Ranabaali Vs Jailer 2 | రణబాలి వర్సెస్ జైలర్ 2 – రజనీకాంత్, విజయ్ దేవరకొండ మధ్య గట్టిపోటీ – ఎక్కువ కలెక్షన్స్ దేనికంటే?
ఈ దసరాకు రజనీకాంత్ జైలర్ 2తో పాటు విజయ్ దేవరకొండ రణబాలి తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఈ రెండు సినిమాల్లో జైలర్ 2 కలెక్షన్స్‌తో అదరగొడుతోంది. రెండు రోజుల్లోనే 211 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. శుక్రవారం విడుదలైన రణబాలి మొదటిరోజు 18 కోట్ల వసూళ్లతో పర్వాలేదనిపించింది.
Entertainment | Published On Oct 17, 2026, 6.21 pm IST
Ranabaali Vs Jailer 2 | ఈ దసరాకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద విజయ్ దేవరకొండ రణబాలితో పాటు రజనీకాంత్ జైలర్ 2 పోటీపడ్డాయి. బ్రిటీష్ ఇండియా కాలం నాటి కథతో హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ రణబాలి సినిమాను తెరకెక్కించారు. కమర్షియల్ యాక్షన్ మూవీగా జైలర్ 2 రూపొందింది. నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హృతిక్ రోషన్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్‌తో పాటు విజయ్ సేతుపతి గెస్ట్ రోల్స్‌లో కనిపించారు.
ఈ రెండు సినిమాల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
నైజాంలో హయ్యెస్ట్...
రణబాలి మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రీమియర్స్, అదనపు టికెట్ ధరలు లేకుండా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ హిస్టారికల్ మూవీ తొలి రోజు మిక్స్డ్ టాక్‌తో సంబంధం లేకుండా వరల్డ్ వైడ్‌గా 18 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. నైజాంలో 3.18 కోట్ల వసూళ్లను సాధించగా...ఆంధ్రాలో 2.20 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. 43 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన రణబాలి మొదటి రోజు ఇరవై శాతం రికవరీ సాధించింది. శుక్రవారంతో పోలిస్తే శనివారం వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
రణబాలి సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. బ్రిటీషర్లు సాగించిన అకృత్యాలను ఎదురించి పోరాడిన రణబాలి అనే యోధుడి కథతో డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను రూపొందించారు.
జైలర్ 2
రజనీకాంత్ జైలర్ 2 మూవీ కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే ఈ యాక్షన్ కామెడీ రెండు వందల కోట్లకుపైగా వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేసింది. గురు, శుక్రవారాల్లో కలిపి ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా 211 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో 24.50 కోట్ల వసూళ్లతో అదరగొట్టింది. తొలిరోజు 10.35 కోట్లు రాగా...రెండో రోజు 5.42 కోట్ల షేర్ కలెక్షన్స్‌తో జైలర్ 2 తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదనిపించింది. వరల్డ్ వైడ్‌గా మొదటి రోజు అరవై, రెండో రోజు 40 కోట్ల వసూళ్లు వచ్చాయి. రజనీకాంత్ కెరీర్లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా నిలిచింది.
జైలర్‌కు కొనసాగింపుగా...
జైలర్ మూవీకి కొనసాగింపుగా డైరెక్టర్ నెల్సన్ ఈ సినిమాను రూపొందించారు. విగ్రహాలను దొంగిలించే ముఠా బారి నుంచి తన కుటుంబాన్ని ముత్తువేల్ పాండియన్ ఎలా కాపాడుకున్నాడనే అంశాలతో జైలర్ 2 తెరకెక్కింది. ఈ సినిమాలో రజనీకాంత్ నటన, హృతిక్ రోషన్ గెస్ట్ రోల్‌తో పాటు కామెడీ, అనిరుధ్ బీజీఎమ్ బాగున్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Sheela Rajkumar | రణబాలిలో అలివేలు – జైలర్ 2లో పార్వతి – రెండు సినిమాల్లో నటించిన తమిళ నటి ఎవరంటే?
అక్టోబర్ 16, 2026

Vijay Deverakonda | అఫీషియల్ – “మనం” డైరెక్టర్‌తో విజయ్ దేవరకొండ సినిమా – జానర్ ఇదే
అక్టోబర్ 16, 2026

Ranabaali Review | రణబాలి రివ్యూ … విమర్శలకు బదులిచ్చేందుకు విజయ్ చేసిన సినిమానా?
అక్టోబర్ 16, 2026
తాజావార్తలు
- ●Maheshkumar Goud | ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మిత్రపక్షాలతో మాట్లాడతాం: మహేశ్‌కుమార్ గౌడ్
- ●Saddula Bathukamma | సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: సీఎం రేవంత్‌రెడ్డి
- ●DK Shivakumar | ప్రశ్నించే తత్వమే ప్రజాస్వామ్యానికి బలం.. యువ న్యాయవాదులతో డీకే శివకుమార్
- ●Bathukamma Song in Dubai | ‘ఎడారిలో తంగేడు వనమే మొలిసేనో’.. దుబాయ్‌లో ‘మిట్టపల్లి’ బతుకమ్మ పాట ఆవిష్కరణ
- ●Land Survey | మూడు దశల్లో సమగ్ర భూసర్వే.. ఆధార్ తరహాలో భూదార్ కార్డులు
- ●Dudimetla Balaraju Yadav | కేసీఆర్ ఫ్యామిలీపై అబద్ధాలు చెప్పే ఆ ఆరుగురు ఎవరంటే..

Maheshkumar Goud | ఎమ్మెల్సీ ఎన్నికల కోసం మిత్రపక్షాలతో మాట్లాడతాం: మహేశ్‌కుమార్ గౌడ్

Saddula Bathukamma | సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ: సీఎం రేవంత్‌రెడ్డి

DK Shivakumar | ప్రశ్నించే తత్వమే ప్రజాస్వామ్యానికి బలం.. యువ న్యాయవాదులతో డీకే శివకుమార్

Bathukamma Song in Dubai | ‘ఎడారిలో తంగేడు వనమే మొలిసేనో’.. దుబాయ్‌లో ‘మిట్టపల్లి’ బతుకమ్మ పాట ఆవిష్కరణ



