త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Venus Transit | మ‌క‌ర రాశిలోకి శుక్రుడు.. ఈ రాశుల‌వారికి అన్నీ గుడ్‌న్యూస్‌లే..!

Venus Transit | జ్యోతిష‌శాస్త్రంలో శుక్రుడికి ప్ర‌త్యేక స్థానం ఉంది. శుభ ఫ‌లితాలను ప్ర‌సాదించే గ్ర‌హంగా పేర్కొంటారు. ఆనందం, శ్రేయ‌స్సు, విలాసాలు, ఆర్థిక లాభం అనుగ్ర‌హిస్తాడ‌ని పండితులు చెబుతారు. ఎవ‌రిపై ఆయ‌న అనుగ్ర‌హం ఉంటందో వారంతా విలాసాల‌ను అనుభ‌విస్తారు.

P

Horoscope | Published On Jan 17, 2026, 6.35 am IST

Venus Transit | మ‌క‌ర రాశిలోకి శుక్రుడు.. ఈ రాశుల‌వారికి అన్నీ గుడ్‌న్యూస్‌లే..!
Advertisement

Venus Transit | జ్యోతిష‌శాస్త్రంలో శుక్రుడికి ప్ర‌త్యేక స్థానం ఉంది. శుభ ఫ‌లితాలను ప్ర‌సాదించే గ్ర‌హంగా పేర్కొంటారు. ఆనందం, శ్రేయ‌స్సు, విలాసాలు, ఆర్థిక లాభం అనుగ్ర‌హిస్తాడ‌ని పండితులు చెబుతారు. ఎవ‌రిపై ఆయ‌న అనుగ్ర‌హం ఉంటందో వారంతా విలాసాల‌ను అనుభ‌విస్తారు. శుక్రుడు ఎప్ప‌టిక‌ప్పుడు త‌న రాశిని మార్చుకుంటాడు. శుక్రుడు ఈ నెల 13న ఉద‌యం 3.40 గంట‌ల‌కు మ‌క‌ర‌రాశిలోకి ప్ర‌వేశించాడు. ఫిబ్ర‌వ‌రి 5 వ‌ర‌కు అదే రాశిలో ఉండ‌నున్నాడ. రాశి మార్పు కార‌ణంగా 12 రాశుల వారి జీవితాల‌పై ప్ర‌భావం ప‌డ‌నున్న‌ది. ప‌లు రాశుల‌వారికి ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఇంత‌కీ ఆ అదృష్ట రాశుల‌వారెవ‌రో తెలుసుకుందాం..!

మేషం

మేష రాశి వారి రెండవ, ఏడవ స్థానాలకు శుక్రుడు అధిప‌తి. మీ జాత‌కం ప‌దో స్థానంలో శుక్రుడు మకర రాశిలో ప్ర‌వేశించాడు. ప‌దో స్థానంలో శుక్రుడి సంచారంతో గ‌ణ‌నీయ‌మైన ప్ర‌భావం చూపుతుంది. బాధ్య‌త‌లు పెరుగుతాయి. గౌర‌వ మ‌ర్యాద‌ల‌కు సైతం లోటు ఉండ‌దు. విలాసాలు పెరుగుతాయి. మీరు మీ కుటుంబంతో ఆనందంగా కాలం గ‌డుపుతారు.

వృషభం

వృషభ రాశి మొదటి, ఆరవ స్థానాలకు శుక్రుడు అధిపతి. రాక్ష‌స గురువు మీ తొమ్మిదో స్థానంలో సంచ‌రిస్తున్నాడు. అదృష్ట స్థానంలో శుక్రుడి సంచారంతో మీకు అన్నిర‌కాలుగా క‌లిసి వ‌స్తుంది. మీరు చేసే ప్ర‌య‌త్నాల‌న్నీ నెర‌వేరుతాయి. వృత్తిపరంగా చూస్తే మకర రాశిలో శుక్రుడి సంచారం ప్రయోజనాలుంటాయి. పదోన్నతులు, జీతాలు పెరిగేందుకు అవ‌కాశం ఉన్నాయి. మెరుగైన ఉద్యోగ అవ‌కాశాలు సైతం మీకు ల‌భించే ఛాన్స్ ఉంది. తండ్రితో సంబంధాలు మెరుగ‌వుతాయి. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల‌పై దృష్టి పెడుతారు.

తుల

తుల‌రాశి నాలుగో ఇంట్లో శుక్రుడి సంచారం జ‌రుగుతుంది. దాంతో సౌక‌ర్యాలు పెరుగుతాయి. భూమిని, వాహ‌నాల‌ను కొన‌గాల‌ని భావిస్తున్న వారి కోరిక నెర‌వేరే అవ‌కాశాలున్నాయి. ఈ స‌మ‌యంలో మీ త‌ల్లితో సంబంధం మ‌రింత బ‌ల‌ప‌డుతుంది. ప్రేమ ఆప్యాత‌లు పెరుగ‌తాయి. కుటుంబంలో ఆహ్లాద‌క‌ర‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. సంతోషంగా ఉంటారు. ఇంట్లో శుభ‌కార్యాలు జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

మీనం

శుక్రుడి సంచారం కార‌ణంగా మీన‌రాశి వారికి శుభ‌ప‌ద్రంగా ఉంటుంది. శుక్రుడి సంచారం కార‌ణంగా మీ కోరిక‌ల‌న్నీ నెర‌వేరే అవ‌కాశాలు గోచ‌రిస్తున్నాయి. కొత్త ఆదాయ వ‌న‌రులు మీ ద‌రికి చేరుతాయి. పాత పెట్టుబ‌డుల నుంచి ఆర్థికంగా ప్ర‌యోజ‌నం ఉంటుంది. మీ పాత స్నేహితుల‌ను క‌లిసుకొని వారితో ఆనందంగా ఉంటారు. అదే స‌మ‌యంలో భౌతిక సుఖాలు పెరుగుతాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement