Vijay | వర్షంతో షూటింగ్ క్యాన్సిల్.. తల్లిదండ్రుల చెంత సేదతీరిన విజయ్ దేవరకొండ
Vijay | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తల్లిదండ్రుల మధ్య హాయిగా మధ్యాహ్నం కునుకు తీస్తున్న ఫొటోను ఆయన బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు.
Entertainment | Published On Aug 19, 2026, 8.30 pm IST
Vijay | టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తల్లిదండ్రుల మధ్య హాయిగా మధ్యాహ్నం కునుకు తీస్తున్న ఫొటోను ఆయన బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు. చిన్నతనంలో తనకు ఇష్టమైన ప్రదేశంలో ఇలా సేదతీరుతున్నానంటూ విజయ్ పెట్టిన క్యాప్షన్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
‘‘వర్షాల కారణంగా షూటింగ్‌లు రద్దయ్యాయి. చిన్నతనంలో మీకు ఇష్టమైన ప్రదేశంలో మధ్యాహ్నం కునుకు తీసే అవకాశం దొరికింది. రికవరీ.. 1000 శాతం’’ అంటూ విజయ్ పేర్కొన్నారు. ఈ ఫొటోకు తన భార్య, నటి రష్మిక మందన్నాకు క్రెడిట్ ఇచ్చారు. ఈ ఫొటోలో విజయ్ దేవరకొండ తన తల్లిదండ్రుల మధ్య హాయిగా నిద్రిస్తున్న దృశ్యం అభిమానులను ఆకట్టుకుంటోంది. తమకు ఇష్టమైన నటుడి ఈ క్యూట్ మూమెంట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది.
కాగా.. విజయ్, రష్మిక ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత తొలిసారి జంటగా ‘రణబలి’ చిత్రంలో కనిపించనున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియడ్ డ్రామాలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. గతంలో ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో జోడీగా అలరించిన విజయ్, రష్మికకు ఇది మూడో సినిమా. ‘రణబలి’ దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 29న విజయ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ‘ట్యాక్సీవాలా’ తర్వాత తొమ్మిదేళ్లకు తమ ప్రయాణం మరింత ముందుకు సాగుతోందని, అర్థవంతమైన కథలను చెప్పాలన్న రాహుల్ తపనలో ఎలాంటి మార్పు లేదని పేర్కొన్నారు. ఇద్దరూ కలిసి మరోసారి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు.
‘రణబలి’ 1850ల నాటి వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అప్పటి బ్రిటిష్ పాలనకు సంబంధించిన కొన్ని ఘటనలు ప్రధాన చరిత్ర పుస్తకాల్లో చోటు చేసుకోలేదని, బ్రిటిష్ పాలకులు చరిత్రను వక్రీకరించినట్లు భావించే అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాకు సంబంధించిన పూర్తి కథాంశంపై చిత్రబృందం అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.
View this post on Instagram
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Mudumalai Tiger Reserve | అడవిలో విషాదం: 10 రోజుల్లో 3 ఏనుగుల మృతి.. తీవ్ర కరవే కారణమా?
- ●Jakkani Anitha | పరకాలను నీకెవరన్నా రాసిచ్చిర్రా? మళ్ల మాట్లాడ్తే మూతి పగుల్తది
- ●Job Mela | ఫార్మసిస్ట్, అసిస్టెంట్ పోస్టులకు ఆగస్టు 25న జాబ్మేళా
- ●Peddapalli | రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు : మంత్రి కోమటిరెడ్డి
- ●Harish Rao | విద్యార్థుల గొంతు పిసికి చంపేస్తరా రేవంత్? వాళ్ల మీద చేయేస్తే చూస్తూ ఉండం
- ●CWC Meeting New Delhi | ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ కీలక భేటీ: ఆ రెండు అస్త్రాలతో కేంద్రంపై పోరుకు మాస్టర్ ప్లాన్.. రేవంత్ హాజరు

Mudumalai Tiger Reserve | అడవిలో విషాదం: 10 రోజుల్లో 3 ఏనుగుల మృతి.. తీవ్ర కరవే కారణమా?

Jakkani Anitha | పరకాలను నీకెవరన్నా రాసిచ్చిర్రా? మళ్ల మాట్లాడ్తే మూతి పగుల్తది

Job Mela | ఫార్మసిస్ట్, అసిస్టెంట్ పోస్టులకు ఆగస్టు 25న జాబ్మేళా

Peddapalli | రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు : మంత్రి కోమటిరెడ్డి




