Toxic | యశ్ టాక్సిక్ టికెట్ ధరల పెంపు – జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం – కానీ ఓ కండీషన్
యశ్ టాక్సిక్ మూవీ టికెట్ ధరలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ జీవోను జారీ చేసింది. సింగిల్ స్క్రీన్స్‌లో 50, మల్టీప్లెక్స్‌లో వంద రూపాయలు పెంచేందుకు అనుమతులు ఇచ్చింది. ఆగస్ట్ 26 నుంచి సెప్టెంబర్ 4 వరకు మొత్తం పది రోజులు ధరల పెంపు అమలులో ఉంటుందని ఈ జీవోలో పేర్కొన్నారు.
Entertainment | Published On Aug 25, 2026, 1.55 pm IST
Toxic | యశ్ ఫ్యాన్స్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ వినిపించింది. టాక్సిక్ మూవీ టికెట్ ధరల పెంపుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్‌తో పాటు మల్టీప్లెక్స్‌లలో టికెట్ రేట్లను పెంచుతూ ప్రత్యేక జీవోను జారీ చేసింది. జీఎస్‌టీతో కలుపుకొని సింగిల్ స్క్రీన్స్‌లో యాభై రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 100 రూపాయలు పెంచుకునేలా అనుమతులు ఇచ్చింది. రిలీజ్ రోజు నుంచి సెప్టెంబర్ 4 వరకు మొత్తం పది రోజుల పాటు టికెట్ ధరల పెంపు అమలులో ఉంటుందని జీవోలో పేర్కొన్నది.
కండీషన్....
టికెట్ ధరల పెంచుతూనే తెలంగాణ ప్రభుత్వం ఓ కండీషన్ పెట్టింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ కమిటీ ఖాతాలో టాక్సిక్ నిర్మాతలు కోటి రూపాయలను జమ చేయాలని ఆదేశించింది.
ఎఫ్‌డీసీ ఛైర్మన్...
కన్నడ డబ్బింగ్ సినిమాకు తెలంగాణలో టికెట్ ధరలను పెంచడంపై సినీ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టాక్సిక్ మూవీని దిల్‌రాజు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా ఆయన కొనసాగుతోన్నారు. ఈ పదవితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంతో ఆయనకు ఉన్న అనుబంధంతోనే టికెట్ ధరల పెంపుకు అనుమతులు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఐదుగురు హీరోయిన్లు...
టాక్సిక్ మూవీకి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో యశ్‌కు జోడీగా ఐదుగురు హీరోయిన్లు కనిపించబోతున్నారు. నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యుమా ఖురేషి కథానాయికలుగా నటించారు. దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా యశ్ డ్యూయల్‌రోల్‌లో కనిపించబోతున్నాడు. పాన్ ఇండియన్ వైడ్‌గా ఈ మూవీపై భారీగా బజ్ నెలకొంది. ఓపెనింగ్ డేతోనే ఈ మూవీ రికార్డులు తిరగరాయడం ఖాయమని అంటున్నారు.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న
- ●Bengaluru Teenage Suicide Attempt | ఇన్‌స్టా ప్రేమ.. పెళ్లికి నో చెప్పిన పేరెంట్స్: ఐదంతస్తుల భవనమెక్కిన 15 ఏళ్ల బాలుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- ●Nitin Gadkari | పనిచేయలేకపోతున్నా.. ఇక కొత్తతరానికి బాధ్యతలు అప్పగించాలి : నితిన్ గడ్కరీ
- ●RS Praveen Kumar | ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసమే రేవంత్ విదేశీ పర్యటన పెట్టుకుండు
- ●Maharashtra Family Suicide | కన్నీళ్లు పెట్టిస్తున్న 'షేరూ' కథ: లోయలో పడి కుటుంబం చనిపోయినా.. 3 రోజులుగా వారి కోసమే ఎదురుచూపులు
- ●One Nation-One Election | ఏకకాలంలో ఎన్నికలు సాధ్యం కావు

MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న

Bengaluru Teenage Suicide Attempt | ఇన్‌స్టా ప్రేమ.. పెళ్లికి నో చెప్పిన పేరెంట్స్: ఐదంతస్తుల భవనమెక్కిన 15 ఏళ్ల బాలుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Nitin Gadkari | పనిచేయలేకపోతున్నా.. ఇక కొత్తతరానికి బాధ్యతలు అప్పగించాలి : నితిన్ గడ్కరీ

RS Praveen Kumar | ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసమే రేవంత్ విదేశీ పర్యటన పెట్టుకుండు






