Eatala Rajender | ప్రజల కళ్లలో మట్టికొట్టిన సీఎం రేవంత్.. ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్ సర్కార్: ఎంపీ ఈటల రాజేందర్
Eatala Rajender | త్రినేత్ర న్యూస్: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) విఫలమైందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల కళ్లలో మట్టికొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Eatala Rajender | త్రినేత్ర న్యూస్: త్రినేత్ర న్యూస్: ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) విఫలమైందని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల కళ్లలో మట్టికొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు రైతు భరోసా, కళాశాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందడం లేదని చెప్పారు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించేందుకు కూడా 15 శాతం కమిషన్ అడుగుతున్నారంటూ ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలనతో మరో 20 ఏండ్ల పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుండా పరిస్థితి తయారవుతున్నదని చెప్పారు. ఏం చేసినా రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో సమ్మిట్‌ల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ తెలంగాణలోని వాస్తవ పరిస్థితులను తెలుసుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఎంతమందితో కలిసి వచ్చినా ప్రధాని కాలేరన్నారు.
విదేశీ గడ్డపై భారత ఎన్నికల వ్యవస్థను, సుప్రీంకోర్టును (Supreme Court) అపహాస్యం చేసేలా రాహుల్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. భారత సైనికుల త్యాగాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. త్యాగాల పునాదుల మీద భారతదేశం నిర్మితమైందని, దేశ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించడం తగదన్నారు. కాంగ్రెస్ పాలనలోనే అవినీతి, బాంబు పేలుళ్లు, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే ఘటనలు చోటుచేసుకున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర కాంగ్రెస్‌దేనని చెప్పారు. ప్రధాని మోదీ (PM Modi) పాలనలో దేశం అంతర్జాతీయంగా అగ్రరాజ్యాల సరసన ఎదుగుతున్నదని చెప్పారు.
బ్లాక్‌మెయిల్ చేసేందుకే హైడ్రా
ప్రజల ఆస్తులను కూల్చేందుకు, పేదలను భయపెట్టేందుకు, బ్లాక్‌మెయిల్ చేసేందుకు హైడ్రా (HYDRAA) ఉపయోగపడుతున్నదని విమర్శించారు. ఫాక్స్ సాగర్ పరిధిలో మునిగిపోయే పరిస్థితి లేని భూముల్లోనూ కూల్చివేతలు చేపట్టారని మండిపడ్డారు. ఎల్‌ఆర్‌ఎస్ ఉన్నప్పటికీ, నోటీసులు ఇవ్వకుండా ఇండ్లను కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులు స్టేలు ఇచ్చినా పట్టించుకోకుండా హైడ్రా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. హీరో నాగార్జునకు (Nagarjuna) సంబంధించిన కూల్చివేత వ్యవహారంలో జరిగిన పరిణామాలు, ఆ తర్వాత ఆయనకు కలిగిన ప్రయోజనాల వివరాలను త్వరలో బయటపెడతామన్నారు. ప్రజల ఆస్తులను కూల్చివేసిన వ్యవహారాలపై హైకోర్టు న్యాయమూర్తులు దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు సరైన పరిహారం చెల్లించిన తర్వాతే మూసీ అభివృద్ధి (Musi Development) పనులు చేపట్టాలన్నారు. ప్రజల ఆస్తులను నియంతృత్వ ధోరణిలో లాక్కోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Flight Outage | అమెరికాలో నిలిచిన విమాన సేవలు.. సాయంత్రానికి సాధారణ స్థితికి!
- ●Karthika Brahmotsavam | అరుణాచల క్షేత్రానికి కార్తీక శోభ.. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు
- ●Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!
- ●Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..
- ●Drinking Water Before Brushing | ఉదయాన్నే బ్రష్ చేయకముందే నీళ్లు తాగుతున్నారా? 10 నిమిషాల్లోనే శరీరంలో జరిగే 6 అద్భుత మార్పులివే!
- ●Silent Heart Attack Causes | గుండెపోటు సడన్‌గా రాదు.. 99% కేసుల వెనుక ఉన్న ఆ నాలుగు 'సైలెంట్ కిల్లర్స్' ఇవే..!

Flight Outage | అమెరికాలో నిలిచిన విమాన సేవలు.. సాయంత్రానికి సాధారణ స్థితికి!

Karthika Brahmotsavam | అరుణాచల క్షేత్రానికి కార్తీక శోభ.. నేటి నుంచి బ్రహ్మోత్సవాలు

Horoscope | నవంబర్ 15 ఆదివారం.. ప్రయాణాల ద్వారా అద్భుతమైన ధనలాభం!

Marriage Refusal | ప్రేమ పేరుతో గర్భవతిని చేశాడు.. పెండ్లి చేసుకొమ్మంటే కులం తక్కువ అన్నాడు..






