త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ranabaali | ర‌ణ‌బాలి షూటింగ్ కంప్లీట్ -పెళ్లి ఫొటోతో విరోష్ జోడీ స‌ర్‌ప్రైజ్‌

విజ‌య్ దేవ‌ర‌కొండ , ర‌ష్మిక మంద‌న్న హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న ర‌ణ‌బాలి షూటింగ్ పూర్త‌య్యింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ మేక‌ర్స్ ఓ రెట్రో పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ బ్లాక్ అండ్ వైట్ పోస్ట‌ర్‌లో నూత‌న వ‌ధూవ‌రులుగా విజ‌య్‌, ర‌ష్మిక క‌నిపిస్తోన్నారు.

N

Entertainment | Published On Sep 17, 2026, 3.10 pm IST

Ranabaali | ర‌ణ‌బాలి షూటింగ్ కంప్లీట్ -పెళ్లి ఫొటోతో  విరోష్ జోడీ స‌ర్‌ప్రైజ్‌
Advertisement

Ranabaali | పెళ్లి త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా న‌టిస్తున్న తొలి మూవీ ర‌ణ‌బాలి ద‌స‌రాకు థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. బ్రిటీష‌ర్ల‌ను ఎదురించి పోరాడిన రాయ‌ల‌సీమ‌కు చెందిన ఓ యోధుడి క‌థ‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది.

షూటింగ్ కంప్లీట్‌...

బుధ‌వారం నాటితో ర‌ణ‌బాలి షూటింగ్ పూర్త‌య్యింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ డైరెక్ట‌ర్ రాహుల్ సాంకృత్యాన్ సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. త‌న‌తో పాటు త‌న టీమ్ 130 రోజుల క‌ష్టానికి నిద‌ర్శ‌నంగా ఈ మూవీ నిలుస్తుంద‌ని అన్నాడు.

బ్లాక్ అండ్ వైట్‌...

షూటింగ్ పూర్త‌యిన సంద‌ర్భంగా మేక‌ర్స్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న కొత్త పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. ఈ బ్లాక్ అండ్ వైట్ పోస్ట‌ర్‌లో పెళ్లి కొడుకులా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, పెళ్లికూతురు గెట‌ప్‌లో ర‌ష్మిక క‌నిపిస్తోన్నారు. ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

రాయ‌ల‌సీమ‌...

1870 0 - 80 ద‌శ‌కంలో రాయ‌ల‌సీమ ప్రాంతంలో ఆంగ్లేయులు సాగించిన అకృత్యాలు, వారిని ఎదురించి పోరాడిన ఓ వీరుడి క‌థ‌తో ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న భార్యాభ‌ర్త‌లుగానే క‌నిపించ‌బోతుంది. ర‌ణ‌బాలిగా విజ‌య్‌, జ‌య‌మ్మ పాత్ర‌లో ర‌ష్మిక క‌నిపించ‌బోతుంది.

ద‌స‌రాకు థియేట‌ర్ల‌లోకి...

ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 16న ర‌ణ‌బాలి థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్లు అజ‌య్ - అతుల్ మ్యూజిక్ అందిస్తున్నారు. విజ‌య్‌, ర‌ష్మిక కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూడో మూవీ ఇది. గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి గీత‌గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ సినిమాలు చేశారు.

 

Advertisement
Advertisement