Watermelon | పుచ్చకాయలను నేరుగా తినకుండా వాటిపై కాస్త ఉప్పు చల్లి తినాలి.. ఎందుకంటే..?
Watermelon | వేసవి కాలం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేవి పుచ్చకాయలు. ఈ సీజన్లో ఇవి అధికంగా లభిస్తాయి. ప్రస్తుతం పుచ్చకాయలు సీజన్లతో సంబంధం లేకుండా దాదాపు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటున్నాయి. కానీ వేసవిలో ఇవి అధికంగా వస్తాయి. ఎండకాలంలో వీటిని అధికంగా తింటుంటారు. వీటితో జ్యూస్ చేసి కూడా తాగుతుంటారు.
Watermelon | వేసవి కాలం అనగానే అందరికీ గుర్తుకు వచ్చేవి పుచ్చకాయలు. ఈ సీజన్లో ఇవి అధికంగా లభిస్తాయి. ప్రస్తుతం పుచ్చకాయలు సీజన్లతో సంబంధం లేకుండా దాదాపు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటున్నాయి. కానీ వేసవిలో ఇవి అధికంగా వస్తాయి. ఎండకాలంలో వీటిని అధికంగా తింటుంటారు. వీటితో జ్యూస్ చేసి కూడా తాగుతుంటారు. అయితే పుచ్చకాయ ముక్కలను తినేటప్పుడు వాటిపై కాస్తు ఉప్పు చల్లి తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల పలు లాభాలు కలుగుతాయని వారు అంటున్నారు. చాలా మంది పుచ్చకాయ ముక్కలపై కాస్త ఉప్పు చల్లి తింటుంటారు. దీంతో రుచి బాగుంటుందని భావిస్తారు. అయితే ఇలా చేయడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. పుచ్చకాయ ముక్కలను ఉప్పుతో తినాలని వారు సూచిస్తున్నారు.
రుచి పెరుగుతుంది..
పుచ్చకాయ ముక్కలపై చిటికెడు ఉప్పు చల్లి తినడం వల్ల ఆ కాయల రుచి మరింత పెరుగుతుంది. సహజంగానే ఉండే తీపి రుచి మరికాస్త పెరుగుతుంది. అదనంగా చక్కెర కలపాల్సిన అవసరం ఉండదు. మరింత తీపిగా, రుచిగా అనిపిస్తాయి. పుచ్చకాయల ముక్కలపై ఉప్పు చల్లి తినడం వల్ల నాలుకపై ఉండే రుచి గ్రాహకాలు ప్రభావితం అవుతాయి. 2023లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం ఉప్పులోని క్లోరైడ్ అయాన్లు తీపి రుచిని గుర్తించే గ్రాహకాలతో చర్య జరిపి తీపిని పెంచి చేదు రుచిని తగ్గిస్తాయి. ఉప్పు వల్ల పుచ్చకాయల్లోని సహజ చక్కెరల రుచి మరింత స్పష్టంగా తెలుస్తుంది. అందువల్లే పుచ్చకాయలపై ఉప్పు చల్లి తిన్నప్పుడు రుచి మెరుగు పడుతుంది. ఈ కారణం వల్లనే పలు తీపి పదార్థాల తయారీలోనూ కాస్త ఉప్పును కలుపుతుంటారు.
ఎలక్ట్రోలైట్స్ భర్తీకి..
వేసవిలో శరీరం సహజంగానే డీహైడ్రేషన్‌కు గురవుతుంది. శరీరంలోని నీటి శాతం త్వరగా తగ్గుతుంది. అలాగే శరీరం ఎలక్ట్రోలైట్స్‌ను కూడా కోల్పోతుంది. చాలా మంది నీళ్లను అధికంగా తాగుతారు. కానీ శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. అందుకు పుచ్చకాయలు ఎంతో సహాయం చేస్తాయి. అయితే పుచ్చకాయలను తింటే ఇతర ఎలక్ట్రోలైట్స్ లభిస్తాయి కానీ సోడియం లభించదు. అది ఉప్పులో ఉంటుంది. అందువల్ల పుచ్చకాయలను తినే సమయంలో కాస్త ఉప్పు చల్లి తింటే తద్వారా సోడియం కూడా శరీరానికి లభిస్తుంది. దీంతో శరీరం కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్‌ను తిరిగి పొందుతుంది. పుచ్చకాయల్లో నీటి శాతం అధికంగా ఉండడం వల్ల ఈ కాయలను తింటే సహజంగానే శరీరానికి నీరు లభిస్తుంది. దీంతో శరీరం చల్లగా మారుతుంది. అయితే ఎలక్ట్రోలైట్స్ పూర్తి స్థాయిలో భర్తీ కావాలంటే ఆ కాయలపై కాస్త ఉప్పు చల్లి తినాల్సి ఉంటుంది.
జీర్ణక్రియకు మేలు చేస్తుంది..
పుచ్చకాయ ముక్కలపై ఉప్పు చల్లడం వల్ల రుచి సమతుల్యత పెరుగుతుంది. కొన్ని సమయాల్లో పుచ్చకాయ సరిగ్గా పండకపోయినా లేదా రుచిగా లేకపోయినా అలాంటి కాయలను తినాలనిపించదు. కానీ కాస్త ఉప్పు చల్లి తింటే రుచిగా ఉంటాయి. కాయల్లోని సహజ తీపి రుచి తెలుస్తుంది. పుచ్చకాయలను స్వల్ప పరిమాణంలో ఉప్పుతో కలిపి తినడం వల్ల జీర్ణక్రియకు సహాయ పడతాయి. తక్కువ పరిమాణంలో ఉప్పును కలుపుతారు కనుక జీర్ణ రసాలు ఉత్పత్తి అవుతాయి.దీని వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సులభంగా శోషించుకుంటుంది. అలాగే శరీరానికి శక్తి కూడా లభిస్తుంది. భోజనం చేసిన తరువాత 30 నిమిషాలు విరామం ఇచ్చి అప్పుడు పుచ్చకాయలపై ఉప్పు చల్లి తింటే మేలు జరుగుతుంది. పుచ్చకాయలతో ఉప్పు కలిపి తినడం వల్ల పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఆహారంపై ధ్యాస తగ్గుతుంది. అధికంగా తినడాన్ని నివారిస్తుంది. దీంతో బరువు తగ్గడం తేలికవుతుంది. అయితే హైబీపీ ఉన్నవారు ఉప్పును వాడే విషయంలో డాక్టర్ సలహా తీసుకోవాలి. ఇక ఉప్పుకు బదులుగా రాక్ సాల్ట్ లేదా బ్లాక్ సాల్ట్ వాడవచ్చు. కొందరు నిమ్మరసం, మిరియాల పొడి చల్లి కూడా పుచ్చకాయలను తింటారు. అలా కూడా వీటిని తినవచ్చు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



