త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Budget | బ‌డ్జెట్‌లో ఢిల్లీ పోలీసుల‌కు రూ.12 వేల కోట్లు కేటాయింపు

Union Budget | 2026-27 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన బ‌డ్జెట్ (Union Budget)ను కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ ప్ర‌వేశ‌పెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వ‌రుస‌గా తొమ్మిదో బ‌డ్జెట్‌ను లోక్‌స‌భ ముందుకు తీసుకొచ్చారు.

D

Flash news | Published On Feb 1, 2026, 5.01 pm IST

Union Budget | బ‌డ్జెట్‌లో ఢిల్లీ పోలీసుల‌కు రూ.12 వేల కోట్లు కేటాయింపు
Advertisement

Union Budget | 2026-27 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన బ‌డ్జెట్ (Union Budget)ను కేంద్ర ప్ర‌భుత్వం ఇవాళ ప్ర‌వేశ‌పెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వ‌రుస‌గా తొమ్మిదో బ‌డ్జెట్‌ను లోక్‌స‌భ ముందుకు తీసుకొచ్చారు. ఈ బ‌డ్జెట్‌లో కీల‌క రంగాల‌కు మోదీ స‌ర్కార్ ప్రాధాన్య‌త ఇచ్చింది. ఇక ఢిల్లీ పోలీసుల‌కు (Delhi Police) సైతం బ‌డ్జెట్‌లో నిధులు కేటాయించారు.

2026-27 కేంద్ర బ‌డ్జెట్‌లో ఢిల్లీ పోలీసుల‌కు రూ.12,503.65 కోట్లు కేటాయించారు. ఇది గ‌త ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 4.79 శాతం అధికం. గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో అంటే 2025-26 సంవ‌త్స‌రానికి ఢిల్లీ పోలీసుల‌కు రూ.11,931.66 కోట్లు కేటాయించిన విష‌యం తెలిసిందే. పోలీసు విభాగం రోజువారీ నిర్వహణ, వివిధ పథకాల కోసం ఈ నిధులను ఉపయోగిస్తారు. మౌలిక స‌దుపాయాల మెరుగుద‌ల‌, లేటెస్ట్ టెక్నాల‌జీ వినియోగం, కొత్త ట్రాఫిక్ సిగ్న‌ళ్ల ఏర్పాటు, సిబ్బందికి శిక్ష‌ణ వంటివి ఇందులో భాగంగా ఉంటాయి.

Advertisement
Advertisement