Angaraka Yogam On Holi | హోలీ రోజున అంగారక యోగం.. ఈ మూడురాశులవారు కష్టాలకు ఎదురీదాల్సిందే..!
Angaraka Yogam On Holi | ఈ ఏడాది మార్చి 4న హోలీ పండుగ జరుపుకోనున్నాం. జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ రోజున ఎంతో ప్రత్యేకత ఉన్నది. కుజుడు హోలీ పండుగ రోజున కుంభరాశిలో సంచరిస్తాడు. ఈ సమయంలో రాహువు సైతం ఇదే రాశిలో ఉంటాడు. దాంతో కుజుడు రాహువుతో కలిసి అంగారక యోగాన్ని ఏర్పరచనున్నాడు. ఏప్రిల్ 2 వరకు ఈ యోగం ఉంటుంది.
Angaraka Yogam On Holi | ఈ ఏడాది మార్చి 4న హోలీ పండుగ జరుపుకోనున్నాం. జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ రోజున ఎంతో ప్రత్యేకత ఉన్నది. కుజుడు హోలీ పండుగ రోజున కుంభరాశిలో సంచరిస్తాడు. ఈ సమయంలో రాహువు సైతం ఇదే రాశిలో ఉంటాడు. దాంతో కుజుడు రాహువుతో కలిసి అంగారక యోగాన్ని ఏర్పరచనున్నాడు. ఏప్రిల్ 2 వరకు ఈ యోగం ఉంటుంది. అయితే, ఈ యోగాన్ని అశుభంగా భావిస్తారు. బాధలు, కోపం, మానసికంగా అశాంతిని కలిగిస్తుందని భావిస్తారు. ఈ యోగం ప్రభావం కారణంగా ఆర్థిక, వ్యాపార విస్తరణ, ఉద్యోగాలు, ఉపాధిలో వివిధ ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలున్నాయి. అలాగే, ఒత్తిడికి కూడా పెరుగుతుంది. ఈ హోలీ పండుగ నుంచి మూడురాశుల వారు అప్రమత్తంగా ఉండాలి. ఆ రాశులవారెవరో తెలుసుకుందాం..!
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ సమయం సవాల్‌తో కూడుకొని ఉంటుంది. ఈ కాలంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. అయితే, ఆరోగ్యపరంగా పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. అయితే, అపరిచితులను నమ్మడం వల్ల మీ వ్యాపారం ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. విదేశీ సంబంధిత పనుల్లో అనేక అడ్డంకులు ఎదురవుతాయి. అయితే, ఓపికగా ఉండడం వల్ల మీ పనులు సులభంగా పూర్తవుతాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారి ఖర్చులు పెరుగుతాయి. కొత్త ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారాల్లో అవకాశాలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్తగా కళాశాలల్లో చేరాలని భావిస్తుంటే ఓపికగా ఉండడం మంచిది. ఈ సమయంలో కొత్త పెట్టుబడుల విషయంలో దూరంగా ఉండండి. ఈ సమయంలో వ్యాపారం అస్థిరంగా ఉంటుంది. పనులు చేసేందుకు సాధారణం కంటే ఎక్కువగా కృషి చేయాల్సి వస్తుంది. భావోద్వేగంలో నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. మీరు కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనం కొనుగోలు చేసే ప్రణాళికను వాయిదా వేసుకోవడం మంచిది. వివాహ సంబంధాలు చర్చల దశలో ఉంటే కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీ సౌకర్యాలు, విలాసాలు తగ్గుతాయి. కొత్త ప్రయాణాలకు దూరంగా ఉడడం మంచిది. విద్యార్థులు ఏకాగ్రతను కాపాడుకోవాలి. లేకపోతే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
Read Also :
Mars Transit | కుంభరాశిలో కుజుడి సంచారంతో పంచగ్రహి యోగం.. ఈ రాశుల వారి ప్రమోషన్లు, జీతం పెరిగే ఛాన్స్..!
Budh Asta | కుంభరాశిలో అస్తమించనున్న బుధుడు.. ఈ మూడురాశుల వారికి అన్నీ గుడ్‌న్యూస్‌లే..!
తాజావార్తలు
- ●MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న
- ●Bengaluru Teenage Suicide Attempt | ఇన్‌స్టా ప్రేమ.. పెళ్లికి నో చెప్పిన పేరెంట్స్: ఐదంతస్తుల భవనమెక్కిన 15 ఏళ్ల బాలుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- ●Toxic | యశ్ టాక్సిక్ టికెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
- ●Nitin Gadkari | పనిచేయలేకపోతున్నా.. ఇక కొత్తతరానికి బాధ్యతలు అప్పగించాలి : నితిన్ గడ్కరీ
- ●RS Praveen Kumar | ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసమే రేవంత్ విదేశీ పర్యటన పెట్టుకుండు
- ●Maharashtra Family Suicide | కన్నీళ్లు పెట్టిస్తున్న 'షేరూ' కథ: లోయలో పడి కుటుంబం చనిపోయినా.. 3 రోజులుగా వారి కోసమే ఎదురుచూపులు

MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న

Bengaluru Teenage Suicide Attempt | ఇన్‌స్టా ప్రేమ.. పెళ్లికి నో చెప్పిన పేరెంట్స్: ఐదంతస్తుల భవనమెక్కిన 15 ఏళ్ల బాలుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Toxic | యశ్ టాక్సిక్ టికెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Nitin Gadkari | పనిచేయలేకపోతున్నా.. ఇక కొత్తతరానికి బాధ్యతలు అప్పగించాలి : నితిన్ గడ్కరీ






