Bollywood | లైంగిక వేధింపుల ఆరోపణలు – కీర్తి సురేష్ హిందీ వెబ్ సిరీస్ నుంచి సినిమాటోగ్రాఫర్ ఔట్
కీర్తి సురేష్ బాలీవుడ్ వెబ్ సిరీస్ అక్క వివాదంలో చిక్కుకుంది. లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా ఈ సిరీస్ నుంచి సినిమాటోగ్రాఫర్ ప్రతీక్ షాను నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ తొలగించింది.
Entertainment | Published On Jun 1, 2026, 9.40 am IST
Bollywood |కీర్తి సురేష్ లీడ్ రోల్‌లో నటిస్తోన్న హిందీ వెబ్ సిరీస్ అక్క వివాదంలో చిక్కుకుంది. ఈ వెబ్ సిరీస్ సినిమాటోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అతడిని సిరీస్ నుంచి తొలగిస్తున్నట్లు నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించింది.
ప్రతీక్ షా....
కీర్తి సురేష్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రల్లో పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా అక్క వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది. ఈ బాలీవుడ్ సిరీస్‌ను అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ పిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌కు ప్రతీక్ షా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.
న్యూడ్ ఫొటోలు...
ప్రతీక్ షా తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, న్యూడ్ ఫొటోలు అడిగాడని ఓ మహిళా ఫొటోగ్రాఫర్ కంప్లైంట్ ఇచ్చింది. అవకాశాల పేరుతో మభ్యపెట్టి తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మరికొందరు మహిళలు ఈ సినిమాటోగ్రాఫర్‌పై ఆరోపణలు చేశారు. ఈ లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా అక్క వెబ్‌సిరీస్ టైటిల్ క్రెడిట్స్ నుంచి ప్రతీక్ షా పేరును తొలగిస్తున్నట్లు యశ్ రాజ్ ఫిల్మ్స్ ప్రకటించింది. సినిమాటోగ్రాఫర్ పేరు లేకుండానే ఈ సిరీస్ రిలీజ్ అవుతుందని వెల్లడించారు.
విమర్శలు...
లైంగిక వేధింపుల వివాదం కొనసాగుతుండగానే ఇటీవలే అక్క వెబ్ సిరీస్ ప్యాచ్ వర్క్ షూటింగ్‌లో ప్రతీక్ షా పాల్గొన్నాడు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ తీరుపై వెబ్‌సిరీస్ నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు బాలీవుడ్ వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. తప్పుచేసిన వారికి అవకాశాలు ఇవ్వడం ఎంత వరకు సమంజసం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట. ఈ విమర్శల నేపథ్యంలోనే అతడిని ఈ సిరీస్ నుంచి పక్కనపెట్టినట్లు వార్తలొస్తున్నాయి.
ఇండియా నుంచి ఈ ఏడాది ఆస్కార్‌కు నామినేట్ అయిన హోమ్‌బౌండ్‌తో పాటు మరికొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు ప్రతీక్ షా సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●IPL Match Effect | ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్.. బావిలోకి దూసుకెళ్లిన థార్.. యువకుడు మృతి
- ●Peddi Movie | జాన్వీ కపూర్ వర్సెస్ శృతి హాసన్ - పెద్దిలో ఎవరి రెమ్యూనరేషన్ ఎక్కువంటే?
- ●US Strikes | మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ స్థావరాలపై అమెరికా ఆత్మరక్షణ దాడులు
- ●Stock Markets | భారీ పతనం తర్వాత కోలుకున్న స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లకు ఊపు..
- ●Supreme Court Judges | సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం
- ●RCB Fans | హైదరాబాద్‌లో ఆర్సీబీ అభిమానుల రచ్చ.. లాఠీలకు పనిచెప్పిన పోలీసులు

IPL Match Effect | ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్.. బావిలోకి దూసుకెళ్లిన థార్.. యువకుడు మృతి

Peddi Movie | జాన్వీ కపూర్ వర్సెస్ శృతి హాసన్ - పెద్దిలో ఎవరి రెమ్యూనరేషన్ ఎక్కువంటే?

US Strikes | మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ స్థావరాలపై అమెరికా ఆత్మరక్షణ దాడులు

Stock Markets | భారీ పతనం తర్వాత కోలుకున్న స్టాక్ మార్కెట్లు.. ఐటీ షేర్లకు ఊపు..






