Sobhita Dhulipala | పదహారేళ్లకే ఇళ్లు వదిలిపెట్టి వెళ్లిపోయా – టాలీవుడ్‌పై శోభిత ధూళిపాళ కామెంట్స్ వైరల్
కొత్తగా ఏదైనా చేయాలని కలలు కనే వారిని విమర్శించే ధోరణి తెలుగు వాళ్లలో ఎక్కువగా ఉంటుందని అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ అన్నది. ఇక్కడి వాతావరణం నచ్చకే తాను పదహారేళ్ల వయసులోనే ముంబై వెళ్లిపోయినట్లు చెప్పింది. టాలీవుడ్‌ను ఉద్దేశించే ఇన్‌డైరెక్ట్‌గా శోభిత ఈ కామెంట్లు చేసిందని నెటిజన్లు అంటున్నారు.
Entertainment | Published On Sep 17, 2026, 2.50 pm IST
Sobhita Dhulipala | టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలను ప్రోత్సహించే సంస్కృతి చాలా తక్కువేననే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. అవకాశాల విషయంలో ఉత్తరాది వారితో పోలిస్తే తెలుగు అమ్మాయిలు ఎప్పుడు వెనుకబడే ఉంటారని అంటుంటారు. ఈ వివక్షపై చాలా మందే తెలుగు హీరోయిన్లు గత గళాన్ని వినిపించారు. నార్త్ హీరోయిన్ల కంటే తాము ఎందులో తక్కువో చెప్పాలంటూ విమర్శలు గుప్పించారు. అయినా ఈ ధోరణి మారడం లేదనే వాదన ఉంది. తాజాగా టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు ఎదురవుతోన్న వివక్షపై అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ రియాక్ట్ అయ్యింది. ఇక్కడి వాతావరణం నచ్చకే తాను పదహారేళ్ల వయసులోనే ఇళ్లు వదిలిపెట్టి ముంబాయికి వెళ్లిపోయినట్లు చెప్పింది.
సోషల్ మీడియా ఇన్‌ప్లూయెన్సర్...
హైదరాబాద్‌కు చెందిన ఇన్‌ప్లూయెన్సర్ అహల్య సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. "తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు గొప్పవంటూ తెగ మాట్లాడుతుంటారు. కానీ రియాలిటీలో కొత్తగా ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే సపోర్ట్ చేయడానికి ఒక్కరూ ముందుకు రారు. అందులో గొప్పతనం ఏముందంటూ నిరుత్సాహపరుస్తారు. తెలుగు వారికి తెలుగు వారే శత్రువులు" అంటూ పోస్ట్ పెట్టింది. ఆమె పోస్ట్‌కు శోభిత ధూళిపాళ రిప్లై ఇచ్చింది. హండ్రెడ్ పర్సెంట్ రైట్ అంటూ పేర్కొన్నది. తనకు ఇలాంటి పరిస్థితే ఎదురైందని అన్నది.
ముంబై వెళ్లిపోయా...
"అందరిలా కాకుండా వినూత్నంగా ఏదైనా చేయాలని కలలు కనే వారిని విమర్శించేధోరణి మనవాళ్లలో చాలా ఉంటుంది. నిరూత్సాహపరచడం మనవాళ్లకే అలవాటే. ప్రోత్సహించేవాళ్ల కంటే తీర్పులు చెప్పేవాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. ఇక్కడి వాతావరణం నచ్చకే నేను ఇంటికి దూరమయ్యా. పదహారేళ్లకే ముంబై వెళ్లిపోయా. సక్సెస్ అవుతానో లేదో నమ్మకం లేకపోయినా రిస్క్ తీసుకోవడమే మంచిది అనిపించింది" అని శోభిత అన్నది. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయానని తెలిపింది. ఆమె కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీని ఉద్దేశించే శోభిత ఈ కామెంట్లు చేసిందని నెటిజన్లు అంటున్నారు.
బాలీవుడ్ సినిమాలతో...
శోభిత సినీ కెరీర్ బాలీవుడ్ సినిమాలతోనే మొదలైంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన రమణ్ రాఘవ్‌తో హీరోయిన్‌గా పరిచయమైంది. చెఫ్, ది బాడీ, ఘోస్ట్ స్టోరీస్, లవ్ సితారతో పాటు పలు సినిమాలు చేసింది.
తెలుగులో మేజర్, గూఢచారి సినిమాలు చేసింది. నాగచైతన్యతో పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించింది. ప్రస్తుతం తమిళంలో వెట్టువమ్ సినిమా చేస్తోంది. ఈ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Graduate MLC Elections Voters Schedule Release | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా షెడ్యూల్ విడుదల
- ●Brahmotsavam | తిరుమలలో వైభవంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు.. సింహవాహనంపై మలయప్ప విహారం
- ●Amazon | అమెజాన్ భారీ డీల్.. జనరాక్ షేర్లు ఏకంగా 40 శాతం జంప్..
- ●Sri Meenakshi Sundareshwarar Temple | 17 ఏళ్ల తర్వాత అట్టహాసంగా మధురై మీనాక్షి ఆలయ మహా కుంభాభిషేకం.. భక్తకోటితో కిటకిటలాడిన ప్రాంగణం
- ●Tata Sons | టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్
- ●Defamation on Maheshkumar, Addhanki Dayakar | టీపీసీసీ చీఫ్, అద్దంకిపై పరువు నష్టం దావా వేసిన హరీశ్ రావు

Graduate MLC Elections Voters Schedule Release | గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా షెడ్యూల్ విడుదల

Brahmotsavam | తిరుమలలో వైభవంగా వెంకన్న బ్రహ్మోత్సవాలు.. సింహవాహనంపై మలయప్ప విహారం

Amazon | అమెజాన్ భారీ డీల్.. జనరాక్ షేర్లు ఏకంగా 40 శాతం జంప్..

Sri Meenakshi Sundareshwarar Temple | 17 ఏళ్ల తర్వాత అట్టహాసంగా మధురై మీనాక్షి ఆలయ మహా కుంభాభిషేకం.. భక్తకోటితో కిటకిటలాడిన ప్రాంగణం






