Telugu Serial | జీ తెలుగులో మరో కొత్త సీరియల్ – ఈ వీక్‌లోనే ప్రారంభం – టైటిల్ ఇదే
జీ తెలుగులో మరో కొత్త సీరియల్ లాంఛ్ కాబోతుంది. కొంగుబంగారం టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సీరియల్ జనవరి 26 నుంచి ప్రారంభం కాబోతుంది. ఈ సీరియల్‌లో హరిత, జాకీ కీలక పాత్రలు పోషించారు.
Entertainment | Published On Jan 23, 2026, 7.08 pm IST
Telugu Serial | జీ తెలుగులో మరో కొత్త సీరియల్ (Telugu Serial | )ప్రారంభం కాబోతుంది. ఈ సీరియల్ టైటిల్‌తో పాటు టెలికాస్ట్ టైమ్ వివరాలను జీ తెలుగు (Zee Telugu) రివీల్ చేసింది. ఈ వారంలోనే బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సీరియల్‌కు కొంగు బంగారం అనే పేరును ఖరారు చేశారు. జనవరి 26 నుంచి టెలికాస్ట్ కాబోతుంది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఈ సీరియల్ ప్రసారమవుతుందని జీ తెలుగు ప్రకటించింది.
కొంగు బంగారం సీరియల్‌లో సీనియర్ యాక్టర్స్ హరిత, జాకీ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. జై శ్రీనివాస్‌కుమార్, శ్వేత, మధుమిత కీలక పాత్రలు పోషించనున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన వారిసుకు రీమేక్‌గా కొంగు బంగారం రూపొందుతోంది.
బుల్లితెరకు గ్యాప్...
గత కొన్నేళ్లుగా బుల్లితెరకు గ్యాప్ ఇచ్చింది హరిత. ఈ సీరియల్‌తో మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం జీ తెలుగులో మధ్యాహ్నం మూడున్నరకు ప్రేమ యుద్ధం టెలికాస్ట్ అవుతోంది. ఈ సీరియల్ స్థానంలో కొంగు బంగారం లాంఛ్ కానుంది. ప్రేమ యుద్ధం టైమ్‌ను ఛేంజ్ చేశారు.
సూపర్ హిట్ సీరియల్స్...
తెలుగులో కుంకుమపువ్వు, కళ్యాణం కమనీయం, ముద్ద మందారం, సావిత్రమ్మ గారి అబ్బాయి, మనసు మమతతో పాటు పలు సూపర్ హిట్ సీరియల్స్ చేసింది హరిత. రియల్ లైఫ్‌లో భార్యాభర్తలైన హరిత, జాకీ ఈ సీరియల్‌లో అవే పాత్రల్లో కనిపించబోతున్నారు. జాకీ కూడా తెలుగులో పలు సీరియల్స్, సినిమాల్లో నటించారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






