Telugu Serials | ఒకే రోజు రెండు తెలుగు సీరియల్స్ లాంఛ్ – ఒకటి స్టార్ మాలో…మరోటి జీ తెలుగులో..
సోమవారం నుంచి బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రెండు కొత్త సీరియల్స్ రాబోతున్నాయి. ఓ సీరియల్ స్టార్ మాలో....మరో సీరియల్ జీ తెలుగులో ప్రసారం టెలికాస్ట్ కానున్నాయి
Entertainment | Published On Dec 22, 2025, 6.58 pm IST
Telugu Serials | ఒకే రోజు రెండు తెలుగు సీరియల్స్ కొత్తగా లాంఛ్ కాబోతున్నాయి. ఓ సీరియల్ స్టార్ మాలో మొదలవుతుండగా...మరో సీరియల్ జీ తెలుగులో టెలికాస్ట్ కాబోతుంది. రెండు సీరియల్స్ సేమ్ టైమ్ స్లాట్‌లో టెలికాస్ట్ కానుండటం ఆసక్తికరంగా మారింది.
నువ్వు లేక నేను లేను...
స్టార్ మాలో డిసెంబర్ 22 (నేటి ) నుంచి నువ్వు లేక నేను లేను పేరుతో మరో కొత్త సీరియల్ టెలికాస్ట్ కాబోతుంది. బిగ్‌బాస్ సీజన్ 9 ఆదివారం నాటితో ముగిసింది. బిగ్‌బాస్ ప్లేస్‌లో నువ్వు లేక నేను లేను సీరియల్‌ను స్టార్ మా లాంఛ్ చేయబోతుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి పది గంటలకు ఈ సీరియల్ ప్రసారం అవుతుంది. కన్నడ సీరియల్‌కు రీమేక్ నువ్వు లేక నేను లేను తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ సీరియల్‌తో నవీన్, నిషా తెలుగు సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వచ్చే బిగ్‌బాస్ వరకు మాత్రమే స్టార్ మాలో నువ్వు లేక నేను లేను సీరియల్ టెలికాస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లే సీరియల్‌కు ఒక సంవత్సరం కథేనా అనే క్యాప్షన్ పెట్టడం ఆసక్తిని పంచుతోంది.
లక్ష్మి రావే మా ఇంటికి...
సోమవారం నుంచి జీ తెలుగు ప్రేక్షకుల ముందుకు మరో కొత్త సీరియల్ రాబోతుంది. లక్ష్మీరావే మా ఇంటికి పేరుతో తెరకెక్కిన ఈ సీరియల్ నేటి నుంచి రాత్రి పది గంటలకు టెలికాస్ట్ కాబోతుంది . అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మించిన ఈ సీరియల్‌లో దర్శిని గౌడ, శ్రీవాణి తో పాటు పలువురు తెలుగు బుల్లితెర స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇటీవల ముగిసిన అమ్మాయిగారు సీరియల్ ప్లేస్‌లో లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ ప్రారంభించారు. టీఆర్‌పీలో టాప్‌లో ఉన్న సీరియల్‌ను ఎండ్ చేసి కొత్త సీరియల్‌ను ప్రారంభించడం ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bigg Boss | బిగ్‌బాస్‌లోకి గుండె నిండా గుడి గంటలు బాలు – సీరియల్ నుంచి ఔట్ – రూమర్లపై క్లారిటీ వచ్చేసింది!
ఆగస్టు 9, 2026

Telugu Serial | బిగ్‌బాస్ రన్నరప్ తెలుగు సీరియల్ – లాంఛ్ డేట్ … ఛానల్ ఇదే – టైటిల్ ఏంటంటే?
జులై 3, 2026

Gunde Ninda Gudi Gantalu Balu | స్టార్ మా కొత్త సీరియల్‌లో గుండె నిండా గుడి గంటలు బాలు – ఫుల్ లెంగ్త్ కాదు…గెస్ట్‌గా…
జనవరి 11, 2026
తాజావార్తలు
- ●AAP Allegations | పేదల బియ్యాన్ని ప్రైవేట్ సంస్థకు అమ్మేందుకు కుట్ర!
- ●Mahesh Babu | నమ్రత క్యూట్ - ప్రియాంక చోప్రా అడ్వెంచరస్ - మహేష్‌బాబుకు ఎవరెలా బర్త్‌డే విషెస్ చెప్పారంటే?
- ●Israel Gaza War | గాజాపై ట్రంప్ 'పీస్ ప్లాన్'కు ఇజ్రాయెల్ బ్రేక్: హమాస్ పూర్తిగా ఆయుధాలు వీడేదాకా వెనక్కి తగ్గేది లేదన్న నెతన్యాహు
- ●Cyber Frauds | వృద్ధులే సైబర్ కేటుగాళ్ల టార్గెట్!
- ●Hansika | విడాకుల తర్వాత ఫస్ట్ సినిమా - హారర్ మూవీతో టాలీవుడ్లోకి హన్సిక రీఎంట్రీ
- ●Kishan Reddy, Ramchandar Rao | ఆషాఢ బోనాలు.. ఉజ్జయిని మహంకాళీ అమ్మవారికి కిషన్‌రెడ్డి మొక్కులు

AAP Allegations | పేదల బియ్యాన్ని ప్రైవేట్ సంస్థకు అమ్మేందుకు కుట్ర!

Mahesh Babu | నమ్రత క్యూట్ - ప్రియాంక చోప్రా అడ్వెంచరస్ - మహేష్‌బాబుకు ఎవరెలా బర్త్‌డే విషెస్ చెప్పారంటే?

Israel Gaza War | గాజాపై ట్రంప్ 'పీస్ ప్లాన్'కు ఇజ్రాయెల్ బ్రేక్: హమాస్ పూర్తిగా ఆయుధాలు వీడేదాకా వెనక్కి తగ్గేది లేదన్న నెతన్యాహు

Cyber Frauds | వృద్ధులే సైబర్ కేటుగాళ్ల టార్గెట్!



