త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Budh Uday 2026 | ఉద‌యించ‌నున్న బుధుడు.. ఈ మూడురాశుల వారికి అన్నీ గుడ్‌న్యూస్‌లే..!

Budh Uday 2026 | గ్ర‌హాల యువ‌రాజు అయిన బుధుడు ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 10న శ‌నిగ్ర‌హానికి చెందిన కుంభ‌రాశిలో ఉద‌యించ‌నున్నాడు. బుధుడి ఉద‌యంతో సానుకూల శ‌క్తి, ప్ర‌భావం ఉండ‌నున్న‌ది. బుధుడు ఉద‌యించిన‌ప్పుడ‌ల్లా ఆ గ్ర‌హం ప్ర‌భావం సాధార‌ణం కంటే ఎక్కువ‌గా ఉంటుంది.

P

Horoscope | Published On Jan 28, 2026, 6.35 am IST

Budh Uday 2026 | ఉద‌యించ‌నున్న బుధుడు.. ఈ మూడురాశుల వారికి అన్నీ గుడ్‌న్యూస్‌లే..!
Advertisement

Budh Uday 2026 | గ్ర‌హాల యువ‌రాజు అయిన బుధుడు ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 10న శ‌నిగ్ర‌హానికి చెందిన కుంభ‌రాశిలో ఉద‌యించ‌నున్నాడు. బుధుడి ఉద‌యంతో సానుకూల శ‌క్తి, ప్ర‌భావం ఉండ‌నున్న‌ది. బుధుడు ఉద‌యించిన‌ప్పుడ‌ల్లా ఆ గ్ర‌హం ప్ర‌భావం సాధార‌ణం కంటే ఎక్కువ‌గా ఉంటుంది. అంతే కాకుండా అన్ని గ్ర‌హాల‌పై సానుకూల ప్ర‌భావం ఉంటుంది. కెరీర్‌లో కొత్త అవ‌కాశాల‌ను తీసుకురాబోతున్న‌ది. కొత్త సంవ‌త్స‌రంలో బుధుడు తొలిసారిగా ఉద‌యించ‌నున్నాడు. బుధుడు తెలివితేట‌లు, జ్ఞాప‌క‌శ‌క్తి, క‌మ్యూనికేష‌న్‌, విశ్లేష‌ణాత్మ‌క సామ‌ర్థ్యానికి సంకేత‌కంగా పేర్కొంటారు. మూడురాశుల వారికి సంప‌ద‌, పోటీ ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధిస్తారు. పెట్టుబ‌డుల నుంచి మంచి ఫ‌లితాలుంటాయి. ఇంత‌కి ఆ అదృష్ట జాత‌కులెవ‌రో తెలుసుకుందాం..!

మేషం

బుధుడి ఉద‌యంతో మేష రాశి వారికి అదృష్టం క‌లిసి వ‌స్తుంది. జీవితంలో సానుకూల మార్పులు వ‌స్తాయి. మీ ఉద్యోగం గురించి ఆందోళ‌న చెందుతుంటే మీ బాధ‌ల‌న్నీ తొల‌గిపోతాయి. కొద్ది కాస్త త‌గ్గుతుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభం క‌లిగే అవ‌కాశం ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కెరీర్‌లో విజ‌యం సాధిస్తారు. అన్ని ర‌కాలుగా మీకు లాభం జ‌రిగే అవ‌కాశం ఉంటుంది.

వృషభం

బుధుడి ఉద‌యం ప్ర‌భావంతో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న ప‌నుల‌న్నీ పూర్త‌వుతాయి. మీకు అదృష్టం క‌లిసి వ‌స్తుంది. అన్నిర‌కాలుగా అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. కెరీర్‌, వ్యాపారంలో మెరుగైన అవకాశాలను పొందే అవకాశం ఉంది. వ్యాపార‌రంగంలో మంచి ఒప్పందం చేసుకుంటారు. ప‌రిస్థితుల‌ను సుల‌భంగా ఎదుర్కొంటారు. కెరీర్‌, వ్యాపారంలో మంచి వృద్ధిని సాధిస్తారు. మీ కెరీర్ గాడిలో ప‌డుతుంది.

కుంభ‌రాశి

బుధుడు తిరిగి ఉద‌యించ‌నుండ‌డంతో కుంభ‌రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కొత్త ఉద్యోగ ప్ర‌య‌త్నాలు చేస్తున్న వారి ప్ర‌య‌త్నాలు విజ‌య‌వంత‌మ‌వుతాయి. వైవాహిక జీవితంలో ఆనందం, జీవిత భాగస్వామితో మధురమైన సంబంధాలు ఉంటాయి. కార్యాల‌యంలో గౌరవం, హోదా లభిస్తుంది. విదేశీ ప్రయాణాలు చేసే అవ‌కాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తుంటే.. మీ కోరిక నెర‌వేరుతుంది.

Read Also : 

Venus Transit | మ‌క‌ర రాశిలోకి శుక్రుడు.. ఈ రాశుల‌వారికి అన్నీ గుడ్‌న్యూస్‌లే..!

Solar Eclipse Effects | కంకణాకార సూర్యగ్రహణం.. ఈ మూడు రాశులవారిపై ప్రభావం..! మీ రాశి ఉందా చూసుకోండి..!

Advertisement

తాజావార్తలు

Advertisement