Hyderabad | అనుమానంతో.. భార్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త
Hyderabad | అనుమానంతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన భార్యను తుపాకీతో కాల్చిచంపాడు. ఈ ఘటన మల్కాజ్‌గిరి పరిధిలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
Hyderabad | త్రినేత్ర.న్యూస్ : అనుమానంతో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన భార్యను తుపాకీతో కాల్చిచంపాడు. ఈ ఘటన మల్కాజ్‌గిరి పరిధిలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రియల్ ఎస్టేట్ వ్యాపారి అరుణ్‌కు కొన్నేండ్ల క్రితం స్వర్ణలత అనే మహిళతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే స్వర్ణలతతో విడాకులు తీసుకున్న అరుణ్.. ఆమె సోదరి నిషారాణిని రెండో వివాహం చేసుకున్నాడు. రాణితో కూడా గత కొంతకాలం నుంచి అరుణ్‌కు వివాదాలు ఉన్నాయి.
అయితే బుధవారం ఉదయం మాట్లాడుకుందామని చెప్పి.. నిషారాణి నివాసానికి చేరుకున్నాడు. ఇంటికి రాగానే ఆమెపై కాల్పులు జరిపాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి ఆమె ప్రాణాలు కోల్పోయింది. కాల్పుల శబ్దం విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అరుణ్ మరో వ్యక్తితో కలిసి ఈ కాల్పులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
3 నెలల క్రితమే జైలు నుంచి విడుదల
గతంలోనూ అరుణ్ అంబర్‌పేట్ ఏరియాలో గన్‌తో స్థానికులను బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తుపాకీతో అరుణ్ పోలీసులకు చిక్కాడు. ఈ కేసులో రియల్ ఎస్టేట్ వ్యాపారి జైలు పాలయ్యాడు. ఈ ఏడాది మార్చి నెలలో జైలు నుంచి విడుదలయ్యాడు.
తాజావార్తలు
- ●TGSRTC | టీజీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఐటీ)గా రాజశేఖర్
- ●TGIIC | ఘనంగా ప్రారంభమైన టీజీఐఐసీ ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్
- ●Congress | కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం.. తప్పనిసరిగా హాజరుకావాలంటూ ఆదేశం
- ●Ponnam Prabhakar | మోదీకి నెహ్రూకు.. నక్కకి నాగ లోకానికి ఉన్న తేడా : మంత్రి పొన్నం ప్రభాకర్
- ●Amazfit BIP Max | అమేజ్‌ఫిట్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్.. 20 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్..
- ●Mahesh Kumar Goud | మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ.. బీజేపీ కుట్రనే : మహేశ్ కుమార్ గౌడ్

TGSRTC | టీజీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఐటీ)గా రాజశేఖర్

TGIIC | ఘనంగా ప్రారంభమైన టీజీఐఐసీ ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్

Congress | కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశం.. తప్పనిసరిగా హాజరుకావాలంటూ ఆదేశం

Ponnam Prabhakar | మోదీకి నెహ్రూకు.. నక్కకి నాగ లోకానికి ఉన్న తేడా : మంత్రి పొన్నం ప్రభాకర్





