Solar Eclipse Effects | కంకణాకార సూర్యగ్రహణం.. ఈ మూడు రాశులవారిపై ప్రభావం..! మీ రాశి ఉందా చూసుకోండి..!
Solar Eclipse Effects | ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఫాల్గుణ అమావాస్య రోజున ఏర్పడనున్నది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ అమావాస్యకు ప్రత్యేకత ఉన్నది. ఫిబ్రవరి 17న మంగళవారం రోజున కంకణాకార సూర్యగ్రహణం ఆవిష్కృతం కానున్నది.
Solar Eclipse Effects | ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఫాల్గుణ అమావాస్య రోజున ఏర్పడనున్నది. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ అమావాస్యకు ప్రత్యేకత ఉన్నది. ఫిబ్రవరి 17న మంగళవారం రోజున కంకణాకార సూర్యగ్రహణం ఆవిష్కృతం కానున్నది. ఈ గ్రహణం మధ్యాహ్నం ప్రారంభమై సాయంత్రం వరకు కొనసాగుతుంది. అయితే, ఖగోళ వింత భారత్‌లో కనిపించే అవకాశం లేదు. అయితే, ఈ గ్రహ ప్రభావం పలురాశుల వారిపై ప్రభావం పడుతుందని పండితులు పేర్కొంటున్నారు. సూర్యగ్రహణాన్ని మార్పునకు, కొత్త చక్రం ప్రారంభానికి సంకేతకంగా భావిస్తారు. ఈ సమయంలో పలురాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు వస్తాయని పండితులు చెబుతున్నారు. నిలిచిపోయిన పనులన్నీ మళ్లీ వేగాన్ని పుంజుకుంటాయని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా కెరీర్, ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ నిర్ణయాల్లో ప్రయోజనకరంగా ఉంటుందని తెలుపుతున్నారు. అయితే, ఈ సూర్యగ్రహం ఏ రాశులవారిపై శుభాలను తీసుకురానుందో తెలుసుకుందాం..!
మేష రాశి..
ఈ ఏడాది ఏర్పడనున్న తొలి సూర్యగ్రహణంతో మేష రాశి వారికి నూతన శక్తి వస్తుంది. కొత్త అవకాశాలను మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. దాంతో చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. ఆర్థికంగా బలపడుతారు. కొత్త ఆదాయ మార్గాలకు ద్వారాలు తెరుచుకుంటాయి. కెరీర్‌లో పురోగతి సాధిస్తారు. కొత్త ఉద్యోగం లేదంటే బాధ్యతలు తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
మిథున రాశి
ఈ సూర్యగ్రహణం మిథున రాశి వారికి ఆర్థిక ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే, జీవితంలో స్థిరత్వాన్ని తీసుకువస్తుంది. ఆర్థిక సంబంధిత విషయాల్లో సానుకూల మార్పులుంటాయి. ఖర్చులపై ఆందోళన తగ్గుతుంది. నిలిచిపోయిన ప్రాజెక్టు మళ్లీ వేగం పుంజుకుంటుంది. ఒకే ప్రయత్నంతో గణనీయమైన విజయాలను సాధించే అవకాశాలున్నాయి. ఈ సమయంలో కుటుంబం, తల్లిదండ్రుల నుంచి మీకు మద్దతు లభిస్తుంది. మీకు అన్ని విషయాల్లో మార్గనిర్దేశం చేస్తారు. గ్రహణంతో మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ సూర్యగ్రహణం ప్రభావంతో ఊహించని అవకాశాలు వస్తాయి. ఈ సమయంలో ఆదాయం పెరుగుతుంది. అనుకోని విధంగా ఆర్థిక లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త కెరీర్, వ్యాపారరంగంలోకి అడుగుపట్టే అవకాశం ఉంది. దీర్ఘకాలం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆస్తి, వాహనాలకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయం మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. పలువురు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దాంతో కొత్త అవకాశాలు దొరుకుతాయి. విదేశాలకు వెళ్లాలన్న కల సాకారమవుతుంది. భవిష్యత్‌కు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి.
సంబంధిత వార్తలు

Stock Markets | ఆరంభంలో లాభాలు.. ముగింపులో నష్టాలు.. స్టాక్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
మే 21, 2026

Gold And Silver Prices Today | స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. సేఫ్ హావెన్ ఆస్తులపై తగ్గుతున్న ఆసక్తి..
మే 21, 2026

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు..
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



