Bhu-Aadhaar | ప్రతి భూ కమతానికి 14 అంకెల భూ ఆధార్
Bhu-Aadhaar | ఆధార్ నంబర్ లాగానే ఇక ప్రతి భూ కమతానికి యూనిక్ ఐడీ నంబర్ ఇవ్వబోతున్నారు. 14 అంకెలు కలిగిన యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ( ULPIN ) ను అనుసరిస్తూ ఈ కొత్త నంబర్‌ను కేటాయించనున్నారు. అయితే.. ఇదంతా జరిగే ముందే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,954 రెవెన్యూ గ్రామాల్లో సమగ్ర భూ రీ సర్వే పూర్తి చేసిన తర్వాతే.. ఈ భూ ఆధార్( Bhu-Aadhaar ) ను ఇవ్వనున్నారు.
సిద్ధం చేస్తున్న రెవెన్యూ అధికారులు
1948లో 40 లక్షల సర్వే నంబర్లు
ప్రస్తుతం 2 కోట్ల 29 లక్షల సర్వే నంబర్లు
యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నంబర్‌ను
అనుసరించి ఐడీ తయారు చేయాలంటూ
గతేడాది ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
తొలుత పాలేరులో భూ ఆధార్ ఇచ్చేందుకు
రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు
10,954 రెవెన్యూ గ్రామాల్లో
మూడు దశల్లో సమగ్ర భూ రీసర్వే
సర్వే ముగిసిన వెంటనే.. ఐడీల కేటాయింపు
Bhu-Aadhaar | త్రినేత్ర న్యూస్ : ఆధార్ నంబర్ లాగానే ఇక ప్రతి భూ కమతానికి యూనిక్ ఐడీ నంబర్ ఇవ్వబోతున్నారు. 14 అంకెలు కలిగిన యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ( ULPIN ) ను అనుసరిస్తూ ఈ కొత్త నంబర్‌ను కేటాయించనున్నారు. అయితే.. ఇదంతా జరిగే ముందే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,954 రెవెన్యూ గ్రామాల్లో సమగ్ర భూ రీ సర్వే పూర్తి చేసిన తర్వాతే.. ఈ భూ ఆధార్( Bhu-Aadhaar ) ను ఇవ్వనున్నారు.
ముందు సర్వే.. ఆ తర్వాతే భూ ఆధార్

రాష్ట్రంలో భూ సమస్యలు, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపుతూ ప్రతి భూకమతానికి కచ్చితమైన హద్దులు నిర్ణయించి, భూ యాజమాన్య హక్కులపై స్పష్టత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూ రీ సర్వేను ప్రారంభించింది. తొలి దశలో ప్రయోగాత్మకంగా జిల్లాకు 70 గ్రామాల చొప్పున 32 జిల్లాల్లో (హైదరాబాద్ మినహా) 2720 గ్రామాల్లో ప్రస్తుతం సర్వే జరుగుతున్నది. వీటిలో ఇప్పటికే 285 రెవెన్యూ గ్రామాల్లో సర్వే పూర్తయింది. సర్వే పూర్తయిన గ్రామాల్లో భూ యజమానుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు నోటీసులు జారీ చేశారు. రీసర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూకమతానికి కచ్చితమైన సరిహద్దులను నిర్ణయించి, ప్రతి సర్వే నంబర్‌కు ప్రత్యేక భూదార్ నంబర్ కేటాయించనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం (అక్టోబర్ 17) సచివాలయంలో ప్రకటించారు. డీజీపీఎస్ ద్వారా సేకరించిన సర్వే సమాచారాన్ని క్యూజీఐఎస్ సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం చేసి భూ భారతి పోర్టల్‌లో నమోదు చేస్తామన్నారు. తెలంగాణ ప్రాంతంలో 1948 నాటికి సుమారు 40 లక్షల సర్వే నంబర్లు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 2 కోట్ల 29 లక్షలకు పెరిగిందని వివరించారు. రాష్ట్రంలోని అన్ని సర్వే నంబర్లకు దశలవారీగా భూ ఆధార్ నంబర్లు కేటాయించేందుకు ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ రూపొందించిందని తెలిపారు.
తొలుత.. పాలేరులో భూ ఆధార్
కాగా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పాలేరులో భూ ఆధార్ నంబర్లు కేటాయించనున్నారు. నేలకొండపల్లి మండలం కొంగర గ్రామ పరిధిలో ఉన్న మొత్తం 665 ఎకరాలలో వందశాతం రీసర్వేను విజయవంతంగా పూర్తి చేశారు. త్వరలోనే అక్కడి భూ కమతాల యజమానులకు భూదార్ పట్టాల పంపిణీ చేయనున్నారు.
అత్యాధునిక టెక్నాలజీతో
భూ ఆధార్ ద్వారా.. ప్రతి అంగుళం భూమికి స్పష్టమైన హద్దులు, ప్రతి రైతుకు భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర భూ రీ సర్వేను నిర్వహిస్తున్నది. అయితే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ 1936 నాటి నిజాం కాలం సర్వే రికార్డులే ప్రధాన ఆధారాలుగా ఉన్నాయి.. కాలక్రమేణా భూముల విభజనలు, సర్వే నంబర్ల ఉపవిభాగాలు పెరిగిపోయాయి.భూ కమతాల సరిహద్దుల్లో కాలక్రమేణా లెక్కలేనన్ని మార్పులు చోటుచేసుకోవడం వంటి కారణాలతో భూముల అసలు హద్దులపై స్పష్టత కొరవడింది. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు డీజీపీఎస్, రోవర్లు, జీఐఎస్, క్యూజీఐఎస్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.
సులువుగా సాధ్యమయ్యేనా?
తెలంగాణలో నిజాం కాలం నాటి నుంచి సంక్లిష్టంగా ఉన్న వివిధ రకాలైన భూముల సర్వే నంబర్లను యూనిక్ నంబర్లుగా మార్చడం అంత సులువైన విషయమేం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెవెన్యూ గ్రామాల్లో 47 శాతం గ్రామాల్లో కనీసం ఒక సర్వే నంబర్ పైనైనా కోర్టు కేసులో ఎంట్రీ ఉంది. దాదాపు 5 లక్షలకు పైగా సర్వే నంబర్లు పెండింగ్‌లో ఉన్నాయి. సెక్షన్ 22 ఏ కింద నిషేధిత భూముల జాబితాలో కూడా వేల సంఖ్యలో సర్వే నంబర్లు కోర్టు వివాదాల్లో చిక్కుకుని ఉన్నాయి. ఇవేవీ తేలకుండా.. సమగ్ర భూ రీసర్వే కొలిక్కి వస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
తాజావార్తలు
- ●Drugs | డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా బైక్ ర్యాలీ
- ●Maheshkumar Goud | ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మిత్రపక్షాలతో మాట్లాడతాం: మహేశ్‌కుమార్ గౌడ్
- ●Saddula Bathukamma | సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: సీఎం రేవంత్‌రెడ్డి
- ●Ranabaali Vs Jailer 2 | రణబాలి వర్సెస్ జైలర్ 2 - రజనీకాంత్, విజయ్ దేవరకొండ మధ్య గట్టిపోటీ - ఎక్కువ కలెక్షన్స్ దేనికంటే?
- ●DK Shivakumar | ప్రశ్నించే తత్వమే ప్రజాస్వామ్యానికి బలం.. యువ న్యాయవాదులతో డీకే శివకుమార్
- ●Bathukamma Song in Dubai | ‘ఎడారిలో తంగేడు వనమే మొలిసేనో’.. దుబాయ్‌లో ‘మిట్టపల్లి’ బతుకమ్మ పాట ఆవిష్కరణ

Drugs | డ్రగ్స్ రహిత భారత్ లక్ష్యంగా బైక్ ర్యాలీ

Maheshkumar Goud | ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మిత్రపక్షాలతో మాట్లాడతాం: మహేశ్‌కుమార్ గౌడ్

Saddula Bathukamma | సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: సీఎం రేవంత్‌రెడ్డి

Ranabaali Vs Jailer 2 | రణబాలి వర్సెస్ జైలర్ 2 - రజనీకాంత్, విజయ్ దేవరకొండ మధ్య గట్టిపోటీ - ఎక్కువ కలెక్షన్స్ దేనికంటే?




