త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Pooja Hegde | అభిమానుల ప్రేమ‌తోనే ఈ స్థాయికి.. సెల్ఫీ వివాదంపై క్లారిటీ ఇచ్చిన బుట్ట‌బొమ్మ‌..

Pooja Hegde | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న‌ది. ముఖ్యంగా ఆమె నటించిన తాజా హిందీ చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ విడుదలకు సిద్ధమవుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది.

P

Entertainment | Published On May 30, 2026, 4.01 pm IST

Pooja Hegde | అభిమానుల ప్రేమ‌తోనే ఈ స్థాయికి.. సెల్ఫీ వివాదంపై క్లారిటీ ఇచ్చిన బుట్ట‌బొమ్మ‌..
Advertisement

Pooja Hegde | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్న‌ది. ముఖ్యంగా ఆమె నటించిన తాజా హిందీ చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ విడుదలకు సిద్ధమవుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. అయితే, సినిమా విడుదలకు ముందు పూజాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన పూజా హెగ్డేను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఓ అభిమాని ఆమెతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అయితే, పూజా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది.

అభిమానిని ప‌ట్టించుకోలేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు బుట్ట‌బొమ్మ వైఖరిపై విమర్శలు గుప్పించారు. అభిమానులను పట్టించుకోకుండా వ్యవహరించారని, స్టార్‌డమ్ వచ్చాక అహంకారం పెరిగిందంటూ కామెంట్లు చేశారు. ఈ విమర్శలపై తాజాగా పూజా స్పందించింది. తనను ఉద్దేశించి వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. అభిమానుల ప్రేమ, ఆదరణ వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని, వారిని ఎప్పటికీ తక్కువగా చూడనని పేర్కొంది. ‘‘సినిమా రంగంలో ఉన్న మాకు ప్రేక్షకులే బలం. వాళ్ల ప్రేమ, ప్రోత్సాహమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో కార్యక్రమాల్లో తీవ్ర రద్దీ, భద్రతా కారణాలు, సమయాభావం వల్ల అందరినీ వ్యక్తిగతంగా గమనించే అవకాశం ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితులను పొరపాటుగా అహంకారంగా భావించకూడదు’’ అని పూజా చెప్పుకొచ్చింది.

అభిమానుల పట్ల తనకు ఎప్పుడూ ప్రత్యేక గౌరవం ఉంటుందని ఆమె చెప్పింది. ‘‘నా కెరీర్‌లో ప్రతి అడుగులోనూ అభిమానుల స‌పోర్ట్ ఉంది. వాళ్ల వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఎవరినీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేయను. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు’’ అంటూ ఆమె విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉండ‌గా.. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ చిత్రంలో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ కీలక పాత్రలు పోషించారు. వినోదాత్మక ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర బృందం ప్రస్తుతం ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను ముమ్మ‌రం చేసింది. ఈ నేపథ్యంలో పూజా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి.

Advertisement
Advertisement