త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao | రియ‌ల్ ఎస్టేట్ దందా చేస్తున్న రేవంత్ స‌ర్కార్‌: హ‌రీశ్ రావు

Harish Rao | భూములు అమ్మడమే ప్రభుత్వ పనా? అని రేవంత్ రెడ్డి (Revanth Reddy) స‌ర్కార్‌ను హ‌రీశ్ రావు నిల‌దీశారు. ఎక్కడ భూమి కనబడినా అమ్ముడేనా? అని మండిప‌డ్డారు. రేవంత్‌ ప్రభుత్వ పాలన కాదు.. రియల్‌ ఎస్టేట్‌ దందా చేస్తున్న‌ద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

G

Flash news | Published On Nov 13, 2026, 11.50 am IST

Harish Rao | రియ‌ల్ ఎస్టేట్ దందా చేస్తున్న రేవంత్ స‌ర్కార్‌: హ‌రీశ్ రావు
Advertisement

Harish Rao | త్రినేత్ర న్యూస్‌: హైద‌రాబాద్‌లోని కూకట్‌పల్లి ట్రక్ పార్క్ (Kukatpally Truck Park) భూముల వేలంపై బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. ప్రభుత్వ వెంట‌నే వేలం నిర్ణయాన్ని వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తూ ధ‌ర్నా (BRS Protest) నిర్వ‌హించింది. ఆందోళనలో మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao), ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, బీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూములను ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంపై హరీశ్ రావు ఎదుట స్థానికుల ఆవేదన వ్య‌క్తం చేశారు. దీంతో భూముల వేలాన్ని అడ్డుకుంటామని, స్థానిక ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు. ట్రక్‌ పార్క్‌ భూములు అమ్మితే ఊరుకునే ప్ర‌సక్తే లేద‌ని స్ప‌ష్టం చేశారు.

భూములు అమ్మడమే ప్రభుత్వ పనా? అని రేవంత్ రెడ్డి (Revanth Reddy) స‌ర్కార్‌ను హ‌రీశ్ రావు నిల‌దీశారు. ఎక్కడ భూమి కనబడినా అమ్ముడేనా? అని మండిప‌డ్డారు. రేవంత్‌ ప్రభుత్వ పాలన కాదు.. రియల్‌ ఎస్టేట్‌ దందా చేస్తున్న‌ద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రేవంత్‌ మాటలు చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని, కాంగ్రెస్‌ (Congress) అధికారంలోకి వస్తే ఇంచు భూమి కూడా అమ్మేది లేద‌ని చెప్పార‌న్నారు. ఇప్పుడు భూములు అమ్మడమే పనిగా పెట్టుకున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. రేవంత్‌ కన్నుపడితే చాలు.. భూములు అమ్మడమే అంటూ విమ‌ర్శించారు.

Advertisement
Advertisement