High Court | పార్టీ ఫిరాయింపుల కేసు.. దానంకు హైకోర్టు నోటీసులు
High Court | పార్టీ ఫిరాయింపు (Party defection) ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు (High Court) నోటీసులు (Notices) జారీ చేసింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని దానం నాగేందర్‌తో పాటు అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు పంపింది.
Flash news | Published On Mar 23, 2026, 1.49 pm IST
త్రినేత్ర.న్యూస్: పార్టీ ఫిరాయింపు (Party defection) ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు హైకోర్టు (High Court) నోటీసులు (Notices) జారీ చేసింది. దానం పార్టీ మారలేదని, ఇందుకు ఆధారాలు లేవని స్పీకర్ తన నిర్ణయాన్ని వెల్లడించగా దీన్ని సవాల్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యే, శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కర్ణాటక, బీహార్‌లో ఇలాంటి పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఆయన కోర్టులో ప్రస్తావించారు. స్పీకర్ తీర్పును కొట్టివేయాలని ఆయన అందులో కోరారు.
ఈ పిటిషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని దానం నాగేందర్‌తో పాటు అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు పంపింది. తదుపరి విచారణను వచ్చే నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
మరో ఏడు రిట్ పిటిషన్లు దాఖలు..
ఇదిలా ఉండగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సోమవారం హైకోర్టులో ఏడు రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్‌రెడ్డిలపై దాఖలైన ఈ పిటిషన్ల విచారణ రేపు త్రిసభ్య ధర్మాసనం ముందుకు వచ్చే అవకాశం ఉంది.

తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





