త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Deverakonda | ఇండ‌స్ట్రీ వాళ్లే స‌మ‌స్య‌ల్ని సృష్టిస్తున్నారు – టాలీవుడ్ పాలిటిక్స్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ట్వీట్‌

అన్‌లైన్ టికెటింగ్ యాప్‌ల‌లో వ‌చ్చే నెగెటివ్ రివ్యూలు రేటింగ్‌ల‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన ఓ ట్వీట్ వైర‌ల్ అవుతోంది. ఇండ‌స్ట్రీలోనే వాళ్లే ఈ నెగెటివ్ క్యాంపెయిన్ వెనుక ఉన్నార‌ని అన్నారు. డియ‌ర్ కామ్రేడ్ నుంచి ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నాన‌ని చెప్పారు.

a

Entertainment | Published On Jan 11, 2026, 4.33 pm IST

Vijay Deverakonda | ఇండ‌స్ట్రీ వాళ్లే స‌మ‌స్య‌ల్ని సృష్టిస్తున్నారు – టాలీవుడ్ పాలిటిక్స్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ‌ ట్వీట్‌
Advertisement

Vijay Deverakonda |  బుక్‌మై షో రివ్యూలు, ఆన్‌లైన్ రేటింగ్‌ల‌పై టాలీవుడ్ చాలా కాలంగా వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. ఆన్‌లైన్ టికెటింగ్ యాప్‌ల‌లో నెగెటివ్ రేటింగ్‌ల‌ను ఇస్తూ మంచి సినిమాల‌ను చంపేస్తున్నారంటూ కొంద‌రు నిర్మాత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. బ‌ల్క్ రేటింగ్‌ల‌ను నిషేదించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌కు ఆన్‌లైన్ టికెటింగ్ యాప్‌ల‌లో రివ్యూలు, రేటింగ్‌లు ఇవ్వ‌డానికి వీలు లేద‌ని ఢిల్లీ హైకోర్టు ఆర్డ‌ర్ జారీ చేసింది.
కోర్డు ఆర్డ‌ర్‌పై విజ‌య్ దేవ‌ర‌కొండ రియాక్ట్ అయ్యాడు ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. మ‌న క‌ల‌లు, క‌ష్టార్జితం, పెట్టుబ‌డికి ఇన్నాళ్ల‌కు ఓ ర‌క్ష‌ణ దొర‌క‌డం ఆనందంగా ఉంద‌ని అన్నారు.
"ఈ ఆర్గ‌నైజ్‌డ్ ఎటాక్స్ వెనుక ఇండ‌స్ట్రీలోనివాళ్లే ఉన్నార‌ని, మ‌న అనుకున్న‌వాళ్లే ఈ స‌మ‌స్య‌ల‌ను క్రియేట్ చేస్తుండ‌టం బాధ‌గా ఉంద‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ అన్నారు. బ‌తుకు బ‌తికించు అనే మాట‌లు ఏమైపోయాయో తెలియ‌డం లేద‌ని "అన్నారు.

డియ‌ర్ కామ్రేడ్   టైమ్ లో...

"బాట్‌ల‌ను ఉప‌యోగించి న‌కిలీ రేటింగ్‌ల‌ను ఇవ్వ‌డం డియ‌ర్ కామ్రేడ్ టైమ్‌లో మొద‌టిసారి ఎదుర్కొన్నా. అప్ప‌టి నుంచి నా ప్ర‌తి సినిమాకు ఈ స‌మ‌స్య ఎదుర‌వుతూనే ఉంది. ఈ ఆర్డ‌నైజ్‌డ్ ఎటాక్స్‌పై నా గ‌ళం వినిప‌స్తూనే ఉన్నా. కానీ ఎవ‌రూ నా మాట‌లు ప‌ట్టించుకోలేదు. మంచి సినిమాను ఎవ‌రూ ఆప‌లేరంటూ న‌న్ను స‌మాధాన‌ప‌రుస్తూ వ‌చ్చారు" అంటూ చెప్పారు.
ఈ రేటింగ్‌లో వెనుక ఉన్న వారిని ఎలా ఎదుర్కోవాలో తెలియ‌క ఎన్నో నిద్ర‌లేని రాత్రుళ్లు గ‌డిపాన‌ని విజ‌య్ అన్నారు. "మెగాస్టార్ చిరంజీవి సినిమాల‌కు కూడా నెగెటివ్ రివ్యూల వ‌ల్ల ఇబ్బందులు ఉన్నాయ‌ని కోర్టు ఇన్నాళ్ల‌కు గుర్తించ‌డం ఆనందంగా ఉంది. అయినా స‌మ‌స్య‌కు ఇది పూర్తి స్థాయిలో ప‌రిష్కారం అనుకోవ‌డం లేద‌ని" చెప్పారు. మ‌న‌లో మ‌న‌కు ఐక్య‌త లేక‌పోవ‌డం వ‌ల్లే ఇండ‌స్ట్రీలో ఇలాంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయంటూ విజ‌య్ ఈ ట్వీట్‌లో కామెంట్ పెట్టాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. అత‌డి ట్వీట్ వైర‌ల్ అవుతోంది.
విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా న‌టించిన కింగ్డ‌మ్ మూవీ గ‌త ఏడాది రిలీజైంది. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ప్ర‌స్తుతం రౌడీ జ‌నార్ధ‌న‌తో పాటు రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ హిస్టారిక‌ల్ మూవీ చేస్తున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

 

 

Advertisement

తాజావార్తలు

Advertisement