త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Navapanchama Rajayogam | న‌వ‌పంచ‌మ రాజ‌యోగం.. ఈ మూడురాశుల వారికి అన్ని గుడ్‌న్యూస్‌లే..!

Navapanchama Rajayogam | మార్చి నెల జ్యోతిష‌శాస్త్రం ప‌రంగా చాలా శుభ‌ప్ర‌దంగా ఉండ‌నున్న‌ది. నెల ప్రారంభంలోనే న‌వపంచ‌మ రాజ‌యోగం ఏర్ప‌డ‌బోతున్న‌ది. బృహ‌స్ప‌తి, సూర్యుడు ఒక‌దానితో ఒక‌టి 120 డిగ్రీల కోణం ఉంటారు. ఈ స్థానం న‌వ‌పంచ‌మ రాజ‌యోగాన్ని ఏర్ప‌రుస్తుంది.

P

Horoscope | Published On Mar 3, 2026, 6.30 am IST

Navapanchama Rajayogam | న‌వ‌పంచ‌మ రాజ‌యోగం.. ఈ మూడురాశుల వారికి అన్ని గుడ్‌న్యూస్‌లే..!
Advertisement

Navapanchama Rajayogam | మార్చి నెల జ్యోతిష‌శాస్త్రం ప‌రంగా చాలా శుభ‌ప్ర‌దంగా ఉండ‌నున్న‌ది. నెల ప్రారంభంలోనే న‌వపంచ‌మ రాజ‌యోగం ఏర్ప‌డ‌బోతున్న‌ది. బృహ‌స్ప‌తి, సూర్యుడు ఒక‌దానితో ఒక‌టి 120 డిగ్రీల కోణం ఉంటారు. ఈ స్థానం న‌వ‌పంచ‌మ రాజ‌యోగాన్ని ఏర్ప‌రుస్తుంది. మార్చి 5న రాత్రి 10.41 గంటలకు ఏర్ప‌డ‌బోతోంది. ఈ యోగం ఇది చాలా శుభప్రదమైంది. ప్రభావవంతమైంద‌ని పండితులు పేర్కొంటున్నారు. ఈ యోగ ప్ర‌భావం కార‌ణం చేత పలురాశుల వారికి జ్ఞానం, అదృష్టం, ప్రతిష్ట పెర‌గ‌డంతో పాటు ఆర్థిక పురోగ‌తి సాధించే అవ‌కాశాలున్నాయి. సామాజిక గౌరవం, కెరీర్‌లో పురోగ‌తి, జీవితంలో సానుకూల ఫ‌లితాలు క‌లుగుతాయి. ఆ అదృష్ట రాశుల‌వారెవ‌రో తెలుసుకుందాం..!

మిథున‌రాశి..

ఈ రాజయోగం మిథున రాశి వారికి అదృష్టాన్ని తీసుకువ‌స్తుంది. ఆర్థిక లాభాలు, పెట్టుబడుల‌తో మంచి రాబ‌య‌డిని పొందే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఉద్యోగులు ప‌ని చేసేచోట ప్ర‌శంస‌లు అందుకుంటారు. సీనియ‌ర్ అధికారుల‌నుంచి ప్ర‌శంస‌లు పొందుతారు. విద్యార్థులు మెరుగైన ఫ‌లితాలు పొందుతారు. ఈ సమయంలో మిథున రాశి వారికి కొత్త ఉద్యోగం, ప్రమోషన్ లభించే అవకాశాలు ఉంటాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక ప‌రిస్థితి బ‌ల‌ప‌డుతుంది. ఆత్మ‌విశ్వాసం పెరుగుతుంది.

సింహ‌రాశి..

సింహ రాశివారు ఆనందంగా ఉంటారు. మీ నాయకత్వ నైపుణ్యాలు అంద‌రికీ తెలుస్తాయి. స‌మాజంలో మీకు గౌర‌వ మ‌ర్యాద‌లు పెరుగుతాయి. కొత్త‌గా ప్ర‌భావ‌వంత‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. త‌ద్వారా మీకు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. జీవితంలో చాలా మార్పుల‌ను గ‌మనిస్తారు. కెరీర్‌, వ్యాపారంలో కొత్త ద‌శ‌కు చేరుకుంటారు. కొన్ని కీల‌కమైన ప‌నులు ప్రారంభిస్తారు. ఏదైనా భూమి, వ్యాపారంలో పెట్టుబ‌డి పెట్టి ఉంటే ఆర్థికంగా లాభాలు పొందుతారు.

మీనం

న‌వ‌పంచ‌మ రాజ‌యోగం కార‌ణంగా మీన‌రాశి వారు ఆర్థికంగా లాభాలు పొందే అవ‌కాశాలు గోచ‌రిస్తున్నాయి. పెట్టుబడి, వ్యాపారం, ఉద్యోగ రంగాల్లోని వారికి సానుకూల ఫ‌లితాలు ఉంటాయి. కుటుంబ వాతావ‌ర‌ణం ఆహ్లాద‌క‌రంగా ఉంటుంది. మాన‌సిక ప్ర‌శాంత‌త క‌లుగుతుంది. గ‌తంలో ఎవ‌రికైనా ఇచ్చిన డ‌బ్బు చిక్కుకుపోయి ఉంటే తిరిగి మీ చేతికందే సంకేతాలు గోచ‌రిస్తున్నాయి. అదృష్టం మీకు క‌లిసి వ‌స్తుంది. ఫ‌లితంగా మీరు చేప‌ట్టే ప‌నుల్లో విజ‌యం క‌లుగుతుంది.

Read Also :

Budh Asta | కుంభరాశిలో అస్తమించనున్న బుధుడు.. ఈ మూడురాశుల వారికి అన్నీ గుడ్‌న్యూస్‌లే..!

Lunar Eclipse | హోలీకి ముందు చంద్రగ్రహణం.. మూడురాశుల వారు తస్మాత్‌ జాగ్రత్త..!

Venus constellation Transit | పూర్వ భాద్రపద నక్షతంలోకి శుక్రుడు.. ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్‌ డేస్‌..!

Advertisement
Advertisement