త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad | ట్రాఫిక్ పోలీసుల‌ను పాముతో బెదిరించిన ఆటో డ్రైవ‌ర్.. వీడియో

Hyderabad | డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీల్లో ట్రాఫిక్ పోలీసుల‌కు చిత్రవిచిత్ర ప‌రిస్థితులు ఎదుర‌వుతుంటాయి. కామెడీ చేస్తూనే భ‌యాన‌క ప‌రిస్థితుల‌ను సృష్టిస్తుంటారు మందుబాబులు. ఓ ఆటో డ్రైవ‌ర్ కూడా పోలీసుల‌కు ముచ్చెట‌మ‌లు ప‌ట్టేలా చేశాడు.

S

Hyderabad | Published On Jan 4, 2026, 5.45 pm IST

Hyderabad | ట్రాఫిక్ పోలీసుల‌ను పాముతో బెదిరించిన ఆటో డ్రైవ‌ర్.. వీడియో
Advertisement

Hyderabad | త్రినేత్ర‌.న్యూస్ : డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీల్లో ట్రాఫిక్ పోలీసుల‌కు చిత్రవిచిత్ర ప‌రిస్థితులు ఎదుర‌వుతుంటాయి. కామెడీ చేస్తూనే భ‌యాన‌క ప‌రిస్థితుల‌ను సృష్టిస్తుంటారు మందుబాబులు. ఓ ఆటో డ్రైవ‌ర్ కూడా పోలీసుల‌కు ముచ్చెట‌మ‌లు ప‌ట్టేలా చేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీల్లో భాగంగా త‌న ఆటోను ఆప‌డంతో.. స‌ద‌రు డ్రైవ‌ర్ ఏకంగా పాముతో బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోని చాంద్ర‌య‌ణ‌గుట్ట చౌర‌స్తా వ‌ద్ద శ‌నివారం రాత్రి చోటు చేసుకుంది.

పాత‌బ‌స్తీ చాంద్ర‌య‌ణ‌గుట్ట చౌర‌స్తాలో శ‌నివారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు చేప‌ట్టారు. అటుగా వ‌చ్చిన ఓ ఆటోను ఆపి డ్రైవ‌ర్‌కు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వ‌హించ‌గా, మ‌ద్యం సేవించిన‌ట్లు నిర్ధార‌ణ అయింది. దీంతో పోలీసులు ఆటోను సీజ్ చేశారు. ఆగ్ర‌హంతో ఊగిపోయిన ఆటో డ్రైవ‌ర్.. త‌న ఆటోలో దాచి ఉంచిన పామును త‌న చేతుల్లోకి తీసుకొని, పోలీసుల‌పైకి విసిరేందుకు య‌త్నించాడు. త‌న ఆటోను త‌న‌కు ఇవ్వాలంటూ పామును చూపిస్తూ పోలీసులను భయ‌భ్రాంతుల‌కు గురి చేశాడు. ఆటో డ్రైవ‌ర్‌ను ఇర్ఫాన్‌గా పోలీసులు గుర్తించారు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement