర్యలు లేకపోవడం. కీటకాల నియంత్రణ (Pest Control) లేకపోవడం వంటివి గుర్తించారు.

ఈ దాడుల్లో సుమారు 110 కిలోల తయారు చేసిన ఫ్రైడ్ చికెన్, 6 టిన్నుల వంట నూనె (ఒక్కొక్కటి 15 లీటర్లు), కృత్రిమ రసాయన ఆహార రంగులు స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితుల‌ను అదుపులోకి తీసుకుకొని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్-2006 కింద‌ కేసు న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

క‌ల్తీ ఆహారం వ‌ల్ల ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు..

  • ఫుడ్ పాయిజనింగ్, వాంతులు విరేచనాలు
  • జీర్ణశయాంతర ఇన్ఫెక్షన్లు (Gastrointestinal infections)
  • పదే పదే వాడిన నూనెను ఉపయోగించడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు
  • కృత్రిమ ఆహార రంగుల వల్ల అలర్జీలు, టాక్సిసిటీ (విషపూరితం) కావడం
  • కాలేయం (Liver), మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపే తీవ్రమైన వ్యాధుల ముప్పు పెరగడం

ఇవీ సూచ‌న‌లు..

  • లైసెన్స్ పొందిన సంస్థల నుండి మాత్రమే ఆహారాన్ని కొనుగోలు చేయడం
  • కొనుగోలు చేయడానికి ముందు FSSAI లైసెన్స్‌ను తనిఖీ చేసుకోవాలి
  • కృత్రిమ రంగులు కలిపిన లేదా అనుమానాస్పద ఆహార పదార్థాలను నివారించండి
  • క‌ల్తీ ఆహార పద్ధతులపై అధికారులకు ఫిర్యాదు చేయండి

ఫిర్యాదుల కోసం టోల్-ఫ్రీ నంబర్: 8712661212

 

Advertisement
Advertisement