Rashmika Mandanna | పెళ్లి కూతురిలా రష్మిక మందన్న – రణబాలి పోస్ట్‌పోన్ రూమర్లపై క్లారిటీ
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న రణబాలి మూవీ వాయిదాపడనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లపై రష్మిక పోస్టర్‌తో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ కొత్త పోస్టర్‌లో పెళ్లి కూతురిలా రష్మిక కనిపిస్తోంది.
Entertainment | Published On Jul 23, 2026, 5.46 pm IST
Rashmika Mandanna | పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తోన్న రణబాలి మూవీ వాయిదాపడనున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కారణంగా సెప్టెంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం అనుమానమేనని అంటున్నారు. విజయ్ దేవరకొండ వెనక్కి తగ్గడంతో అదే డేట్‌కు అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఎపిక్ మూవీ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
పోస్ట్‌పోన్ రూమర్లు....
ఈ పోస్ట్‌పోన్ రూమర్లపై మేకర్స్ రష్మిక మందన్న పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇందులో పెళ్లి కూతురిలా రెడీ అయ్యి రష్మిక మందన్న కనిపిస్తోంది. నుదిటన బాసింగం, పాపిడి బిళ్ల, ముక్కుపుడక ధరించి ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్‌లో రష్మిక మందన్నతో పాటు విజయ్ దేవరకొండ కూడా కనిపిస్తున్నాడు. సిక్స్‌ప్యాక్‌లో యోధుడిగా దర్శనమిచ్చాడు. రణబాలి కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నో ఛేంజ్...
ఈ పోస్టర్ ద్వారా రణబాలి పోస్ట్‌పోన్ రూమర్లను మేకర్స్ కొట్టిపడేశారు. సెప్టెంబర్ 11నే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రకటించారు. రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పు లేదని హింట్ ఇచ్చారు.
రణబాలి మూవీకి రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. హిస్టారికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో హాలీవుడ్ నటుడు ఆర్నాల్ వోస్లో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. బ్రిటీషర్లను ఎదురించి పోరాడిన రాయలసీమకు చెందిన రణబాలి అనే వీరుడిగా విజయ్ నటిస్తోండగా....అతడి భార్య జయమ్మ పాత్రలో రష్మిక కనిపించబోతుంది.
ఐదు భాషల్లో రిలీజ్....
రణబాలి సినిమాను ఐదు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు అజయ్ - అతుల్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. రణబాలి మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
రణబాలితో పాటు ప్రస్తుతం తెలుగులో రౌడీ జనార్ధన సినిమా చేస్తోన్నాడు విజయ్. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ డిసెంబర్‌లో థియేటర్లలోకి రాబోతుంది.
Read More....
https://www.trinethra.news/entertainment/sreeleela-nithiin-set-for-third-collaboration-in-upcoming-telugu-film-62329.html
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | నేషనల్ క్రష్ కోసం సెంటిమెంట్ బ్రేక్ – రామ్‌చరణ్, సుకుమార్ సినిమాపై కొత్త బజ్
జులై 21, 2026

Dimple Hayathi | ఫ్లాపుల్లో ఉన్నా క్రేజ్ తగ్గేదేలే… డింపుల్‌కు హ్యాట్రిక్ ఛాన్స్ ఇచ్చిన మాస్ మహారాజా
జులై 20, 2026

Rashmika Mandanna | రణబాలి అప్డేట్ లీక్ చేసిన రష్మిక – ఇన్‌స్టా పోస్ట్ వైరల్
జులై 12, 2026
తాజావార్తలు
- ●Uttam Kumar Reddy | కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్రానికి సమగ్ర నివేదిక : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
- ●Rajagopal Reddy | ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు మార్కెట్ ధరకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
- ●KTR | ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం..
- ●CS Sanjay Jaju | నెలరోజుల్లో విద్యార్థులకు కొత్త యూనిఫారాలు
- ●Rakul Preet Singh | సినిమా బడ్జెట్ 1100 కోట్లు - రకుల్ రెమ్యూనరేషన్ కోటి
- ●Special Traffic Bureau | ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్.. తెరపైకి ప్రత్యేక బ్యూరో

Uttam Kumar Reddy | కాళేశ్వరం బ్యారేజీలపై కేంద్రానికి సమగ్ర నివేదిక : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

Rajagopal Reddy | ట్రిపుల్ ఆర్ భూనిర్వాసితులకు మార్కెట్ ధరకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలి: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

KTR | ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం ఫైట్ చేస్తూనే ఉంటాం..

CS Sanjay Jaju | నెలరోజుల్లో విద్యార్థులకు కొత్త యూనిఫారాలు



