త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Rashmika Wedding | ఎయిర్‌పోర్ట్‌లో విజయ్, రష్మిక – పెళ్లి త‌ర్వాత తొలిసారి జంట‌గా అభిమానుల‌ ముందుకు…

పెళ్లి త‌ర్వాత తొలిసారి అభిమానుల ముందుకొచ్చారు నూత‌న దంప‌తులు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌. ఉద‌య్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో జంట‌గా క‌నిపించారు. వీరి ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

N

Entertainment | Published On Feb 27, 2026, 4.03 pm IST

Vijay Rashmika Wedding | ఎయిర్‌పోర్ట్‌లో విజయ్, రష్మిక – పెళ్లి త‌ర్వాత తొలిసారి జంట‌గా అభిమానుల‌ ముందుకు…
Advertisement

Vijay Rashmika Wedding | నూత‌న‌ దంప‌తులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి త‌ర్వాత తొలిసారి అభిమానుల ముందుకొచ్చారు. శుక్ర‌వారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో జంట‌గా క‌నిపించారు. విరోష్‌కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. గురువారం మూడుముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక మంద‌న్న. ఉద‌య్‌పూర్‌లోని మెమోంటోస్ హోట‌ల్‌లో హిందూ, కొడ‌వ సంప్ర‌దాయ ప‌ద్ద‌తుల్లో వీరి పెళ్లి జ‌రిగింది. పెళ్లి ఫొటోల‌ను విజ‌య్‌, ర‌ష్మిక అభిమానుల‌తో పంచుకున్నారు.

ర‌ష్మిక దేవ‌ర‌కొండ‌...

పెళ్లి వేడుక అనంత‌రం శుక్ర‌వారం ఉద‌యం విజ‌య్‌, ర‌ష్మిక హైద‌రాబాద్ తిరుగుప‌య‌న‌మ‌య్యారు. ఉద‌య్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌కు జంట‌గా చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్ వద్ద తమ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అభివాదం చేశారు. ఫ్ల‌యింగ్ కిస్సులు ఇచ్చారు. ర‌ష్మిక దేవ‌ర‌కొండ అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. వారి పిలుపుతో ర‌ష్మిక సిగ్గుప‌డింది. విజ‌య్ కూడా చిరున‌వ్వులు చిందించాడు. ఉద‌య్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో విజ‌య్‌, ర‌ష్మిక క‌నిపించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి

మూడు రోజులు...

విరోష్ పెళ్లి వేడుక‌లు మొత్తం మూడు రోజులు జ‌రిగాయి. ఈ పెళ్లి వేడుక‌లో కుటుంబ‌స‌భ్యులు, అతి కొద్ది మంది స‌న్నిహితులు మాత్ర‌మే అటెండ్ అయ్యారు. విజ‌య్‌, ర‌ష్మిక రిసెప్ష‌న్ మార్చి 4న హైద‌రాబాద్‌లో జ‌రుగ‌నుంది. రిసెప్ష‌న్‌కు రాజ‌కీయ, సినీ ప్ర‌ముఖులు అటెండ్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.
ప్ర‌స్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న క‌లిసి ర‌ణ‌బాలి అనే సినిమా చేస్తోన్నారు. మార్చి 10 త‌ర్వాత క‌లిసి వీరిద్ద‌రు షూటింగ్‌లో పాల్గొన‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ర‌ణ‌బాలి కంటే ముందు గీత‌గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ సినిమాలు చేశారు.

Advertisement
Advertisement