Lipoprotein(a) | ఆరోగ్యంగా ఉన్నట్లు కనిపించినా హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుంది..? ఈ ఒక్క టెస్ట్‌తో ముందే తెలిసిపోతుంది..
Lipoprotein(a) | హార్ట్ ఎటాక్ అంటే ఒకప్పుడు కేవలం వయస్సు మళ్లిన వారికే వచ్చేది. వృద్ధాప్య కారణాల వల్ల గుండె జబ్బుల బారిన పడేవారు. కానీ ప్రస్తుతం యుక్త వయస్సులో ఉన్నవారు కూడా గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. హార్ట్ ఎటాక్ ఘటనలు గణనీయంగా పెరుగుతున్నాయి. హార్ట్ ఎటాక్ అనేది సైలెంట్ కిల్లర్‌లా మారింది.
Lipoprotein(a) | హార్ట్ ఎటాక్ అంటే ఒకప్పుడు కేవలం వయస్సు మళ్లిన వారికే వచ్చేది. వృద్ధాప్య కారణాల వల్ల గుండె జబ్బుల బారిన పడేవారు. కానీ ప్రస్తుతం యుక్త వయస్సులో ఉన్నవారు కూడా గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. హార్ట్ ఎటాక్ ఘటనలు గణనీయంగా పెరుగుతున్నాయి. హార్ట్ ఎటాక్ అనేది సైలెంట్ కిల్లర్‌లా మారింది. ఎలాంటి లక్షణాలు లేకపోయినా కొందరు ఉన్నట్లుండి కుప్పకూలి ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. అయితే హార్ట్ ఎటాక్ సైలెంట్ కిల్లర్ అయినప్పటికీ చాలా మందికి పలు ముందస్తు హెచ్చరికలు తెలుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు సాధారణంగా హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్), ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్), ట్రై గ్లిజరైడ్స్ వంటి లిపిడ్ ప్రొఫైల్ సూచికలపైనే దృష్టి పెడతారు. కానీ గుండె ఆరోగ్యానికి లైపో ప్రోటీన్ (ఎల్‌పీ(ఏ)) అనే మరో కీలక రక్త సూచిక కూడా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
జన్యుపరంగా వచ్చే కణం..
గురుగ్రామ్‌కు చెందిన ఫోర్టిస్ న్యూరాలజీ విభాగం డాక్టర్ సౌరభ్ యతీష్ భన్సాల్ తెలిపిన ప్రకారం లైపోప్రోటీన్(ఎల్‌పీ(ఏ)) అనేది జన్యుపరంగా వచ్చే కొలెస్ట్రాల్ కణం. ఇది చిన్న వయస్సులోనే గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. సాధారణ ఎల్‌డీఎల్ తో పోలిస్తే ఎల్‌పీ(ఏ) స్థాయిలు జననం నుంచే తెలుస్తాయి. జీవితాంతం స్థిరంగా ఉంటాయి. డైట్, వ్యాయామం లేదా జీవనశైలి మార్పులు దీని మీద ప్రభావం చూపవు. అందుకే ఇది చాలా ముఖ్యమైనప్పటికీ చాలా మంది పట్టించుకోని సూచికగా మారింది. ఎల్‌పీ(ఏ) స్థాయి ఎక్కువగా ఉంటే రక్తనాళాల్లో ప్లాక్ (వ్యర్థ పదార్థాలు) వేగంగా ఏర్పడుతుంది. ఇన్‌ఫ్లమేషన్ (వాపు) పెరుగుతుంది, రక్తం గడ్డకట్టే అవకాశం అధికమవుతుంది. ఇవన్నీ కలిసి ముందస్తుగా హార్ట్ అటాక్, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి. కొంతమందికి కొలెస్ట్రాల్ స్థాయిలు సాధారణంగా ఉన్నప్పటికీ, ఎల్‌పీ(ఏ) ఎక్కువగా ఉండటం వల్ల గుండె వ్యాధి ప్రమాదం అధికంగా ఉంటుంది. అందుకనే కొందరు సన్నగా ఉన్నప్పటికీ గుండె పోటుతో కుప్ప కూలి మరణిస్తుంటారు.
ముఖ్యమైన కార్డియాక్ రిస్క్ మార్కర్..
లిపిడ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 2024 మార్గదర్శకాల ప్రకారం ఎల్‌పీ(ఏ) భారతీయులకు ముఖ్యమైన కార్డియాక్ రిస్క్ మార్కర్‌గా నిర్దారించారు. భారతీయులు జన్యుపరంగా గుండె వ్యాధులకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉండడంతో ఈ పరీక్ష ద్వారా ముందుగానే ప్రమాదాన్ని గుర్తించవచ్చు. ఈ పరీక్ష ద్వారా ముందస్తు ప్రమాదాన్ని గుర్తించి నివారణ చర్యలు తీసుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎల్‌పీ(ఏ) జన్యుపరమైనది కావడంతో జీవితంలో ఒకసారి పరీక్ష చేయించుకోవడం సరిపోతుంది. సాధారణంగా 18 సంవత్సరాల వయస్సు వచ్చేలోపు ఈ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పలు ఇతర సందర్భాల్లో ఈ పరీక్షను ముందుగానే చేయించుకోవాల్సి వస్తుంది.
వైద్య పరీక్షలతో నిర్దారణ..
కుటుంబంలో ముందస్తు హార్ట్ అటాక్ లేదా ఆకస్మిక గుండె సమస్యల చరిత్ర ఉన్నా, చిన్న వయస్సులో అధిక కొలెస్ట్రాల్ ఉన్నా, స్ట్రోక్ లేదా మైకార్డియల్ ఇన్‌ఫార్‌క్షన్ కుటుంబ చరిత్ర ఉంటే ముందుగానే వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఎల్‌పీ(ఏ) స్థాయిలు వయస్సుతో పెద్దగా మారవు కాబట్టి, సాధారణంగా ఒక్కసారి పరీక్ష సరిపోతుంది. అయితే వైద్యుల సూచన మేరకు మళ్లీ పరీక్ష అవసరమయ్యే అవకాశాలు ఉంటాయి. అధిక ఎల్‌పీ(ఏ) ఉన్నవారు ఎల్‌డీఎల్ ను 70 మిల్లీగ్రామ్/డీఎల్ కంటే తక్కువగా, అధిక ప్రమాదం ఉన్నవారు 55 మిల్లీగ్రామ్/డీఎల్ కంటే తక్కువగా ఉంచుకోవాలని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. ఎల్‌పీ(ఏ) గుండె సంబంధిత ప్రమాదాన్ని పలు విధాలుగా పెంచుతుంది. రక్తనాళాల్లో ప్లాక్ త్వరగా పేరుకుపోవడం, రక్త గడ్డలు ఏర్పడి బ్లాకేజీలకు దారి తీసే అవకాశం, రక్తనాళాల్లో అస్థిరత పెరగడం వంటి కారణాల వల్ల హార్ట్ అటాక్, స్ట్రోక్, ఏయార్టిక్ వాల్వ్ వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.
భారతీయుల్లో ఇప్పటికే ఒబేసిటీ, డయాబెటిస్, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి సమస్యలు ఎక్కువగా ఉండడం వల్ల ఎల్‌పీ(ఏ) ప్రభావం మరింత పెరుగుతోంది. ఆరోగ్యకరమైన జీవనశైలి ఉన్నప్పటికీ ఎల్‌పీ(ఏ) ఎక్కువగా ఉంటే ప్రమాదం అధికంగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే కేవలం ఒకేసారి చేసే పరీక్ష ద్వారా దాగి ఉన్న జన్యుపరమైన ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి, సరైన జీవనశైలి మార్పులు, వైద్య చికిత్సతో భవిష్యత్తు ప్రమాదాలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Gene Therapy | కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఇక మందులను వాడక్కర్లేదు.. జీన్ థెరపీతో సాధ్యం..
మే 3, 2026

Actress Divyanka | సినీ ఇండస్ట్రీలో విషాదం.. 30 ఏళ్ల వయసులో గుండెపోటుతో యువనటి మృతి..!
ఏప్రిల్ 22, 2026

High Blood Pressure | 30లలో ఉన్నవారికి వైద్యుల అలర్ట్.. బ్లడ్ ప్రెషర్ కాస్త ఎక్కువ ఉన్నా జాగ్రత్త వహించాల్సిందే..
ఏప్రిల్ 22, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



