Stairs Climbing | మెట్లు ఎక్కినప్పుడు శ్వాస పరంగా ఇబ్బంది పడుతున్నారా..? అయితే జాగ్రత్త..!
Stairs Climbing | మెట్లు ఎక్కడం అంటే శరీరం గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా కదలాల్సి రావడం. ఈ సమయంలో కొంచెం ఊపిరి ఆడకపోవడం సహజమే. కానీ, అదే అధికంగా శ్వాస తీసుకోలేని పరిస్థితి వస్తే మాత్రం దాన్ని తేలికగా తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Stairs Climbing | మెట్లు ఎక్కడం అంటే శరీరం గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా కదలాల్సి రావడం. ఈ సమయంలో కొంచెం ఊపిరి ఆడకపోవడం సహజమే. కానీ, అదే అధికంగా శ్వాస తీసుకోలేని పరిస్థితి వస్తే మాత్రం దాన్ని తేలికగా తీసుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బయటకు ఆరోగ్యంగా కనిపించే వ్యక్తుల్లో కూడా మెట్లు ఎక్కగానే ఊపిరి తీసుకోవడంలో అధికంగా ఇబ్బంది కలిగితే, అది తీవ్రమైన అనారోగ్య సమస్యకు సంకేతం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. కాగా ఇదే ఈ అంశంపై న్యూఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ అవి కుమార్ మాట్లాడుతూ, వైద్యపరంగా చూస్తే, శ్రమ సమయంలో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది అనేది చిన్న విషయం కాదు. ఇది తప్పనిసరిగా గమనించాల్సిన హెచ్చరిక సంకేతం, అని తెలిపారు.
ఊపిరితిత్తుల వ్యాధులు అయితే..
మెట్లు ఎక్కడాన్ని ఒక మోస్తరు స్థాయి శారీరక వ్యాయామంగా పరిగణిస్తారు. ఈ సమయంలో శ్వాసకోశ వ్యవస్థ, గుండె, కండరాలు కలిసి సమన్వయంగా పనిచేయాలి. శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది, గుండె వేగంగా రక్తాన్ని పంపాలి. ఆరోగ్యంగా ఉన్నవారు దీనికి సులభంగా అడ్జస్ట్ అవుతారు. కానీ లోపల ఏదైనా సమస్య ఉంటే అదే సమయంలో ఊపిరి ఆడక ఇబ్బంది పడతారని డాక్టర్ అవి కుమార్ వివరించారు. మెట్లు ఎక్కేటప్పుడు ఊపిరి ఆడకపోవడానికి ప్రధానంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు కారణమయ్యే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. డాక్టర్ అవి కుమార్ ప్రకారం, ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ ఎయిర్‌వే డిసీజ్ (COPD) వంటి సమస్యలు ప్రారంభ దశలో విశ్రాంతి సమయంలో ఎలాంటి లక్షణాలు చూపించకపోవచ్చు. కానీ శరీరం శ్రమ పడినప్పుడు మాత్రమే అవి బయటపడతాయి. కొందరిలో సాధారణంగా శ్వాస బాగానే ఉన్నా, వ్యాయామ సమయంలో బ్రాంకోకన్స్ట్రిక్షన్ (శ్వాసనాళాలు కుచించుకుపోవడం) వల్ల తీవ్రమైన ఊపిరి సమస్యలు వస్తాయని తెలిపారు.

గుండె వ్యాధులు ఉన్నా కూడా..
ఇంటర్‌స్టీషియల్ లంగ్ డిసీజ్, పల్మనరీ వాస్క్యులర్ డిజార్డర్స్ లేదా గతంలో ఊపిరితిత్తులకు తగిలిన దెబ్బల వల్ల కూడా ఎక్కువ శ్రమ సమయంలో ఆక్సిజన్ అందడానికి ఇబ్బంది కలుగుతుందని ఆయన తెలిపారు. ఊపిరి ఆడకపోవడం అంటే తప్పనిసరిగా ఊపిరితిత్తుల సమస్యే అనుకోవాల్సిన అవసరం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. గుండె సంబంధిత సమస్యలు, రక్తహీనత (అనీమియా), హార్మోన్ లేదా ఇతర మెటబాలిక్ లోపాలు కూడా ఇందుకు కారణమవుతాయని అన్నారు. డాక్టర్ అవి కుమార్ మాట్లాడుతూ, శ్రమ చేస్తున్న సమయంలో గుండె తగినంత రక్తాన్ని పంపించలేకపోతే, మొదటిగా కనిపించే లక్షణం ఊపిరి ఆడకపోవడమే. అలాగే రక్తహీనత ఉన్నవారిలో ఆక్సిజన్ మోయగల సామర్థ్యం తగ్గిపోవడం వల్ల చిన్న శ్రమకే అలసట, ఊపిరి సమస్య వస్తాయి, బయటకు ఆరోగ్యంగా కనిపించినా కూడా ఆ సమస్యలు వస్తాయి, అని వివరించారు.
ఏయే టెస్టులు చేయించుకోవాలి..
ఊపిరి సమస్య అకస్మాత్తుగా ప్రారంభమైతే, కొత్తగా వచ్చి రోజురోజుకూ పెరుగుతూ ఉంటే, లేదా మీరు చేసే శ్రమకు మించి తీవ్రంగా అనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆలస్యం చేస్తే వ్యాధి ఏదైనా సరే మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. స్పైరోమెట్రీ (బ్రోంకోడైలేటర్ రివర్సిబిలిటీ)తో శ్వాసనాళాల పనితీరును తెలుసుకోవడానికి టెస్టు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇమేజింగ్ పరీక్షలు (ఎక్స్‌రే / సిటీ స్కాన్) చేయించుకుంటే ఊపిరితిత్తుల నిర్మాణాన్ని పరిశీలించవచ్చు. డిఫ్యూషన్ కెపాసిటీ టెస్ట్ ద్వారా ఊపిరితిత్తులు ఆక్సిజన్‌ను రక్తంలోకి ఎంత సమర్థంగా పంపిస్తున్నాయో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. గుండె పరీక్ష (2డి ఎకోకార్డియోగ్రఫీ) ద్వారా గుండె పనితీరు, పల్మనరీ ఆర్టరీ ప్రెషర్ తదితర అంశాలను అంచనా వేస్తారు. అలాగే ఆక్సిజన్ సాచ్యురేషన్, ఇతర ల్యాబ్ పరీక్షలను కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక మెట్లు ఎక్కగానే తీవ్రమైన ఊపిరి సమస్య వస్తే దాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అది మీ శరీరం ఇచ్చే హెచ్చరిక అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయని అంటున్నారు.
సంబంధిత వార్తలు

Heat Stroke | ఎండల్లో జాగ్రత్త.. హీట్ స్ట్రోక్ వస్తే ఈ 10 లక్షణాలు కనిపిస్తాయి.. లైట్ తీసుకుంటే ప్రాణాలకే ప్రమాదం..
మే 21, 2026

Upper Body Strength Yoga | జిమ్ వద్దు.. బరువులూ ఎత్తొద్దు: మీ ‘అప్పర్ బాడీ’ని ఐరన్‌లా మార్చే బెస్ట్ యోగాసనాలు ఇవే!
మే 17, 2026

Eyes Health | కంటి చూపు స్పష్టంగా ఉన్నంత మాత్రాన కళ్లు ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు.. వైద్యులు ఏమంటున్నారు..?
మే 16, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



