త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rice | రైస్‌ను ఇలా తింటే బ‌రువు పెర‌గ‌రు.. షుగ‌ర్ కంట్రోల్‌లో ఉంటుంది..

Rice | భార‌తీయులు రైస్‌ను ఎక్కువ‌గా తింటార‌న్న విష‌యం విదిత‌మే. మ‌రీ ముఖ్యంగా ద‌క్షిణాది ప్ర‌జ‌ల‌కు బియ్య‌మే ప్ర‌ధాన ఆహారం. బియ్యంతో అన్నం లేదా ఇత‌ర వంట‌కాల‌ను చేసి రోజూ తింటారు. ఈ క్ర‌మంలోనే రైస్‌లో అనేక ర‌కాల వెరైటీలు కూడా మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి.

S

Lifestyle | Published On Dec 29, 2025, 10.17 am IST

Rice | రైస్‌ను ఇలా తింటే బ‌రువు పెర‌గ‌రు.. షుగ‌ర్ కంట్రోల్‌లో ఉంటుంది..
Advertisement

Rice | భార‌తీయులు రైస్‌ను ఎక్కువ‌గా తింటార‌న్న విష‌యం విదిత‌మే. మ‌రీ ముఖ్యంగా ద‌క్షిణాది ప్ర‌జ‌ల‌కు బియ్య‌మే ప్ర‌ధాన ఆహారం. బియ్యంతో అన్నం లేదా ఇత‌ర వంట‌కాల‌ను చేసి రోజూ తింటారు. ఈ క్ర‌మంలోనే రైస్‌లో అనేక ర‌కాల వెరైటీలు కూడా మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే బియ్యంతో అన్నం వండి తింటే దాని వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయ‌న్న విష‌యం తెలిసిందే. అందుక‌నే డ‌యాబెటిస్ ఉన్న‌వారు బియ్యంకు బ‌దులుగా చిరు ధాన్యాల‌ను లేదా గోధుమ పిండితో త‌యారు చేసిన చ‌పాతీల‌ను తింటారు. అయితే బియ్యంతో అన్నం వండాక దాన్ని ఎప్పుడు తింటున్నామనే విష‌యంపైనే మ‌న షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌డం ఆధార‌ప‌డి ఉంటుంద‌ని ఓ న్యూట్రిష‌నిస్టు తెలియ‌జేశారు. చాలా మంది అన్నం అంటే షుగ‌ర్ లెవల్స్‌ను పెంచుతుంద‌ని భావిస్తారు. కానీ స‌రైన టైములో తింటే అలా జ‌ర‌గ‌కుండా చూసుకోవ‌చ్చ‌ని ఆమె తెలిపారు.

వేడిగా ఉన్న‌ప్పుడు తిన‌కూడ‌దు..

న్యూట్రిష‌నిస్టు దీప్షికా జైన్ ఇదే విష‌యంపై త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఆమె మాట్లాడుతూ చాలా మంది అన్నం అంటే షుగ‌ర్ లెవ‌ల్స్‌ను పెంచుతుంద‌ని భావిస్తారు. అది నిజ‌మే. కానీ స‌రైన టైములో తింటే అన్నం షుగ‌ర్ లెవ‌ల్స్‌ను పెంచే పిండి పదార్థంగా కాకుండా, షుగ‌ర్ లెవ‌ల్స్ ను నియంత్ర‌ణ‌లో ఉంచే ఫైబ‌ర్‌గా మారుతుంది. ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. సాధార‌ణంగా చాలా మంది అన్నం ఉడ‌క‌గానే లేదా వేడిగా ఉన్న‌ప్పుడు తినాల‌ని చెబుతారు. ఎందుకంటే చ‌ల్ల‌గా మారితే అందులో బ్యాక్టీరియా చేరుతుంద‌ని, అది మ‌న‌కు అనారోగ్యాల‌ను క‌ల‌గ‌జేస్తుంద‌ని విశ్వ‌సిస్తారు. క‌నుక ఏ ఆహారాన్న‌యినా స‌రే వేడిగా ఉన్న‌ప్పుడే తినాల‌ని చూస్తుంటారు. అయితే అన్నం విష‌యంలో కాస్త భిన్న‌మైన ప‌ద్ధ‌తిని పాటించాలి. అన్నం వండిన త‌రువాత వేడిగా ఉన్న‌ప్పుడు తిన‌కూడ‌దు. దాన్ని చ‌ల్ల బ‌రిచాక తినాలి.. అని ఆమె తెలిపారు.

రెసిస్టెంట్ స్టార్చ్ మంచిది..

అన్నం ఉడికిన త‌రువాత వేడిగా ఉన్న స‌మ‌యంలో అది పిండి ప‌దార్థం (స్టార్చ్‌)గా ఉంటుంది. ఇది తేలిగ్గా జీర్ణ‌మ‌య్యే ఆహారం. దీని వ‌ల్ల వేడిగా ఉన్న‌ప్పుడు అన్నాన్ని తింటే అది వెంట‌నే జీర్ణ‌మై షుగ‌ర్ లెవ‌ల్స్ అమాంతం పెరుగుతాయి. దీంతో శ‌రీరంలో పెద్ద ఎత్తున ఇన్సులిన్ అవ‌స‌రం ఏర్ప‌డుతుంది. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఇది అస‌లు మంచిది కాదు. ఇక ఇత‌రుల్లోనూ గ్లూకోజ్ లెవ‌ల్స్ అమాంతం పెరిగి అదంతా కొవ్వు కింద మారుతుంది. దీంతో శ‌రీరంలో క్యాల‌రీలు అధికంగా చేరుతాయి. బ‌రువు పెరుగుతారు. క‌నుక ఇలా జ‌ర‌గ‌కుండా ఉండాలంటే అన్నాన్ని చ‌ల్ల‌బరిచిన త‌రువాత తినాలి.. అని ఆమె తెలిపారు. అన్నం చ‌ల్ల‌గా అయ్యాక అది రెసిస్టెంట్ స్టార్చ్‌గా మారుతుంది. ఇది అంత త్వ‌ర‌గా జీర్ణం కాదు. పైగా దీన్ని తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ కూడా వెంట‌నే పెర‌గ‌వు. నెమ్మ‌దిగా ర‌క్తంలో గ్లూకోజ్ క‌లుస్తుంది. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. క‌నుక అన్నాన్ని ఉడికించిన వెంట‌నే తిన‌కుండా చ‌ల్ల‌గా అయ్యాక తింటే మంచిది.. అని అన్నారు.

ఫ్రిజ్‌లో పెట్టాలి..

అయితే అన్నం ఉడికిన త‌రువాత అది చ‌ల్ల‌గా అయ్యేందుకు క‌నీసం గంట స‌మ‌యం అయినా ప‌డుతుంది. క‌నుక ఆ త‌రువాతే తినాల్సి ఉంటుంది. ఇక అన్నం చ‌ల్ల‌గా అయ్యే కొద్దీ రెసిస్టెంట్ స్టార్చ్‌గా మారే ప్ర‌భావం ఇంకా పెరుగుతుంది. అంటే అన్నం ఉడికిన త‌రువాత 8 నుంచి 10 గంట‌లు అయ్యాక అది ఇంకా దృఢ‌మైన రెసిస్టెంట్ స్టార్చ్ గా మారుతుంది. అలాంటి అన్నాన్ని తిన‌డం శ్రేయ‌స్క‌ర‌మ‌ని ఆమె చెప్పారు. అన్నాన్ని ఈ విధంగా తింటే షుగ‌ర్ లెవ‌ల్స్, అధిక బ‌రువు పెర‌గ‌కుండా చూసుకోవ‌చ్చ‌ని తెలిపారు. అయితే అంత సేపు అన్నం ఉంటే అందులో బ్యాక్టీరియా చేరుతుంది క‌దా అని అంద‌రికీ సందేహం క‌ల‌గ‌వ‌చ్చు. అది నిజ‌మే. అన్నం ఉడికిన త‌రువాత 2 గంట‌ల‌కు పైగా గ‌ది ఉష్ణోగ్ర‌త వ‌ద్ద ఉంటే అందులో బాక్టీరియా చేరుతుంది. కానీ గంట అయ్యాక దాన్ని తింటారు క‌నుక ఫ‌ర్వాలేదు. అయితే అంత‌క‌న్నా మించి ఎక్కువ సేపు అన్నాన్ని ఉంచ‌ద‌లిస్తే దాన్ని ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ త‌రువాత ఎంత సేప‌టికి అయినా స‌రే దాన్ని తిన‌వ‌చ్చు.. అని ఆమె వివ‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement