త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kedharnath | శివ భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. కేదార్‌నాథ్ పునఃప్రారంభ తేదీలివే..

Kedarnath \ హిమాల‌యాల్లో కొలువై ఉన్న పరమశివుని దివ్య క్షేత్ర పునఃప్రారంభం ద‌గ్గ‌ర ప‌డుతున్న‌ది. ఏటా దేశ‌ నలుమూలల నుంచి వేలాదిగా త‌ర‌లొచ్చే భక్తుల కోసం ఉత్త‌రాఖండ్‌ (Uttharakhand)లోని కేదార్‌నాథ్ (Kedarnath) ధామ్ ఆల‌యం సిద్ద‌మ‌వుతోంది. శీతాకాలం విరామం తర్వాత తిరిగి ప్రారంభం కానుంది.

S

Flash news | Published On Feb 15, 2026, 5.01 pm IST

Kedharnath | శివ భ‌క్తుల‌కు గుడ్ న్యూస్‌.. కేదార్‌నాథ్ పునఃప్రారంభ తేదీలివే..
Advertisement

- ఏప్రిల్ లో భ‌క్తుల‌కు శివ‌య్య ఆశీస్సులు
- తేదీలు ప్ర‌క‌టించిన ఆల‌య అధికారులు

త్రినేత్ర‌.న్యూస్‌: హిమాల‌యాల్లో కొలువై ఉన్న పరమశివుని దివ్య క్షేత్ర పునఃప్రారంభం (Reopen) ద‌గ్గ‌ర ప‌డుతున్న‌ది. ఏటా దేశ‌ నలుమూలల నుంచి వేలాదిగా త‌ర‌లొచ్చే భక్తుల కోసం ఉత్త‌రాఖండ్‌ (Uttharakhand) లోని కేదార్‌నాథ్ ధామ్ ఆల‌యం సిద్ద‌మ‌వుతోంది. శీతాకాలం విరామం తర్వాత తిరిగి ప్రారంభం కానుంది. దీంతో ఇప్ప‌టి నుంచే ఉత్త‌రాఖండ్‌లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఏప్రిల్ 22న ఈ ఆల‌యం తెరుచుకోనుంది.

ప్ర‌ధాన పూజారి నియామ‌కం..

- ఏప్రిల్ 22 ఉదయం 8:00 గంటలకు వృషభ లగ్నంలో కేదార్‌నాథ్ ఆలయ తలుపులు శాస్త్రోక్తంగా తెరుచుకోనున్నాయి. ఈ మేర‌కు ఆల‌య క‌మిటీ ప్ర‌క‌టించింది. ఉఖిమఠ్‌లోని శీతాకాల నివాసమైన ఓంకారేశ్వరాలయంలో ప్రారంభ తేదీ , సమయాలను అధికారికంగా ప్రకటించారు. కేదార్‌నాథ్ ఆలయ ప్రధాన పూజారిగా ఈ ఏడాదికి టీ గంగాధర్ లింగ్‌ను నియమించారు. పవిత్ర పూజలు, ఆచారాలను ఆయన పర్యవేక్షించనున్నారు.

ఏప్రిల్ 7 నుంచి వార్షిక యాత్ర‌...

కేదార్‌నాథ్‌తో పాటు ఇతర ప్రముఖ పుణ్యక్షేత్రాల ప్రారంభ తేదీలను అధికారులు వెల్లడించారు. బద్రీనాథ్ (Bhadrinath) ఆలయ ద్వారాలు ఏప్రిల్ 23న తెరుచుకుంటాయి. ఏప్రిల్ 7 నుంచి వార్షిక యాత్ర ప్రారంభం కానుంది. అలాగే గంగోత్రి (Gangothri), యమునోత్రి (Yamunothri) ఆలయాలు ఏప్రిల్ 19న తెరుచుకుంటాయి. హిమాలయాల ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని వేలాది మంది భక్తులు కేదార్‌నాథ్ (Kedarnath) తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. యాత్రికుల‌ ప్రయాణం, వసతి ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక యాత్రను ముందు జాగ్రత్తలతో సిద్ధం చేసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement