Wakeup In Sleep At Night | రాత్రి పూట సడెన్ గా నిద్ర లేస్తున్నారా..? ఇదే కారణం..!
Wakeup In Sleep At Night | రాత్రి పూట నిద్రించిన తరువాత సాధారణంగా ఎవరికీ అంత సులభంగా మెళకువ రాదు. ఫోన్ మోగినా లేదా ఇంట్లో, బయట ఏవైనా శబ్దాలు పెద్దగా వచ్చినా, భయంతో కూడిన పీడకల వచ్చినా నిద్రకు భంగం కలిగి నిద్ర లేస్తారు. కానీ స్వతహాగా ఎవరూ నిద్రలోంచి లేవరు.
Wakeup In Sleep At Night | రాత్రి పూట నిద్రించిన తరువాత సాధారణంగా ఎవరికీ అంత సులభంగా మెళకువ రాదు. ఫోన్ మోగినా లేదా ఇంట్లో, బయట ఏవైనా శబ్దాలు పెద్దగా వచ్చినా, భయంతో కూడిన పీడకల వచ్చినా నిద్రకు భంగం కలిగి నిద్ర లేస్తారు. కానీ స్వతహాగా ఎవరూ నిద్రలోంచి లేవరు. అయితే కొందరికి మాత్రం తరచూ రాత్రిపూట అనుకోకుండా అకస్మాత్తుగా మెళకువ వస్తుంది. ఆ తరువాత మళ్లీ నిద్ర పట్టడం కష్టంగా ఉంటుంది. అయితే ఎప్పుడో ఒకసారి ఇలా జరిగితే ఓకే. కానీ తరచూ ఇలా జరుగుతుందంటే అంతర్లీనంగా ఏదో తీవ్ర అనారోగ్య సమస్య ఉండి ఉంటుందని, అందుకనే అలా జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
జీవ గడియారం పనితీరు..
మన శరీరంలో సర్కేడియన్ రిథమ్ ఉంటుంది. దీన్నే జీవ గడియారం అంటారు. ఇది 24 గంటలూ పనిచేస్తూనే ఉంటుంది. మనం ఏ సమయంలో నిద్రించాలి, ఏ సమయంలో మెళకువగా ఉండాలి, హార్మోన్ల విడుదల, శరీర ఉష్ణోగ్రత, చురుకుదనం వంటి అంశాలను జీవ గడియారం నియంత్రిస్తుంది. ఈ క్రమంలో రాత్రి 2 నుంచి ఉదయం 5 గంటల మధ్య జీవ గడియారం అత్యంత యాక్టివ్‌గా పనిచేస్తుంది. అయితే ఈ సమయంలో సాధారాణంగా కార్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిలు పెరుగుతుంటాయి. దీని వల్ల మన శరీరాన్ని ఉదయం నిద్ర లేచేందుకు గాను జీవ గడియారం సిద్ధం చేస్తుంది. అయితే ఒత్తిడి మరీ అధికంగా ఉంటే అప్పుడు కార్టిసాల్ స్థాయిలు కూడా అనూహ్యంగా పెరుగుతాయి. ఈ క్రమంలో జీవ గడియారం అదుపు తప్పుతుంది. మనల్ని ఉదయం నిద్ర లేపేందుకు బదులుగా పైన తెలిపిన ఆ సమయంలో నిద్ర లేపుతుంది. కొందరు దీని వల్ల రాత్రి పూట 1 నుంచి 3 గంటల మధ్య కూడా నిద్ర లేస్తుంటారు.
దీర్ఘకాలంగా ఉంటే ముప్పు..
రాత్రి పూట ఎవరైనా సరే తరచూ ఆయా సమయాల్లో నిద్ర లేస్తున్నారంటే అందుకు ప్రధాన కారణం జీవ గడియారం సరిగ్గా పనిచేయకపోవడమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి స్థాయిలు అధికంగా ఉండడం వల్ల ఇలా జరుగుతుందని అంటున్నారు. అయితే తాత్కాలికంగా ఇది మనకు భారీగా నష్టాన్ని కలిగించకపోయినా దీర్ఘకాలంగా ఇలా ఉంటే మాత్రం ఆరోగ్యానికి తీవ్ర ముప్పు కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని చెబుతున్నారు. అయితే ఇలా జరగకుండా అడ్డుకోవాలంటే అందుకు కొన్ని సూచనలను పాటించాల్సి ఉంటుందని వారు చెబతున్నారు.
ఇలా చేయాలి..
ఒత్తిడి వల్లే ఇలా జరుగుతుంది కనుక ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. రాత్రి నిద్రకు ముందు ధ్యానం చేయాలి. ఉదయం యోగా, సూర్య నమస్కారాలు చేయాలి. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. అలాగే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలను పాటించాలి. వేళకు భోజనం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. రాత్రి పూట జంక్ ఫుడ్ తినకూడదు. ఆలస్యంగా భోజనం చేయకూడదు. మద్యం సేవించడం, పొగ తాగడం మానేయాలి. రాత్రి సమయాల్లో ఫోన్ వినియోగాన్ని తగ్గించాలి. రాత్రి పూట టీ, కాఫీలను తాగకూడదు. ఇలా పలు చిన్న చిన్న సూచనలను పాటిస్తే ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!
ఆగస్టు 4, 2026

Pavala Shyamala | ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత
జులై 28, 2026

Heart Attack | హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ రెండూ ఒకటే కాదు.. తేడా తెలుసుకుంటే ప్రాణాలు కాపాడొచ్చు..
జులై 27, 2026
తాజావార్తలు
- ●Weight Loss Journey | జిమ్ వద్దు, ఖర్చు వద్దు.. ఇంట్లోనే 8 నెలల్లో 20 కిలోలు తగ్గిన ముగ్గురు పిల్లల తల్లి
- ●Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!
- ●Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు
- ●CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం

Weight Loss Journey | జిమ్ వద్దు, ఖర్చు వద్దు.. ఇంట్లోనే 8 నెలల్లో 20 కిలోలు తగ్గిన ముగ్గురు పిల్లల తల్లి

Waking up at 3 am | రోజూ ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ వస్తోందా? మీ బాడీ ఇస్తున్న వార్నింగ్ ఇదే!

Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు

CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు



