Orange Juice | నారింజ పండ్ల జ్యూస్‌ను రోజూ తాగవచ్చా..? న్యూట్రిషనిస్టు సమాధానం..!
Orange Juice | నారింజ పండ్లు దాదాపుగా ఏడాది పొడవునా అందరికీ అందుబాటులో ఉంటాయి. ఈ పండ్ల ధర కూడా తక్కువగానే ఉంటుంది. వీటిని చాలా మంది కొనుగోలు చేసి తింటుంటారు. వీటితో జ్యూస్ తయారు చేసి తాగుతుంటారు. ఎక్కువగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన అనంతరం లేదా వ్యాయామం చేశాక చాలా మంది నారింజ పండ్ల రసం సేవిస్తుంటారు.
Orange Juice | నారింజ పండ్లు దాదాపుగా ఏడాది పొడవునా అందరికీ అందుబాటులో ఉంటాయి. ఈ పండ్ల ధర కూడా తక్కువగానే ఉంటుంది. వీటిని చాలా మంది కొనుగోలు చేసి తింటుంటారు. వీటితో జ్యూస్ తయారు చేసి తాగుతుంటారు. ఎక్కువగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన అనంతరం లేదా వ్యాయామం చేశాక చాలా మంది నారింజ పండ్ల రసం సేవిస్తుంటారు. ఇది చాలా మందికి ఫేవరెట్ జ్యూస్ గా కూడా మారింది. నారింజ పండ్ల రసం తియ్యని, పుల్లని రుచిని కలిగి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇందులో అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. నారింజ పండ్ల రసాన్ని సేవిస్తే అనేక పోషకాలు లభిస్తాయి. అయితే రోజూ ఈ పండ్ల జ్యూస్‌ను తాగవచ్చా, లేదా అనే విషయంపై చాలా మందికి సందేహాలు ఉంటాయి. వాటికి న్యూట్రిషనిస్టు రూపాలి దత్తా సమాధానాలు చెప్పారు.
రోజూ తాగవచ్చా..?
నారింజ పండ్ల జ్యూస్‌ను రోజూ తాగవచ్చని రూపాలి తెలిపారు. అయితే రోజూ తాగాలనుకుంటే అందులో చక్కెర లేకుండా తాగాలని, అలాగే ప్యాక్ చేయబడిన పండ్ల రసాన్ని సైతం తాగవద్దని సూచించారు. ప్యాక్ చేయబడిన నారింజ పండ్ల రసంలోనూ చక్కెర ఉంటుంది కనుక దాన్ని రోజూ తాగడం శ్రేయస్కరం కాదని అన్నారు. ఇంట్లోనే సహజసిద్ధంగా తయారు చేసుకున్న నారింజ పండ్ల రసాన్ని చక్కెర కలపకుండా నేరుగా తాగాలని తెలిపారు. అయితే నారింజ పండ్ల రసాన్ని సేవిస్తే ఫైబర్ శాతం తగ్గుతుందని, ఫైబర్ కావాలనుకునే వారు పండ్లను నేరుగా తినడమే మంచిదని సూచించారు. ఇక డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఉన్నవారు, బరువు తగ్గాలని చూస్తున్నవారు నారింజ పండ్ల రసాన్ని తాగకూడదని, పండ్లను నేరుగా తినాలని తెలిపారు.
అనేక లాభాలు..
నారింజ పండ్లను తినడం వల్ల అనేక లాభాలు ఉంటాయని ఆమె చెప్పారు. ఈ పండ్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. దీని వల్ల దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అధికంగా ఉంటాయి కనుక నారింజ పండ్లను తింటే ఫ్రీ ర్యాడికల్స్‌ను నిర్మూలించవచ్చు. చర్మం కాంతివంతంగా మారి మెరుస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. ఫ్లేవనాయిడ్స్, క్యాల్షియం వంటి సమ్మేళనాలు అధికంగా ఉంటాయి కనుక నారింజ పండ్లు ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతాయి. కిడ్నీ స్టోన్లు ఏర్పడకుండా చూస్తాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గేందుకు సహాయం చేస్తాయి. హృదయ సంబంధ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.
పలు అనారోగ్య సమస్యలు ఉన్నవారు నారింజ పండ్ల రసాన్ని రోజూ తాగవద్దని అప్పుడప్పుడు తాగవచ్చని రూపాలి దత్తా తెలిపారు. జీర్ణ సమస్యలు ఉన్నవారు, అలర్జీలతో బాధపడుతున్నవారు, చక్కెర ఓవర్ లోడ్ అవుతుందని భావించే వారు ఈ రసాన్ని రోజూ తాగకపోవడమే మంచిదని ఆమె అన్నారు. నారింజ పండ్ల రసం ఎంతో రుచిగా ఉంటుంది. అనేక పోషక విలువలను కూడా కలిగి ఉంటుంది. దీన్ని కూడా ఇతర తీపి పానీయాల లాగే భావించాలి. మోతాదులో తీసుకోవాలి. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.. అని ఆమె తెలిపారు.
సంబంధిత వార్తలు

Dragon Fruit on Terrace | టెర్రస్‌పై డ్రాగన్ ఫ్రూట్ సాగు.. నెలకు రూ. 4 లక్షలు సంపాదిస్తున్న రిటైర్డ్ ప్రధానోపాధ్యాయురాలు
సెప్టెంబర్ 10, 2026

Tummala Nageshwar Rao | మన కూరగాయలు, పండ్లను ఎవరూ కొంటలేరు.. తినడానికి కూడా వీల్లేదు
సెప్టెంబర్ 10, 2026

Panic Attack vs Heart Attack | చాతీలో నొప్పి.. హార్ట్ ఎటాకా లేక పానిక్ ఎటాకా? ప్రాణాలు నిలబెట్టే ఈ తేడాలు తెలుసుకోండి!
జూన్ 10, 2026
తాజావార్తలు
- ●Antibiotics | పెయిన్కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారా..? కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు..!
- ●Kayadu Lohar | ప్యారడైజ్ కోసం కయదు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే? - అందరికంటే హీరోయిన్‌కే తక్కువ!
- ●Wine Shops | వైన్ షాపులు, బార్లు బంద్.. ఎప్పుడంటే? ఎందుకంటే?
- ●Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది
- ●Auto Driver Monthly Income 75000 | ఆటోడ్రైవర్ నెల సంపాదన రూ.75 వేలు.. కూతురి చదువు కోసం భారీ ఖర్చు.. చివరకు మిగిలింది ఇదే..!
- ●National Awards | అట్టహాసంగా జాతీయ అవార్డుల ప్రదానోత్సవ వేడుక - పురస్కారాలు స్వీకరించిన టాలీవుడ్ ప్రముఖులు వీళ్లే!

Antibiotics | పెయిన్కిల్లర్లు, యాంటీబయాటిక్స్ వాడుతున్నారా..? కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు..!

Kayadu Lohar | ప్యారడైజ్ కోసం కయదు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతంటే? - అందరికంటే హీరోయిన్‌కే తక్కువ!

Wine Shops | వైన్ షాపులు, బార్లు బంద్.. ఎప్పుడంటే? ఎందుకంటే?

Vemula Prashanth Reddy | జరగకూడని ఘటనలకు రాష్ట్రం వేదికవుతోంది



