Vijay Sethupathi | విజయ్ సేతుపతి తెలుగు మూవీ టైటిల్ ఇదే – పూరి జగన్నాథ్ మార్క్‌తో ఫస్ట్ లుక్
విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న తెలుగు మూవీకి స్లమ్‌డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. విజయ్ సేతుపతి బర్త్‌డే సందర్భంగా శుక్రవారం ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.
Entertainment | Published On Jan 16, 2026, 3.07 pm IST
Vijay Sethupathi | కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతికి తెలుగులోనే భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. టాలీవుడ్‌లో ఉప్పెన, సైరాతో పాటు మరికొన్ని సినిమాలు చేశారు. వీటిలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానే కనిపించాడు విజయ్ సేతుపతి. ఫస్ట్ టైమ్ విజయ్ సేతుపతి హీరోగా తెలుగులో ఓ మూవీ చేయబోతున్నారు. పాన్ ఇండియన్ లెవెల్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
స్లమ్ డాగ్...
విజయ్ సేతుపతి బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ అనే టైటిల్‌ను కన్ఫామ్ చేశారు.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ సేతుపతి డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తున్నారు. అతడి చేతిలో రక్తంతో తడిసిన ఓ కత్తి ఉండ టం ఆసక్తిని పంచుతోంది. చుట్టూ డబ్బులతో నిండి ఉన్న బాక్సులు ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
స్లమ్ డాగ్ మూవీలో టబు, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఛార్మితో కలిసి డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం , మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు.
డైరెక్టర్ పూరి జగన్నాథ్ హిట్టు అందుకొని చాలా కాలమైంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా కొనసాగిన అతడితో ఇప్పుడు సినిమాలు చేయడానికి తెలుగు హీరోలు ముందుకు రావడం లేదు. దాంతో విజయ్ సేతుపతితో స్లమ్‌డాగ్ మూవీని తెరకెక్కిస్తోన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇస్మార్ట్ శంకర్ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్, లైగర్ డిజాస్టర్స్‌తో నిలిచాయి. జనగనమణ అనౌన్స్‌మెంట్‌తోనే ఆగిపోయింది. దాంతో స్లమ్‌డాగ్ సక్సెస్ పూరి జగన్నాథ్ కెరీర్‌కు కీలకంగా మారింది.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





