త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahesh Goud | రాహుల్ గాంధీ ప‌క్క‌న ప‌రుగెత్త‌డం నా అదృష్టం

Mahesh Goud | గిగ్ వ‌ర్క‌ర్స్ ర్యాలీ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ ప‌క్క‌న ప‌రుగెత్త‌డం నా అదృష్ట‌మ‌ని టీ పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మ‌హేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అధి నాయ‌కుడి ప‌క్క‌న న‌డిచే అవ‌కాశం రావ‌డం మ‌హాభాగ్యం అని ఆయ‌న అన్నారు.

S

Telangana | Published On Nov 14, 2026, 3.04 pm IST

Mahesh Goud | రాహుల్ గాంధీ ప‌క్క‌న ప‌రుగెత్త‌డం నా అదృష్టం
Advertisement

అధినాయ‌కుడి ప‌క్క‌న న‌డిచే అవ‌కాశం రావ‌డం మ‌హాభాగ్యం
మీడియాతో టీ పీసీసీ చీఫ్‌, ఎమ్మెల్సీ మ‌హేశ్ కుమార్ గౌడ్ చిట్‌చాట్

Mahesh Goud | త్రినేత్ర న్యూస్ : గిగ్ వ‌ర్క‌ర్స్ ర్యాలీ సంద‌ర్భంగా రాహుల్ గాంధీ ప‌క్క‌న ప‌రుగెత్త‌డం నా అదృష్ట‌మ‌ని టీ పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మ‌హేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అధి నాయ‌కుడి ప‌క్క‌న న‌డిచే అవ‌కాశం రావ‌డం మ‌హాభాగ్యం అని ఆయ‌న అన్నారు. గిగ్ వర్కర్స్ ర్యాలీలో పరుగెత్తడంపై మహేష్ గౌడ్ స్పందించారు.

ఫిట్‌గా ఉన్నా కాబట్టే పరుగెత్తుకుంటూ వచ్చాను. నేను పక్కన లేకపోవడం గుర్తించి రాహుల్ పిలిచారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై రాహుల్ గాంధీ ఆరా తీశారు. రాష్ట్రంలో ఓబీసీల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై ప్రశంసలు రాహుల్ గాంధీ ప్ర‌శంస‌లు కురిపించార‌ని మ‌హేశ్ పేర్కొన్నారు.

సోనియా గాంధీ జీవిత చరిత్ర పుస్తకం బాగుందని రాహుల్ ప్రశంసించారు. మూడు నెలల్లో సోనియా గాంధీ పుస్తకం తెలుగు వెర్షన్ అందుబాటులోకి తీసుకువ‌స్తాం. సమ్మిట్‌లో విదేశీ, భారతీయ ప్రతినిధులకు సోనియా పుస్తకాల పంపిణీ చేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులకు పుస్తకాలు అందించాలని నిర్ణయం తీసుకున్నామ‌ని టీ పీసీసీ చీఫ్ తెలిపారు. రాహుల్ ఫోన్ ట్యాపింగ్ అంశంపై చర్చ జరిగింది. తెలంగాణలో రియల్ ఎస్టేట్ పరిస్థితులపైనా చర్చించామ‌న్నారు.

రాహుల్‌కు మహేష్ గౌడ్ ప్రత్యేక రిక్వెస్ట్

ఈ సంద‌ర్భంగా రాహుల్‌కు ప్ర‌త్యేక విజ్ఞ‌ప్తి చేసిన‌ట్లు మ‌హేశ్ గౌడ్ తెలిపారు. కుర్తా పైజామా వేసుకుంటే బాగుంటుందని రాహుల్‌కు సూచించాను. రోజూ కుర్తా పైజామా ధరించాలని కోరాను. దీంతో న‌వ్వుతూ రాహుల్ గాంధీ త‌న‌కు చాక్లెట్ ఇచ్చారు. రాహుల్ రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెల‌కొంది. భార‌త్ స‌మ్మిట్ సూప‌ర్ స‌క్సెస్ అయింది. సంపన్న కుటుంబంలో పుట్టినా.. రాహుల్ ఆలోచనలు సామాన్యుల కోసమే అని మ‌హేశ్ గౌడ్ తెలిపారు.

Advertisement
Advertisement