త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | సూరారంలో ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి

Hyderabad | హైద‌రాబాద్ (Hyderabad) న‌గ‌రంలో వీధికుక్క‌ల (Stray Dogs) స్వైర విహారం కొన‌సాగుతోంది. సూరారం (Suraram) లో ఐదేళ్ల బాలుడిపై వీధికుక్క దాడికి పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో బాలుడి ముఖంపై గాయాల‌య్యాయి.

A

Hyderabad | Published On Jan 22, 2026, 3.04 pm IST

Hyderabad | సూరారంలో ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి
Advertisement

Hyderabad | హైద‌రాబాద్ (Hyderabad) న‌గ‌రంలో వీధికుక్క‌ల (Stray Dogs) స్వైర విహారం కొన‌సాగుతోంది. సూరారం (Suraram) లో ఐదేళ్ల బాలుడిపై వీధికుక్క దాడికి పాల్ప‌డింది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై వీధికుక్క ఒక్క‌సారిగా పైకి దూకింది. స్థానికులు అర‌వ‌డంతో పాటు వీధికుక్క‌ను తరిమేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో ఆ కుక్క బాలుడిని వ‌దిలేసింది. ఈ ఘ‌ట‌న‌లో బాలుడి ముఖంపై గాయాల‌య్యాయి. బాలుడిని చికిత్స కోసం స్థానిక ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఒక‌వైపు వీధికుక్క‌ల అంశంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య‌లు.. అనంత‌రం మేన‌కాగాంధీ, రేణుదేశాయ్‌, రశ్మి గౌత‌మ్ వంటి వారి కామెంట్లు తీవ్ర చ‌ర్చ‌కు దారితీశాయి. ఒక‌వైపు వీధికుక్క‌ల అంశంపై వాడిగా వేడిగా చ‌ర్చ జ‌రుగుతుండ‌గానే దాడుల పరంప‌ర కొన‌సాగుతూనే ఉండ‌డం విశేషం.

Advertisement

తాజావార్తలు

Advertisement