Tirumala | పుష్పక విమానంపై గోవర్ధనగిరిధారిగా మలయప్పస్వామి
TTD | శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మరో అపురూప ఆధ్యాత్మిక అనుభూతి కలిగింది. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన శనివారం సాయంత్రం పుష్పక విమానంపై మలయప్పస్వామివారు గోవర్ధనగిరిధారిగా దర్శనమిచ్చారు. రుక్మిణి, సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుని అలంకారంలో కొలువుదీరిన స్వామివారి దివ్యమంగళ రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దిన పుష్పక విమానంపై స్వామివారు విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు.
Devotional | Published On Oct 17, 2026, 6.51 pm IST
- రుక్మిణి, సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుడి అలంకారంలో దివ్య దర్శనం
- కొబ్బరి ఆకులతో 24 అడుగుల పుష్పక విమానం..
- సంప్రదాయ పుష్పాలతో సుందరంగా అలంకరణ
- పులకించిపోయిన భక్తజనం
TTD | శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు మరో అపురూప ఆధ్యాత్మిక అనుభూతి కలిగింది. ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన శనివారం సాయంత్రం పుష్పక విమానంపై మలయప్పస్వామివారు గోవర్ధనగిరిధారిగా దర్శనమిచ్చారు. రుక్మిణి, సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుని అలంకారంలో కొలువుదీరిన స్వామివారి దివ్యమంగళ రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పుష్పాలతో సుందరంగా తీర్చిదిద్దిన పుష్పక విమానంపై స్వామివారు విహరిస్తూ భక్తులకు అభయమిచ్చారు.
కొబ్బరి ఆకులతో అద్భుత రూపకల్పన
పుష్పక విమానాన్ని కొబ్బరి చెట్ల ఆకులతో ప్రత్యేకంగా రూపొందించడం ఈ సేవలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సుమారు 24 అడుగుల ఎత్తు, 15 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో తీర్చిదిద్దిన ఈ విమానం దాదాపు ఒక టన్ను బరువు ఉంటుంది. వివిధ రకాల సంప్రదాయ పుష్పాలతో విమానాన్ని సుందరంగా అలంకరించారు. విమానానికి ఇరువైపులా ఆంజనేయస్వామి, గరుత్మంతుడితో పాటు నాలుగు యుగాలకు చెందిన దేవతామూర్తుల రూపాలను ప్రత్యేకంగా రూపొందించారు. ప్రకృతి సిద్ధమైన కొబ్బరి ఆకులు, రంగురంగుల పుష్పాల సమ్మేళనంతో పుష్పక విమానం ప్రత్యేక శోభను సంతరించుకుంది.

పుష్పక విమాన సేవ
వారం రోజుల శ్రమ.. అద్భుత కళాఖండం
ఈ పుష్పక విమానం రూపకల్పన వెనుక వారం రోజుల పాటు సాగిన శ్రమ ఉంది. తమిళనాడుకు చెందిన నిపుణులు, టీటీడీ గార్డెన్ విభాగం సిబ్బంది సమన్వయంతో దీనిని సిద్ధం చేశారు. సంప్రదాయ కళానైపుణ్యాన్ని చాటేలా విమానాన్ని తీర్చిదిద్దినట్లు టీటీడీ గార్డెన్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. చెన్నైకి చెందిన దాత రాంప్రసాద్ భట్ ఈ పుష్పక విమానం రూపకల్పనకు సహకారం అందించారు.
అధిక మాసంలో ప్రత్యేక సేవ
నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పుష్పక విమానసేవకు ప్రత్యేకత ఉంది. అధిక మాసం సందర్భంగా మూడేళ్లకోసారి నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఈ సేవను నిర్వహించడం విశేషం. వాహనసేవల అనంతరం స్వామి, అమ్మవార్లు సేదతీరే సంప్రదాయంలో భాగంగా పుష్పక విమానసేవను చేపడతారు. ఆధ్యాత్మిక వైభవం, పుష్పాలంకరణ, సంప్రదాయ శిల్పకళల సమ్మేళనంగా సాగిన ఈ సేవ భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. కార్యక్రమంలో కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bhu-Aadhaar | ప్రతి భూ కమతానికి 14 అంకెల భూ ఆధార్
- ●Drugs | డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా బైక్ ర్యాలీ
- ●Maheshkumar Goud | ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మిత్రపక్షాలతో మాట్లాడతాం: మహేశ్కుమార్ గౌడ్
- ●Saddula Bathukamma | సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: సీఎం రేవంత్రెడ్డి
- ●Ranabaali Vs Jailer 2 | రణబాలి వర్సెస్ జైలర్ 2 - రజనీకాంత్, విజయ్ దేవరకొండ మధ్య గట్టిపోటీ - ఎక్కువ కలెక్షన్స్ దేనికంటే?
- ●DK Shivakumar | ప్రశ్నించే తత్వమే ప్రజాస్వామ్యానికి బలం.. యువ న్యాయవాదులతో డీకే శివకుమార్

Bhu-Aadhaar | ప్రతి భూ కమతానికి 14 అంకెల భూ ఆధార్

Drugs | డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా బైక్ ర్యాలీ

Maheshkumar Goud | ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మిత్రపక్షాలతో మాట్లాడతాం: మహేశ్కుమార్ గౌడ్

Saddula Bathukamma | సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: సీఎం రేవంత్రెడ్డి





