త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Rashmika Wedding | ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న విజ‌య్‌, ర‌ష్మిక పెళ్లి కార్డు – రిసెప్ష‌న్ ఎప్పుడంటే?

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న పెళ్లి ఫిబ్ర‌వ‌రి 26న జ‌రుగ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరి పెళ్లి శుభ‌లేఖ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. మార్చి 4న రిసెప్ష‌న్ జ‌రుగ‌నున్న‌ట్లు ఈ పెళ్లి కార్డులో పేర్కొన్నారు.

N

Entertainment | Published On Feb 16, 2026, 4.30 pm IST

Vijay Rashmika Wedding | ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న విజ‌య్‌, ర‌ష్మిక పెళ్లి కార్డు – రిసెప్ష‌న్ ఎప్పుడంటే?
Advertisement

Vijay Rashmika Wedding | విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు చాలా కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఫిబ్ర‌వ‌రి 26నఈ ల‌వ్‌బ‌ర్డ్స్ వివాహం రాజ‌స్థాన్‌లోని ఉద‌య్‌పూర్‌లో జ‌రుగ‌నుంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే పెళ్లి ప‌నులు మొద‌ల‌య్యాయి. శుభ‌లేఖ‌లు పంచ‌డం ప్రారంభించారు. ఆదివారం తెలంగాణ సీఏం రేవంత్ రెడ్డిని క‌లిసిన విజ‌య్ దేవ‌ర‌కొండ ఆయ‌న‌ను త‌మ పెళ్లికి ఆహ్వానించారు. ప‌లువురు టాలీవుడ్ స్టార్స్‌తో పాటు ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ను క‌లిసిన విజ‌య్ వారికి ఇన్విటేష‌న్ల‌ను ఇచ్చిన‌ట్లు స‌మాచారం.

వెడ్డింగ్ కార్డు వైర‌ల్‌...

కాగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌ల వెడ్డింగ్ కార్డు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. కుటుంబ‌స‌భ్యుల స‌మ‌క్షంలోనే ఫిబ్ర‌వ‌రి 26న త‌మ పెళ్లి వేడుక నిరాడంబ‌రంగా జ‌రుగ‌నుంద‌ని ఈ కార్డులో క‌నిపిస్తోంది. రిసెప్ష‌న్ డేట్‌తో పాటు వేదిక‌ను రివీల్ చేశారు. ...మార్చి 4 హైద‌రాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోట‌ల్‌లో రిసెప్ష‌న్ జ‌రుగ‌నుంద‌ని శుభ‌లేఖ‌లో పేర్కొన్నారు. ఈ పెళ్లి కార్డు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ముంబాయికి విజ‌య్‌..ర‌ష్మిక‌...

పెళ్లి కోసం షూటింగ్‌ల‌కు బ్రేకిచ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక సోమ‌వారం ముంబాయి వెళ్లారు. ఒకేసారి వీరిద్ద‌రు ముంబాయి ఏయిర్‌పోర్ట్‌లో అభిమానుల‌కు క‌నిపించారు. పెళ్లి ప‌నుల కోస‌మే విజ‌య్‌, ర‌ష్మిక‌ ముంబాయి వెళ్లిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎయిర్‌పోర్ట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చినఈ ల‌వ్ బ‌ర్డ్స్ ఒకే కారులో క‌లిసి వెళ్లారు.

రణ‌బాలి...

ప్ర‌స్తుతం విజ‌య్‌ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న క‌లిసి ర‌ణ‌బాలి అనే సినిమాలో న‌టిస్తున్నారు. పీరియాడిక‌ల్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో ఆంగ్లేయుల‌ను ఎదురించి పోరాడిన యోధుడిగా విజ‌య్ క‌నిపించ‌బోతున్నారు.విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూడో సినిమా ఇది. గ‌తంలో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో గీత‌గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ సినిమాలు వ‌చ్చాయి.

Advertisement
Advertisement