ACB Raids | ఆర్అండ్‌బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.17.97కోట్ల ఆస్తులు వెలుగులోకి..!
ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై రోడ్లు భవనాల శాఖ ) ఇంజినీర్ ఇన్ చీఫ్ జే మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయన వద్ద సుమారు రూ.17.94 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తేలిందని ఏసీబీ అధికారులు తెలిపింది.
ACB Raids | ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై రోడ్లు భవనాల శాఖ ) ఇంజినీర్ ఇన్ చీఫ్ జే మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆయన వద్ద సుమారు రూ.17.94 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తేలిందని ఏసీబీ అధికారులు తెలిపింది. మోహన్ నాయక్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన ఏసీబీ, ఆయనతో నివాసంతో పాటు బంధువులు, సన్నిహితులకు చెందిన 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. నిజామాబాద్ జిల్లా దిచ్‌పల్లి మండలం ముల్లంగి గ్రామంలో 19.38 ఎకరాల వ్యవసాయ భూములు సుమారు రూ.82.89 లక్షల ఉందని గుర్తించారు. అలాగే, కొంపల్లిలో 3 ఫ్లాట్లు, గచ్చిబౌలిలో 4 ఫ్లాట్లు కలిపి సుమారు రూ.7.34 కోట్ల విలువ ఉన్నట్లు అంచనా వేశారు.
మియాపూర్‌లో ట్రిప్లెక్స్ విల్లా (సుమారు రూ.2.5 కోట్లు), కూకట్‌పల్లిలో నిర్మాణ దశలో ఉన్న ఇల్లు (సుమారు రూ.62.14 లక్షలు), నిజామాబాద్‌లో కొత్తగా కొనుగోలు కోసం ముందస్తుగా ఇచ్చిన రూ.కోటి అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలిసింది. అంతేకాకుండా రూ.55 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.1.44 కోట్లు, సుమారు 2,500 గ్రాముల బంగారు ఆభరణాలు (రూ.2 కోట్లు), 6 కిలోల వెండి వస్తువులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు (9 మొబైల్ ఫోన్లు, 4 ల్యాప్‌టాప్‌లు), అలాగే రెండు వాహనాలు ఉన్నట్లుగా గుర్తించారు. మొత్తం ఆస్తుల విలువ రూ.17,94,62,617 ఉన్నట్లుగా ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. మార్కెట్ విలువ ఇంకా ఎక్కువగా ఉండవచ్చని ఏసీబీ తెలిపింది. ఆస్తులపై ఇంకా విచారణ కొనసాగుతోందని ఏసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కేసులో సంబంధిత అధికారిని అరెస్టు చేసి హైదరాబాద్‌లోని స్పెషల్ జడ్జి ముందు ప్రవేశపెట్టి రిమాండ్ చేయనున్నట్లు ఏసీబీ తెలిపింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Minister Sridhar Babu | పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రగతిలో కీలక భాగస్వాములు: మంత్రి శ్రీధర్‌బాబు
జూన్ 9, 2026

Rajya Sabha Polls | కాంగ్రెస్‌కు షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
జూన్ 9, 2026

Chandrayangutta | హైదరాబాద్‌లో వర్షం బీభత్సం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకుల మృతి
జూన్ 9, 2026
తాజావార్తలు
- ●Chandrayangutta | హైదరాబాద్‌లో వర్షం బీభత్సం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకుల మృతి
- ●Solar Power | నీటిపారుదల భూముల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం
- ●Handloom Shawls | భక్తులకు చేనేత శాలువాలనే ఇవ్వండి.. మంత్రి కొండా సురేఖకు గజం అంజయ్య విజ్ఞప్తి
- ●Pawan Kalyan | టైగర్ సీతారాముడిగా పవన్ కళ్యాణ్ - ఓపెనింగ్ ఈవెంట్‌తో సెన్సేషన్ - సినిమా ఎందుకు ఆగిపోయిందంటే?
- ●CM Revanth Reddy | ఆడబిడ్డలను నిలబెట్టే బాధ్యత నాది : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Aishwarya Rajesh | అటు మామ.. ఇటు అల్లుడు ... అక్కినేని హీరోలతో ఐశ్వర్యా రాజేష్ డబుల్ ధమాకా!

Chandrayangutta | హైదరాబాద్‌లో వర్షం బీభత్సం.. కరెంట్ షాక్‌తో ఇద్దరు యువకుల మృతి

Solar Power | నీటిపారుదల భూముల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశం

Handloom Shawls | భక్తులకు చేనేత శాలువాలనే ఇవ్వండి.. మంత్రి కొండా సురేఖకు గజం అంజయ్య విజ్ఞప్తి

Pawan Kalyan | టైగర్ సీతారాముడిగా పవన్ కళ్యాణ్ - ఓపెనింగ్ ఈవెంట్‌తో సెన్సేషన్ - సినిమా ఎందుకు ఆగిపోయిందంటే?



