త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sunkari Narahari Rao | ఎక్క‌డ చూసినా నోట్ల‌క‌ట్ట‌లే.. సుంక‌రి న‌ర‌హ‌రి రావుకి 14 రోజుల రిమాండ్‌..

Sunkari Narahari Rao | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సర్వే, సెటిల్‌మెంట్, భూ రికార్డుల మల్టీజోన్‌-2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావుకు (Sunkari Narahari Rao) న్యాయ‌మూర్తి 14 రోజుల రిమాండ్ (judicial custody) విధించారు. దీంతో ఆయ‌న‌ను చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లించారు.

G

Hyderabad | Published On Jun 17, 2026, 11.52 am IST

Sunkari Narahari Rao | ఎక్క‌డ చూసినా నోట్ల‌క‌ట్ట‌లే.. సుంక‌రి న‌ర‌హ‌రి రావుకి 14 రోజుల రిమాండ్‌..
Advertisement

Sunkari Narahari Rao | త్రినేత్ర‌.న్యూస్‌: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సర్వే, సెటిల్‌మెంట్, భూ రికార్డుల మల్టీజోన్‌-2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావుకు (Sunkari Narahari Rao) న్యాయ‌మూర్తి 14 రోజుల రిమాండ్ (judicial custody) విధించారు. దీంతో ఆయ‌న‌ను చంచ‌ల్‌గూడ జైలుకు త‌ర‌లించారు. న‌ర‌హ‌రి భారీగా ఆస్తులు కూడ‌బెట్టార‌న్న ఆరోప‌ణ‌ల‌తో హైద‌రాబాద్ పాత‌బ‌స్తీ ఛ‌త్రినాక‌లోని ఆయ‌న నివాసంలో ఏసీబీ అధికారులు దాడులు (ACB Raids) నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. న‌ర‌హ‌రి నివాసంతోపాటు 11 చోట్ల ఏక‌కాలంలో సోదాలు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా రూ.1.54 కోట్ల న‌గ‌దు, కిలో బంగారం, భారీగా స్థిర‌చ‌రాస్తుల ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ‌ రూ.13.05 కోట్లుగా గుర్తించారు. అయితే స్థిరాస్తుల‌న్నీ హైద‌రాబాద్ శివార్ల‌లోని ప్ర‌ముఖ ప్రాంతాల్లో ఉండ‌టంతో బ‌హిరంగ మార్కెట్‌లో వాటి విలువ రూ.100 కోట్ల‌కుపైనే ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. మంళ‌వారం రాత్రి న‌ర‌హ‌రిని అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. బుధ‌వారం ఉద‌యం ఏసీబీ కోర్టు న్యాయ‌మూర్తి నివాసంలో హాజ‌రుప‌రిచారు. దీంతో జ‌డ్జి ఆయ‌న‌కు 14 రోజుల రిమాండ్ విధించారు.

ఎక్క‌డ చూసినా డ‌బ్బే..

కారుణ్య నియామకం ద్వారా త‌న‌ 18వ ఏటా డిప్యూటీ సర్వేయర్‌గా ఉద్యోగంలో చేరిన నరహరిరావు పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. జిల్లాల సరిహద్దుల్లో ఉండే భూవివాదాల ఫైల్స్​ను క్లియర్‌ చేయడంలో సిద్దహస్తుడిగా పేరొందారు. 2016లో పదోన్నతి పొంది 2020 వరకు రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆరోపణలు రావడంతో హైదరాబాద్‌ శిక్షణా కేంద్రానికి ప్రభుత్వం బదిలీ చేసింది. 2024 నుంచి 2025 వరకు హెచ్​ఎండీఏ ప్రాజెక్ట్‌ కార్యాలయంలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం డిప్యూటీ డైరెక్టర్‌ హోదాలో హైదరాబాద్‌ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నారు.

దాడుల సంద‌ర్భంగా నర‌హ‌రి నివాసంలో డ‌బ్బును చూసి అధికారులు ఆశ్చ‌ర్య‌పోయారు. ప‌డ‌క‌గ‌దిలోని బీరువా, దానిపై ఉన్న క‌ప్‌బోర్డుల‌ను తెర‌చి చూడ‌గా క‌ట్ట‌క‌ట్ట‌లుగా రూ.500 నోట్లు ద‌ర్శ‌న‌మిచ్చాయి. దీంతో ఇళ్లంతా వెతికిన అధికారులకు ప్రతి మూలనా నోట్ల కట్టలే దర్శనమిచ్చాయి. వెంటనే కౌంటింగ్ మిషన్లను తెప్పించి లెక్కించగా నగదు రూపంలోనే ఏకంగా రూ.1.54 కోట్లు ఉన్నట్లు తేల్చారు. 1.3 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి ఆభరణాల‌తోపాటు కీలక పత్రాలు కూడా ల‌భించాయి. బ్యాంకు ఖాతాల్లో రూ.2.29 కోట్లు, రూ.5.4 ల‌క్ష మేర ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్న‌ట్లు గుర్తించారు.

ఇక మహేశ్వరంలో ఎకరం 24 గుంటల వ్యవసాయ భూమి, రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్‌ప్లాట్లు, పుప్పాలగూడలోని ఖరీదైన హైరైజ్ భవనంలో 2,500 చదరపు అడుగుల ఫ్లాట్, నార్సింగిలోని హైరైజ్ భవనంలో 1,860 చదరపు అడుగుల చొప్పున రెండ్లు ఫ్లాట్లు, రాజేంద్రనగర్‌లోని హైరైజ్ భవనంలో 1,377 చదరపు అడుగుల ఫ్లాట్, గచ్చిబౌలి టీఎన్​జీవో కాలనీలో జీ+ప్లస్​-3 భవనం, ఛత్రినాకలో జీ+ప్లస్ 2 భవనాలు ఉన్న‌ట్లు తెలిపారు.

 

Advertisement
Advertisement