Rukmini Vasanth | డిజాస్టర్ల ఎఫెక్ట్ – రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన రుక్మిణి వసంత్
టాక్సిక్ ఫెయిల్యూర్ తో రుక్మిణి వసంత్ తన రెమ్యూనరేషన్‌ను తగ్గించినట్లు కన్నడ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఈ భామ ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ స్వీకరిస్తోంది. వరుస డిజాస్టర్లతో పాటు భారీ రెమ్యూనరేషన్ కారణంగా ఈ కన్నడ బ్యూటీకి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. ఈ విమర్శల నేపథ్యంలో రెమ్యూనరేషన్‌కు సగానికిపైనే తగ్గించినట్లు వార్తలొస్తున్నాయి.
Entertainment | Published On Sep 3, 2026, 4.59 pm IST
Rukmini Vasanth | టాక్సిక్ డిజాస్టర్ హీరో యశ్ కంటే హీరోయిన్లనుపై ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తోంది. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్‌తో పాటు మిగిలిన హీరోయిన్లను నెటిజన్లతో పాటు సినీ వర్గాలు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అందరి కంటే ఎక్కువగా కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్‌పై విమర్శలు వస్తోన్నాయి. కథలో ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్రలో కనిపించడం, కేవలం ఇంటిమేట్ సీన్లకే ఆమె పరిమితం కావడంపై ఆ బ్యూటీని ఆటాడుకుంటున్నారు. వ్యాంప్ లాంటి పాత్ర చేయడం అవసరమా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
పదకొండు సినిమాలు...
టాక్సిక్ డిజాస్టర్‌తో కన్నడ బ్యూటీ కెరీర్ డైలమాలో పడింది. ఏడేళ్ల కెరీర్‌లో ఇప్పటివరకు రుక్మిణి వసంత్ పదకొండు సినిమాలు చేసింది. ఇందులో కాంతార ఛాప్టర్ వన్ ఒక్కటే బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. మిగిలిన సినిమాలేవి నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టలేకపోయాయి. వరుస పరాజయాల కారణంగా రుక్మిణి వసంత్‌కు అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.
రజనీకాంత్ ధర్మన్...
రజనీకాంత్ ధర్మన్‌లో మొదట రుక్మిణి వసంత్‌ను ఓ హీరోయిన్‌గా అనుకున్నారు. టాక్సిక్ రిజల్ట్ కారణంగా ఆమెను కాదని రాశీఖన్నాను ఆ రోల్ కోసం తీసుకున్నారు. మరో రెండు మూడు సినిమాలు దాదాపు ఓకే అవుతాయనే టైమ్‌లో చేజారిపోయాయి. ఆమెను పక్కనపెట్టడానికి ఫ్లాప్‌లతో పాటు భారీ రెమ్యూనరేషన్ కూడా ఓ కారణమని ప్రచారం జరుగుతోంది.
టాక్సిక్ కోసం హయ్యెస్ట్...
ఈ విమర్శల నేపథ్యంలో కన్నడ బ్యూటీ తన రెమ్యూనరేషన్‌ను తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఒక్కో సినిమాకు మూడు నుంచి ఐదు కోట్ల వరకు పారితోషికం స్వీకరిస్తోంది. టాక్సిక్ కోసం కెరీర్‌లోనే అత్యధికంగా ఆరు కోట్లు తీసుకుంది.
పాత్ర బాగుంటే...
పరాజయాలకు తోడు అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో రుక్మిణి వసంత్ తన రెమ్యూనరేషన్‌ను తగ్గించాలని నిర్ణయించుకున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. కథ, తన పాత్ర బాగుంటే కోటి ఇచ్చినా కూడా సినిమా చేయడానికి రెడీ అని చెబుతోన్నట్లు టాక్ వినిపిస్తోంది. డబ్బుల కోసం కాకుండా మంచి కాన్సెప్ట్‌లతో కూడిన సినిమాలకే ప్రయారిటీ ఇవ్వాలని అనుకుంటుందని అంటున్నారు.
ఎన్టీఆర్ డ్రాగన్...
ప్రస్తుతం ఎన్టీఆర్ డ్రాగన్‌లో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో ఆమె నటిస్తోన్న సెకండ్ మూవీ ఇది. మలయాళంలో నివీన్ పాల్‌తో ఓ సినిమాను అంగీకరించింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Kajal Aggarwal | డబ్బు, స్టేటస్ కాదు .. అదే ముఖ్యం – వైవాహిక జీవితంపై కాజల్ పోస్ట్
సెప్టెంబర్ 13, 2026

Siima Awards 2026 | సైమా అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన హీరోయిన్లు – స్పెషల్ అట్రాక్షన్‌గా రుక్మిణి వసంత్
సెప్టెంబర్ 13, 2026

Irumudi OTT | అఫీషియల్ – థియేటర్లలో ఆడుతోండగానే ఓటీటీలోకి రవితేజ ఇరుముడి – నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్
సెప్టెంబర్ 13, 2026
తాజావార్తలు
- ●iPhone 17 Pro Max | ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్.. రూ.రూ.74,990కే ఫోన్..!
- ●Pawan Kalyan Keralam Visit | 'థాంక్యూ కేరళం': ఆయుర్వేద చికిత్స ముగిశాక పవన్ కల్యాణ్ ఎమోషనల్ పోస్ట్.. కేరళ సీఎం ఏమన్నారంటే?
- ●Konda Surekha | నేన్ గెలవంగనే నా ఎనకాల్నే టీఆర్ఎస్లకొచ్చిండు.. ఆ జెండాతోటి మళ్ల ఇటొచ్చిండు
- ●BRICS Summit 2026 Delhi | ముగిసిన 18వ బ్రిక్స్ సదస్సు: ఢిల్లీ నుంచి స్వదేశాలకు బయలుదేరిన పుతిన్, జిన్‌పింగ్
- ●Ayodhya Case | అయోధ్య రామాలయం చోరీ కేసులో చార్జిషీట్‌కు రంగం సిద్ధం!
- ●Anwar Ibrahim Rahul Gandhi Meeting | ఢిల్లీలో ఆసక్తికర భేటీ: రాహుల్ గాంధీ, ప్రియాంకలతో మలేషియా ప్రధాని బ్రేక్‌ఫాస్ట్

iPhone 17 Pro Max | ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్.. రూ.రూ.74,990కే ఫోన్..!

Pawan Kalyan Keralam Visit | 'థాంక్యూ కేరళం': ఆయుర్వేద చికిత్స ముగిశాక పవన్ కల్యాణ్ ఎమోషనల్ పోస్ట్.. కేరళ సీఎం ఏమన్నారంటే?

Konda Surekha | నేన్ గెలవంగనే నా ఎనకాల్నే టీఆర్ఎస్లకొచ్చిండు.. ఆ జెండాతోటి మళ్ల ఇటొచ్చిండు

BRICS Summit 2026 Delhi | ముగిసిన 18వ బ్రిక్స్ సదస్సు: ఢిల్లీ నుంచి స్వదేశాలకు బయలుదేరిన పుతిన్, జిన్‌పింగ్



