త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anupama Parameswaran | పెళ్లి బ‌రాత్‌లో అనుప‌మ మాస్‌ స్టెప్పులు – క్రేజీ క‌ళ్యాణం కోసం తెలంగాణ యాస‌లో డ‌బ్బింగ్‌

పెళ్లి బ‌రాత్‌లో మాస్ స్టెప్పులు వేసింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. క్రేజీ క‌ళ్యాణం ఫ‌స్ట్ సింగిల్ కాకా ధూమ్ ధ‌మాకా ప్రోమోను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. పెళ్లి కూతురు గెట‌ప్‌లో అనుప‌మ డ్యాన్స్ చేస్తూ ఈ ప్రోమోలో ఆక‌ట్టుకుంది. క్రేజీ క‌ళ్యాణం సినిమా కోసం తెలంగాణ యాస‌లో అనుప‌మ త‌న పాత్ర‌కు సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకుంది.

N

Entertainment | Published On Sep 10, 2026, 5.24 pm IST

Anupama Parameswaran | పెళ్లి బ‌రాత్‌లో అనుప‌మ మాస్‌ స్టెప్పులు – క్రేజీ క‌ళ్యాణం కోసం తెలంగాణ యాస‌లో డ‌బ్బింగ్‌
Advertisement

Anupama Parameswaran | కోలీవుడ్ హీరో ధృవ్ విక్ర‌మ్‌తో ల‌వ్ బ్రేక‌ప్ త‌ర్వాత అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ తిరిగి సినిమాల‌పై ఫోక‌స్ పెట్టింది. ఎక్కువ‌గా గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేయాల‌నే ప్లానింగ్‌లో ఉంది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించిన క్రేజీ క‌ళ్యాణం త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఓ అమ్మాయి పెళ్లి చుట్టూ జ‌రిగిన స‌ర‌దా సంఘ‌ట‌న‌ల‌తో డైరెక్ట‌ర్ భ‌ద్ర‌ప్ప గాజుల క్రేజీ క‌ళ్యాణం మూవీని తెర‌కెక్కిస్తోన్నారు.

కాకా ధూమ్ ధ‌మాకా...

క్రేజీ క‌ళ్యాణం ఫ‌స్ట్ సింగిల్ ప్రోమోను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో పెళ్లి కూతురు గెట‌ప్‌లో ఉన్న అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ బ‌రాత్‌లో మాస్ స్టెప్పులు వేసింది. కాకా ధూమ్ ధ‌మాకా అంటూ సాగే ఈ పాట‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో పాటు సీనియ‌ర్ న‌రేష్‌, త‌రుణ్ భాస్క‌ర్ క‌లిసి డ్యాన్స్ చేయ‌బోతున్నారు. ఫుల్ సాంగ్‌ను సెప్టెంబ‌ర్ 12న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కాకా ధూమ్ ధ‌మాకా సాంగ్‌కు కాస‌ర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ స‌మ‌కూర్చారు.

తెలంగాణ యాస‌...

క్రేజీ క‌ళ్యాణం మూవీలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ తెలంగాణ అమ్మాయిగా క‌నిపించ‌బోతుంది. త‌న పాత్ర కోసం తెలంగాణ యాస నేర్చుకొని సొంతంగా డ‌బ్బింగ్ చెప్పింది. ఆమె ఓన్ వాయిస్ ఈ సినిమాకు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిల‌వ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. న‌వంబ‌ర్‌లో క్రేజీ క‌ళ్యాణం మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు స‌మాచారం.

కందుల సులోచ‌న రాణి...

క్రేజీ క‌ళ్యాణంతో పాటు తెలుగులో భోగి సినిమా చేస్తోంది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. ఆదిలాబాద్- మ‌హ‌రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో జ‌రిగిన వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలోనూ తెలంగాణ యువ‌తిగానే అనుప‌మ క‌నిపించ‌బోతుంది. కందుల సులోచ‌న రాణి అనే అమ్మాయిగా న‌టిస్తోంది. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న భోగి మూవీ ఈ ఏడాదే థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతుంది.

 

Advertisement
Advertisement