త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu Tv Serial | క్లైమాక్స్ లేకుండానే జీ తెలుగు సీరియ‌ల్‌కు శుభంకార్డు – ఫ్యాన్స్ డిస‌పాయింట్‌

Telugu Tv Serial | జీ తెలుగు లాంగెస్ట్ ర‌న్నింగ్ సీరియ‌ల్ అమ్మాయిగారుకు శుభం కార్డు ప‌డింది. 943 ఎపిసోడ్స్‌తో ఈ సీరియ‌ల్ ముగిసింది. స‌రైన క్లైమాక్స్ కూడా లేకుండా అర్ధాంత‌రంగా అమ్మాయిగారును ముగించ‌డంతో ఫ్యాన్స్ డిస‌పాయింట్ అవుతున్నారు.

N

Entertainment | Published On Dec 21, 2025, 6.23 pm IST

Telugu Tv Serial | క్లైమాక్స్ లేకుండానే జీ తెలుగు సీరియ‌ల్‌కు శుభంకార్డు – ఫ్యాన్స్ డిస‌పాయింట్‌
Advertisement

Telugu Tv Serial | ప్ర‌స్తుతం జీ తెలుగులో లాంగెస్ట్ ర‌న్నింగ్ సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా కొన‌సాగుతున్న అమ్మాయిగారుకు స‌డెన్‌గా శుభంకార్డు ప‌డింది. శుక్ర‌వారం నాటితో ఈ తెలుగు సీరియ‌ల్ (Telugu Serial) ముగిసింది. ప్రాప‌ర్ క్లైమాక్స్ అంటూ లేకుండా అర్ధాంత‌రంగా సీరియ‌ల్‌ను ఎండ్ చేసి బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు షాకిచ్చారు మేక‌ర్స్‌.
943 ఎపిసోడ్స్‌తో అమ్మాయిగారు సీరియ‌ల్‌ను ముగించారు. వెయ్యి ఎపిసోడ్స్ వ‌ర‌కు ఈ సీరియ‌ల్ టెలికాస్ట్ అవుతుందంటూ ప్ర‌చారం జ‌రిగింది. కానీ మేక‌ర్స్ మాత్రం ముందుగానే ఎండ్ కార్డ్ వేసేశారు.
అమ్మాయిగారు సీరియ‌ల్‌లో నిషా ర‌వికృష్ణ‌న్‌, య‌శ్వంత్‌ గౌడ లీడ్ రోల్స్‌లో న‌టించారు. అనిల్‌, సుస్మిత‌, నీర‌జ కీల‌క పాత్ర‌లు పోషించారు.
2022 అక్టోబ‌ర్‌లో అమ్మాయిగారు సీరియ‌ల్ మొద‌లైంది. దాదాపు మూడేళ్ల‌కుపైగా జీ తెలుగులో టెలికాస్ట్ అయ్యింది. ఒక‌ప్పుడు టీఆర్‌పీ రేటింగ్‌లో టాప్ త్రీ సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా నిలిచింది. స్టోరీలో ఆస‌క్తి లోపించ‌డం, డ్రామా ఆశించిన స్థాయిలో వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో సీరియ‌ల్ క్రేజ్ త‌గ్గుతూ వ‌చ్చింది.
ఇప్ప‌టికీ జీ తెలుగులో టీఆర్‌పీ రేటింగ్ ప‌రంగా టాప్ 10 సీరియ‌ల్స్‌లో ఒక‌టిగా అమ్మాయిగారు కొన‌సాగుతోంది. లేటెస్ట్ రేటింగ్‌లో 4.01 టీఆర్‌పీతో ప‌ర్వాలేద‌నిపించింది. అర్బ‌న్ ఏరియాలో 5.19 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.
మొన్న‌టివ‌ర‌కు రాత్రి 10 గంట‌ల‌కు అమ్మాయిగారు సీరియ‌ల్ టెలికాస్ట్ అవుతూ వ‌చ్చింది. ఈ సీరియ‌ల్ ముగియడంతో ఆ స్లాట్ ఖాళీగా మారింది. అమ్మాయిగారు ప్లేస్‌లో మ‌రో కొత్త సీరియ‌ల్‌ను జీ తెలుగు లాంఛ్ చేస్తుందా? లేదంటే మ‌ధ్యాహ్నం టెలికాస్ట్ అవుతున్న మ‌రో సీరియ‌ల్‌ను రాత్రి ప‌ది గంట‌ల‌కు షిప్ట్ చేస్తారా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.
ఎలాంటి ముంద‌స్తు అనౌన్స్‌మెంట్‌తో పాటు ప్రాప‌ర్ క్లైమాక్స్ కూడా లేకుండా అమ్మాయిగారును ఎండ్ చేయ‌డంపై ఫ్యాన్స్ డిస‌పాయింట్ అవుతున్నారు. రూప‌, రాజుల‌ను మిస్స‌వుతున్నామంటూ కామెంట్స్ పెడుతున్నారు. క‌నీసం వెయ్యి ఎపిసోడ్స్ వ‌ర‌కు అయినా ఈ సీరియ‌ల్‌ను టెలికాస్ట్ చేస్తే బాగుండేద‌ని కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement