ENC Mohan Naik | ఆ ఈఎన్‌సీ ఇంట్లో రూ.200 కోట్లు.. 2.5 కిలోల బంగారం, 6 కిలోల వెండి..
ENC Mohan Naik | త్రినేత్ర.న్యూస్: రోడ్లు, భవనాల శాఖ (R and B) ఇంజినీర్ ఇన్ చీఫ్ జరుప్ల మోహన్ నాయక్ (ENC Mohan Naik) ఇంట్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో మోహన్ నాయక్ ఇంటితోపాటు 15 ప్రాంతాల్లోని ఆయన బంధువుల నివాసాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు (ACB Raids) నిర్వహించారు.
ENC Mohan Naik | త్రినేత్ర.న్యూస్: రోడ్లు, భవనాల శాఖ (R and B) ఇంజినీర్ ఇన్ చీఫ్ జరుప్ల మోహన్ నాయక్ (ENC Mohan Naik) ఇంట్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో మోహన్ నాయక్ ఇంటితోపాటు 15 ప్రాంతాల్లోని ఆయన బంధువుల నివాసాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు (ACB Raids) నిర్వహించారు. దీంతో ఇప్పటివరకు ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ రూ.17,94,62,617 అని ఏసీబీ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించింది. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమేనని, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.200 కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(బి), 13(2) కింద ఆయనపై కేసు నమోదు చేశారు. బుధవారం కూడా తనిఖీలు నిర్వహించనున్నారు.
భారీగా ఆస్తులు..
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ముల్లంగి గ్రామంలో 19.38 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని అధికారులు గుర్తించారు. దాని విలువ రూ.82.89 లక్షలు. ఇక కొంపల్లిలో మూడు ఫ్లాట్లు, గచ్చిబౌలిలో రూ.7.40 కోట్ల విలువైన 4 ఫ్లాట్లు ఉన్నాయి. వీటితోపాటు మియాపూర్‌లో రూ.2.50 కోట్ల విలువచేసే ట్రిప్లెక్స్ విల్లా, కూకట్‌పల్లిలో కొత్తగా నిర్మించిన ఇల్లు (రూ.62.14 లక్షలు), నిజామాబాద్‌లో నిర్మాణంలో ఉన్న విల్లా కొనుగోలుకు రూ.1 కోటి అడ్వాన్స్ చెల్లించినట్లు అధికారులు గుర్తించారు. అలాగే సోదాల్లో రూ.55 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో రూ.1.44 కోట్ల నిల్వలు గుర్తించారు.

ఇంట్లో రెండున్నర కిలోల బంగారం, గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని తెలిపారు. అదేవిధంగా 6 కిలోల వెండి, రూ.1.26 కోట్ల గృహోపకరణాలు, 9 మొబైళ్లు, 4 ల్యాప్‌టాప్‌లు సహా రూ.11.25 లక్షల ఎలక్ట్రానిక్ పరికరాలు, రూ.25 లక్షల విలువైన రెండు వాహనాలు, రూ.4.44 లక్షల విలువైన 22 ఫారిన్ లిక్కర్ బాటిళ్లను సీజ్ చేశారు.
నేడూ సోదాలు..
సోదాల అనంతరం మోహన్ నాయక్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్‌లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. బుధవారం వైద్య పరీక్షల తర్వాత ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. సోదాలు బుధవారం కూడా కొనసాగే అవకాశముందని ఏసీబీ వర్గాలు తెలిపాయి.
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధం: మంత్రి పొన్నం
జూన్ 10, 2026

Tuition Fees | ఇకపై ఒకేసారి ట్యూషన్ ఫీజుల విడుదల.. ఏడాది పొడవునా దరఖాస్తు చేసుకోవచ్చు!
జూన్ 10, 2026

ACB Raids | ఆర్అండ్బీ ఈఎన్‌సీ మోహన్ నాయక్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ.17.97కోట్ల ఆస్తులు వెలుగులోకి..!
జూన్ 9, 2026
తాజావార్తలు
- ●PM KISAN | జూలైలో పీఎం కిసాన్ నిధులు.. ఈనెల 30లోపు ఈ-కేవేసీ పూర్తిచేస్తేనే!
- ●Ponnam Prabhakar | మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధం: మంత్రి పొన్నం
- ●Tuition Fees | ఇకపై ఒకేసారి ట్యూషన్ ఫీజుల విడుదల.. ఏడాది పొడవునా దరఖాస్తు చేసుకోవచ్చు!
- ●Horoscope | జూన్ 10 రాశిఫలాలు.. ఈ రాశివారికి ఊహించని ఆటంకాలు!
- ●Kangra Valley Toy Train | 4 ఏళ్ల నిరీక్షణకు తెర: మళ్లీ పట్టాలెక్కిన హిమాచల్ ప్రదేశ్ 'టాయ్ ట్రైన్'.. బస్సు ఛార్జీల కంటే ఎంతో చవక
- ●Panic Attack vs Heart Attack | చాతీలో నొప్పి.. హార్ట్ ఎటాకా లేక పానిక్ ఎటాకా? ప్రాణాలు నిలబెట్టే ఈ తేడాలు తెలుసుకోండి!

PM KISAN | జూలైలో పీఎం కిసాన్ నిధులు.. ఈనెల 30లోపు ఈ-కేవేసీ పూర్తిచేస్తేనే!

Ponnam Prabhakar | మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధం: మంత్రి పొన్నం

Tuition Fees | ఇకపై ఒకేసారి ట్యూషన్ ఫీజుల విడుదల.. ఏడాది పొడవునా దరఖాస్తు చేసుకోవచ్చు!

Horoscope | జూన్ 10 రాశిఫలాలు.. ఈ రాశివారికి ఊహించని ఆటంకాలు!



